OTT Movie : అనుమానం పెను భూతం అని ఊరకనే అనలేదు పెద్దలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం సినిమా చుస్తే, అవుననే అనిపిస్తుంది. ఇందులో సంతోషంగా ఉన్న ఫ్యామిలీలో అనుమానం ఒక్కసారిగా ఎంట్రీ ఇస్తుంది. దీని వల్ల స్టోరీలో గందరగోళం మొదలవుతుంది. రీసెంట్ గా ఓటిటిలోకి వచ్చిన ఈ మలయాళం సినిమాపై ఓ లుక్ వేయండి. ఇది వరకు ఇలాంటి కథలు చాలానే వచ్చినా, వన్ టైమ్ వాచ్ మూవీగా దీనిని చెప్పుకోవచ్చు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
మనోజ్ పలోడన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మలయాళ కామెడీ థ్రిల్లర్ పేరు ‘రవీంద్ర నీ ఎవిడే?’. అబామ్ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా 103 నిమిషాల నిడివితో 2025న జూలై 18న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇందులో అనూప్ మేనన్ (రవీంద్ర పాత్రలో), ధ్యాన్ శ్రీనివాసన్, షీలు అబ్రహం, సిద్దీఖ్, ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ప్రైమ్ వీడియో, సైనా ప్లే లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
రవీంద్ర ఒక వెదర్ రిపోర్ట్ ఆఫీసర్. అతని జీవితంలో ఫ్యామిలీ, ఉద్యోగం తప్ప మరొకటి లేదు. ప్రశాంతంగా ఉన్న ఈ ఫ్యామిలీలో ఒక్క సారిగా ఊహించని మలుపులు తీసుకుంటుంది. సెక్యూరిటీ రిజిస్టర్ బుక్ లో రవీంద్ర ఇంట్లో లేనప్పుడు ఒక వ్యక్తి వచ్చినట్లు ఎంట్రీ ఉంటుంది. అయితే భార్య ఎవరూ రాలేదని రవీంద్రతో చెప్తుంది. అక్కడి నుంచి రవీంద్రకి భార్య మీద అనుమానం మొదలవుతుంది. ఇది ఒక పెను భూతంగా మారుతుంది. ఆమెను ఫాలో చేయడం మొదలు పెడతాడు. ఆమె కొన్ని విషయాలు దాస్తోందని తెలుసుకుంటాడు. ఇక తన భార్య గురించి తెలుసు కోవాలని, ఆఫీస్ కి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనే రహస్యంగా దాక్కుంటాడు.
Read Also : ప్రియుడి కోసం భర్తనే బలిచ్చే భార్య… కట్ చేస్తే బుర్రపాడు ట్విస్టు… చిన్నపిల్లలు చూడకూడని మూవీ
అయితే ఆమె బయటికి వెళ్లే పని మీద రవీంద్ర ఉన్న గదికి అనుకోకుండా తాళం వేసి వెళ్తుంది. ఆ తరువాత భర్త ఇంటికి రాలేదని భయపడుతుంది. దీంతో ఒక పోలీస్ కంప్లైన్ట్ కూడా ఇస్తుంది. ఆ తరువాత స్టోరీ మరిన్ని మలుపులు తీసుకుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఆడియన్స్ ఊపిరి పీల్చుకుంటారు. ఆ ట్విస్ట్ ఏమిటి ? రవీంద్ర లేనప్పుడు ఇంటికి వచ్చింది ఎవరు ? రవీంద్ర భార్య నిజంగానే వేరొకరితో వ్యవహారం నడుపుతోందా ? అనే విషయాలను, ఈ మళయాళ కామెడీ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.