E-Paper
Advertisement

ఆస్తి కోసం వెళ్తే బయటపడే అమ్మ సీక్రెట్ లవ్ స్టోరీ… డీఎన్ఏ టెస్ట్ తో దిమ్మతిరిగే ట్విస్ట్

ఆస్తి కోసం వెళ్తే బయటపడే అమ్మ సీక్రెట్ లవ్ స్టోరీ… డీఎన్ఏ టెస్ట్ తో దిమ్మతిరిగే ట్విస్ట్
Advertisement

Mystery Drama on OTT : ఒక లీగల్ నోటీసు… ఎప్పుడూ చూడని తాతయ్య వదిలిన కోట్ల విలువైన ప్రైవేట్ ఐలాండ్… తల్లి గతం గురించి దాచిన రహస్యాలు… అక్కడికి వెళ్లిన తర్వాత తనకు అసలు తెలియని మరో సోదరి ఎదురుపడితే ? కుటుంబం మొత్తం దాచిపెట్టిన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ, ప్రేమ, అనుబంధాలు, మిస్టరీలతో కథ ముందుకు సాగితే ? అలాంటి ఎమోషనల్ ఫ్యామిలీ మిస్టరీతో రూపొందిన అమెరికన్ టీన్ డ్రామా సిరీస్ ‘స్టెర్లింగ్ పాయింట్ సీజన్ 1’ (Sterling Point Season 1). కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్, సస్పెన్స్… ఇలాంటి అంశాలన్నీ ఉన్న ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో తెలుగులో చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

న్యూయార్క్‌లో నివసించే 17 ఏళ్ల కవలలు యానీ జాకబ్సన్, కానర్. ఈ టీనేజర్లు చిన్నప్పటి నుంచే తల్లి లేకుండా పెరిగిన వీరిద్దరిని పెంపుడు తండ్రి స్టీవెన్ ఎంతో క్రమశిక్షణతో పెంచుతుంటాడు. అయితే వారి కుటుంబ గతం గురించి మాత్రం ఎప్పుడూ మాట్లాడడు. ముఖ్యంగా కెనడాలో నివసించే వారి తాతయ్య పేరు వినడానికే ఇష్టపడడు.

Advertisement

ఒకరోజు యానీ తాను ఎంతో ఆశగా ఎదురుచూసిన సమ్మర్ ప్రోగ్రామ్‌లో అవకాశం కోల్పోయి నిరాశలో ఉండగా, ఆమె జీవితాన్ని మార్చేసే ఒక లీగల్ నోటీసు వస్తుంది. ఎన్నడూ కలవని తాతయ్య గోర్డాన్ మరణించాడని, కెనడాలోని ముస్కోకా ప్రాంతంలో ఉన్న ‘స్టెర్లింగ్ పాయింట్’ అనే అందమైన ప్రైవేట్ దీవిని తన మనవరాళ్ల పేరున రాశాడని తెలుస్తుంది.

తల్లి గతం గురించి నిజాలు తెలుసుకోవాలనే ఆసక్తితో యానీ ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా కెనడాకు బయలుదేరుతుంది. ప్రశాంతంగా కనిపించే ఆ ఐలాండ్‌లో అడుగుపెట్టిన క్షణమే ఆమెకు ఊహించని షాక్ ఎదురవుతుంది. అక్కడ ఇప్పటికే రమోనా అనే యువతి నివసిస్తూ ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఆమె రూపం యానీ మరణించిన తల్లిని అచ్చం పోలి ఉంటుంది.

Advertisement

మొదట అపరిచితురాలిగా కనిపించిన రమోనా గురించి వెతుకుతుండగా, పాత లేఖలు, కుటుంబ పత్రాలు బయటపడతాయి. వాటి ద్వారా రమోనా మరెవరో కాదు… యానీ తల్లికి పుట్టిన మరో కూతురు, అంటే తన సొంత సోదరి అనే నిజం తెలుస్తుంది. ఈ ట్విస్ట్‌తో యానీ జీవితమే ఒక్కసారిగా మారిపోతుంది.

ఇంతలో యానీ కనిపించకపోవడంతో ఆమె సోదరుడు కానర్ కూడా ఆ ఐలాండ్‌కు చేరుకుంటాడు. దీవిని అమ్మేసి ఆస్తిని పంచుకోవాలని కానర్ భావిస్తే, యానీ మాత్రం తల్లి జ్ఞాపకాలను కాపాడాలని కోరుకుంటుంది. ఈ విభేదాల మధ్య అక్కడి స్థానిక యువకులు ఎల్లిస్, రోరీలతో పరిచయం ఏర్పడి, యానీ జీవితంలో ఒక ప్రేమ త్రికోణం కూడా మొదలవుతుంది.

అయితే ఈ సిరీస్ కేవలం రొమాన్స్‌తోనే ఆగిపోదు. వారి తల్లి గోల్డీ అసలు ఎలా మరణించింది ? రమోనా పుట్టుక వెనుక దాగి ఉన్న నిజం ఏమిటి ? తండ్రి స్టీవెన్ ఎందుకు ఈ దీవి గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడడు ? తాతయ్య చివరి కోరిక వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలు చూపిస్తూ కథ భావోద్వేగంగా, ఉత్కంఠభరితంగా సాగుతుంది.

తెలుగులోనే స్ట్రీమింగ్

ఫ్యామిలీ ఎమోషన్స్, టీనేజ్ రిలేషన్‌షిప్స్, అందమైన ప్రకృతి దృశ్యాలు, మెల్లగా బయటపడే కుటుంబ రహస్యాలు ఈ సిరీస్‌ను ఇంట్రెస్టింగ్ గా మార్చాయి. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త ట్విస్టులు, భావోద్వేగ క్షణాలు ప్రేక్షకులను కథతో కనెక్ట్ చేస్తాయి. ‘స్టెర్లింగ్ పాయింట్ సీజన్ 1’ ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్, తెలుగు సబ్‌టైటిల్స్‌తో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు, టీన్ రిలేషన్‌షిప్స్, మిస్టరీ థ్రిల్లర్ కోసం ఓటీటీలో వెతుకుతున్నారా ? అయితే ఈ సిరీస్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే.

Read Also: పాతబావిలో ఉన్న నిధి కోసం ఊరంతా పోట్లాట… చివరికి బయటపడింది ఏంటో తెలిస్తే బుర్రపాడు

Related News

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

Big Stories

Advertisement
×