E-Paper
Advertisement

8 ఏళ్ల బాబు చెప్పిన కథలు విని పోలీసులే షాక్… చివర్లో వచ్చే ట్విస్ట్ కి దిమాక్ కరాబ్

8 ఏళ్ల బాబు చెప్పిన కథలు విని పోలీసులే షాక్… చివర్లో వచ్చే ట్విస్ట్ కి దిమాక్ కరాబ్
Advertisement

Malayalam Mystery Thriller on OTT : మలయాళ స్టార్ నయనతార, కుంచాకో బోబన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘నిళల్’ (Nizhal) ఇంటెన్స్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్. ఒక చిన్న బాలుడు చెప్పే హత్యల కథలు నిజ జీవిత నేరాలతో సంబంధం కలిగి ఉండటం, వాటి వెనుక దాగి ఉన్న మిస్టరీని ఛేదించే ఉత్కంఠభరితమైన కథతో ఈ సినిమా ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుంది. తెలుగులో ‘నీడ’ (Needa) పేరుతో ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి దీన్ని తెలుగులో ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

జాన్ బేబీ (కుంచాకో బోబన్) ఒక నిజాయితీ గల ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్. ఒక రోజు జరిగిన ఘోరమైన కారు ప్రమాదంలో అతను ప్రాణాలతో బయటపడినా, ఆ సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ప్రమాదం తర్వాత అతను పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) బారిన పడతాడు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, భయంకరమైన కలలు, గత సంఘటనల జ్ఞాపకాలు అతన్ని ఎప్పుడూ వెంటాడుతుంటాయి. ముఖానికి గాయాలు కావడంతో ప్రత్యేక రక్షణ మాస్క్ ధరిస్తూ తన డ్యూటీ కొనసాగిస్తుంటాడు.

Advertisement

అదే సమయంలో అతని స్నేహితురాలు, చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ షాలిని ఒక విచిత్రమైన కేసు గురించి చెబుతుంది. నితిన్ అనే ఎనిమిదేళ్ల బాలుడు తరచూ క్లాస్‌లో భయంకరమైన హత్యల కథలు చెబుతుంటాడు. మొదట అందరూ వాటిని పిల్లాడి ఊహలుగా తీసుకున్నా, అతను చెప్పిన వివరాలు కచ్చితంగా ఉండటంతో జాన్ బేబీకి అనుమానం కలుగుతుంది. బాలుడు చెప్పిన ఒక కథలోని ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించగా, అక్కడ నిజంగానే ఒక చెరువులో మానవ అస్థిపంజరం లభిస్తుంది. దీంతో నితిన్ చెప్పిన కథలు కేవలం కల్పితం కావని, వాటి వెనుక ఏదో పెద్ద రహస్యం దాగి ఉందని జాన్ బేబీ గ్రహిస్తాడు.

ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతున్న కొద్దీ, నితిన్ తల్లి శర్మిల జీవితంలోని కొన్ని చీకటి నిజాలు వెలుగులోకి వస్తాయి. శర్మిల గతం, ఆ బాలుడు చెప్పే కథలు, బయట పడుతున్న ఆధారాలు అన్నీ ఒకే దిశగా చూపించడం ప్రారంభిస్తాయి. అయితే నిజం కనిపిస్తున్నంత ఈజీగా ఉండదు. ప్రతి కొత్త క్లూ మరో కొత్త ప్రశ్నను లేవనెత్తుతుంది.

Advertisement

జాన్ బేబీ తన మానసిక సమస్యలతో పోరాడుతూనే ఈ కేసును ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఒకవైపు తన సొంత భయాలు, మరోవైపు హత్య మిస్టరీ… ఈ రెండింటి మధ్య అతను చేసే ప్రయాణం మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. చివరికి నితిన్‌కు ఆ హత్యల గురించి ఎలా తెలిసింది ? అసలు ఆ అస్థిపంజరం ఎవరిది ? శర్మిల గతంలో దాగి ఉన్న నిజం ఏమిటి ? జాన్ బేబీ ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు ? అనే ప్రశ్నలకు సమాధానాలే సినిమా క్లైమాక్స్‌లో ఆసక్తికరంగా చూపించారు.

తెలుగులోనే స్ట్రీమింగ్

ఇది రొటీన్ మర్డర్ మిస్టరీ కాదు. సైకలాజికల్ థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా, ఇన్వెస్టిగేషన్ అంశాలను మేళవించి తీసిన చిత్రం. నయనతార, కుంచాకో బోబన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నెమ్మదిగా సాగుతూ ఉత్కంఠ పెంచే స్క్రీన్‌ప్లే, చివర్లో వచ్చే ట్విస్టులు సినిమాలో హైలెట్ గా ఉంటాయి. ‘నిళల్’ (Nizhal) చిత్రాన్ని తెలుగులో ‘నీడ’ (Needa) పేరుతో డబ్ చేశారు. ప్రస్తుతం ఈ తెలుగు వెర్షన్ Aha Video ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళ ఒరిజినల్ వెర్షన్‌తో పాటు ఓవర్‌సీస్ ప్రేక్షకుల కోసం తమిళ డబ్బింగ్ కూడా Simply Southలో అందుబాటులో ఉంది. స్లో-బర్న్ మిస్టరీ థ్రిల్లర్లు, సైకలాజికల్ డ్రామాలు, చివర్లో ఊహించని ట్విస్టులు ఇష్టపడేవారికి ‘నిళల్’ మంచి ఆప్షన్. చిన్న బాలుడి అమాయక కథల వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించిన ఈ సినిమా థ్రిల్లర్ అభిమానులకు తప్పకుండా నచ్చుతుంది.

Read Also: యాక్సిడెంట్ తో ప్రియురాలిని మర్చిపోయే ప్రియుడు… ఎక్స్ లవర్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్

Tags

Related News

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

Big Stories

Advertisement
×