BigTV English

OTT Movie : చనిపోయిన పిల్లాడు 32 ఏళ్ల ఫ్యూచర్ లో ప్రత్యక్షం… మెంటలెక్కించే టైమ్ ట్రావెల్ మూవీ

OTT Movie : చనిపోయిన పిల్లాడు 32 ఏళ్ల ఫ్యూచర్ లో ప్రత్యక్షం… మెంటలెక్కించే టైమ్ ట్రావెల్ మూవీ

OTT Movie : ఓటిటిలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని వెబ్ సిరీస్ లు డిఫరెంట్ కథలతో తెరకెక్కుతున్నాయి. వాటిని ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ లో ఎప్పుడో చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తుంటారు. అయితే వాళ్లు ఏ వయసులో చనిపోయి ఉంటారో,  అదే వయసులో తిరిగి మళ్ళీ వస్తారు. ఆ తర్వాత స్టోరీ గందరగోళంగా ముందుకు సాగుతుంది. ఈ ఫాంటసీ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ ఫాంటసీ వెబ్ సిరీస్ పేరు ‘రిజరెక్షన్’ (Resurrection). ఈ అమెరికన్ సిరీస్ 2014 మార్చి 9 నుండి, 2015 జనవరి 25 వరకు ABC ఛానల్‌లో ప్రసారమైంది. ఈ సిరీస్ జాసన్ మాట్ రాసిన ‘The Returned’ అనే నవల ఆధారంగా రూపొందించబడింది. సీజన్ 1 లో 8 ఎపిసోడ్‌లు, సీజన్ 2 లో 13 ఎపిసోడ్‌లు ఉన్నాయి. అన్ని ఎపిసోడ్‌లు ప్రేక్షకుల్ని బాగా అలరిస్తాయి. ఈ ఫాంటసీ వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

మిస్సౌరీలోని ఆర్కాడియా అనే చిన్న పట్టణంలో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. చనిపోయిన వ్యక్తులు బ్రతికి, తిరిగి మళ్ళీ  ఊరిలోకి వస్తారు. వీరు ఏ వయసులో చనిపోయి ఉంటారో, అదే వయసులో తిరిగి వస్తారు. ఈ సిరీస్‌లో ప్రధానంగా చనిపోయిన వాళ్ళు తిరిగి రావడంతో, భావోద్వేగాలు, గందరగోళం చుట్టూ కథ తిరుగుతుంది. మొదటగా జాకబ్ లాంగ్‌స్టన్ అనే 8 సంవత్సరాల బాలుడు, చైనాలోని ఒక గ్రామీణ ప్రాంతంలో కళ్ళు తెరచి చూస్తాడు. అతను ఎలా అక్కడికి వచ్చాడో అతనికి కూడా తెలియదు. అతను తన స్వస్థలం ఆర్కాడియా అని అందరికీ చెబుతాడు. జాకబ్ అనే ఈ పిల్లాడు 1982 లో నీటిలో మునిగి చనిపోయిన ఉంటాడు. అతన్ని ఒక ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ అయిన జె. మార్టిన్ బెల్లామీ అమెరికాకు తీసుకొస్తాడు. అక్కడ అతను జాకబ్‌ను తన తల్లిదండ్రులైన హెన్రీ, లూసిల్ లాంగ్‌స్టన్‌లకు చూపిస్తాడు.

వీరు 30 సంవత్సరాల క్రితం తమ కొడుకును కోల్పోయి, ఇప్పుడు వృద్ధ దంపతులుగా ఉంటారు. ఇప్పుడు జాకబ్ తన తల్లిదండ్రులను గుర్తు పడతాడు. కానీ వారు వృద్ధాప్యంలో ఉంటారు కాబట్టి, ఈ పరిస్థితి వారికి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సంఘటనతో ఆర్కాడియాలో అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. జాకబ్ తన మరణం గురించి కొన్ని రహస్యాలను వెల్లడిస్తాడు. ఇంతలో మరికొందరు చనిపోయిన వ్యక్తులు కూడా అక్కడికి తిరిగి వస్తారు. దీంతో పట్టణంలో గందరగోళం పెరుగుతుంది. ఈ చనిపోయిన వారు ఎందుకు వస్తున్నారు ? ఎలా వస్తున్నారు ? వీరు నిజంగా వారేనా లేక వేరే ఏదైనా రహస్యమా? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఫాంటసీ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×