BigTV English

TDP Leaders: బాబు సొంత జిల్లాలో తమ్ముళ్లు ఆవేదన

TDP Leaders: బాబు సొంత జిల్లాలో తమ్ముళ్లు ఆవేదన

TDP Leaders: తన్నోడి నన్నోడెనా? నన్నోడి తన్నోడెనా? అంటూ మహాభారతంలో ద్రౌపది వేసే ప్రశ్న. సరిగ్గా ఇలాగే.. ప్రశ్నిస్తున్నారట కొన్ని జిల్లాల్లోని తెలుగు తమ్ముళ్లు. ఉన్నతాధికారి దగ్గరకు మంత్రి వెళ్లాలా? లేక, మంత్రి దగ్గరకు ఉన్నతాధికారి రావాలా? సీఎం సొంత జిల్లా నుంచే ఈ ప్రశ్న వినిపించడం ఆలోచించాల్సిన అంశంగా మారిందట. ఇంతకీ ఏంటీ వ్యవహారం? ఎందుకిలా అనాల్సి వస్తోంది? చిత్తూరు తెలుగు తమ్ముళ ఆవేదనేంటి? ఆ వివరాలు ఎలాంటివి?


ఉన్నతాధికారుల తీరుపై టీడీపీ కేడర్ అసంతృప్తి

2019నాటికీ ఇప్పటికీ పెద్ద తేడా కనిపించడం లేదంటోన్న తమ్ముళ్లుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కొన్ని జిల్లాల్లో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారట. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో.. ఈ స్వైర విహారం మరింత ఎక్కువగా ఉందట. ఈ విషయం ప్రత్యర్ధి పార్టీల వారు చెబితే పర్లేదు. ఏకంగా అధికార పార్టీలో అగ్రనాయకత్వం వహిస్తున్న టీడీపీ వాళ్లే అంటున్నారట. CMO లోని కీలక అధికారుల అండదండలున్నాయని కొందరు రెచ్చిపోతున్నారట.


ఎస్పీకి కంప్లయింట్ చేసినా స్పందన లేదు- మాజీ మంత్రి అమర్నాథ్

తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పోలీసు అధికారుల బదిలీ వ్యవహారం రచ్చ రచ్చగా మారింది. ఇక రెండో విషయం.. పుంగనూరులో వైసీపీ కేడర్ చేసినట్టుగా చెబుతోన్న టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య వ్యవహారం. క్షేత్ర స్థాయి పోలీసుల నిర్లక్ష్యం వల్లే.. జరిగిందని అంటారు. ఇప్పటికి పలుమార్లు.. జిల్లా ఎస్సీకి చెప్పుకున్నా.. ప్రయోజనం శూన్యం అన్న మాట సాదా సీదా కార్యకర్తలు అనడం లేదు. ఏకంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే.

MLC సిఫార్సు లేఖ తెచ్చిన వారిని సస్పెండ్ చేసిన SP

ఇవే కాదు.. ఇంకా చాలానే ఉదంతాలున్నాయ్. జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ సిఫార్సు లెటరు పంపితే.. ఆ లేఖ తీస్కెళ్లిన పోలీసులను ఏకంగా సస్పెండ్ చేస్తానంటూ.. సదరు ఎస్పీగారు బెదిరించడం అప్పట్లో పెను సంచలనం. తాజాగా.. రామకృష్ణ హత్య తర్వాత.. కొందరు పోలీసులను బదిలీ చేశారు. ఎవరైతే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారో.. అలాంటి వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేశారన్న విమర్శలున్నాయి.

కాన్ఫరెన్సులో ఉన్నానంటూ జిల్లా ఎస్పీ గైర్హాజరు

తాజాగా మరో దుమారం. ఇటీవల జిల్లా ఇంచార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి బీసీ భవన్ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులందరికీ ఆహ్వానం ఉంది. అయితే కాన్ఫరెన్సులో ఉన్నానంటూ జిల్లా ఎస్సీ ఈ కార్యక్రమానికి రాలేదు. అయితే ప్రోటోకాల్ విస్మరించిన మంత్రి ఏకంగా ఎస్పీ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి.. రెండు గంటల పాటు అక్కడే ఉన్నారనే ప్రచారం టీడీపీ కేడర్ ని పిచ్చెక్కించేసింది. మంత్రి ఉన్న చోటుకు ఉన్నతాధికారి రావాలా? లేక ఉన్నతాధికారి ఉన్న చోటుకు మంత్రి వెళ్లాలా? ఏది ముందు- ఏది వెనక? అసలేది ప్రొటోకాల్? అని తేల్చుకోడానికి మల్లగుల్లాలు పడ్డారట.

బదిలీల్లో వైసీపీ అనుకూల పోలీసులకు పెద్ద పీట

ఇప్పటికే ఎస్పీ విషయంలో టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. బదిలీల్లో వైసీపీ అనుకూల పోలీసులకు పెద్ద పీట వేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో పాటు టీడీపీ కేడర్ మీద కేసులు పెట్టమంటూ జిల్లా ఉన్నతాధికారి ఒత్తిడి తెస్తున్నట్టు గ్రౌండ్ లెవల్లో ఒక టాక్ వైరల్ గా మారింది.

గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఆడమన్నట్టల్లా ఆడిన పోలీసులు..

గత ప్రభుత్వ హయాంలో పోలీసు అధికారులు వైసీపీ లీడర్లు ఆడమన్నట్టల్లా ఆడారు. ఇప్పుడు కూడా అదే ధోరణి కనబరిస్తే ఎలా? తామేమీ అన్యాయంగా అడగటం లేదు. సరికదా.. తమపై దాడులు చేసిన వారిపై చర్యలు తీస్కోండి సార్.. అంటే కూడా రియాక్షన్ లేక పోతే ఎలా? ఇక్కడ బాధితులుగా ఉండి తాము కంప్లయింట్ చేస్తుంటే.. కనీసం స్పందించకుంటే ఎలా? అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక టీడీపీ లీడర్లు.

మంత్రి సొంత నియోజకవర్గం రాయచోటిలోనూ ఇంతే..

మరోవైపు మంత్రి సొంత నియోజకవర్గం రాయచోటిలోనూ ఇంతే. గత కొంత కాలంగా ఇక్కడ రోజుకో గొడవ చెలరేగుతోంది. పోలీసులు కఠినంగా వ్యవహరించక పోవడం వల్లే ఇలా జరుగుతోందన్న మాట వినిపిస్తోంది. ఏదైనా పండగ జరిగితే చాలు.. ఇక్కడో రచ్చ రివాజుగా మారింది. వీధుల్లోకి వచ్చి కొట్టడం పోలీసులపై ఎదురు ఆరోపణలు చేయడం వంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇలాంటి చోట కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. అయినప్పటికీ.. మంత్రి ఎందుకో మెతక ధోరణి అవలంభిస్తున్నారన్న కామెంట్లు చేస్తున్నారు తమ్ముళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కేడర్ కి ఎలాంటి భరోసా ఇవ్వగలరు? అన్న మాట వినిపిస్తోంది.

SP వ్యవహారశైలి కారణంగా జిల్లాలో పార్టీ దెబ్బ తినే ప్రమాదం

ఉన్నతాధికారుల వ్యవహార శైలిని మరీ ముఖ్యంగా కేడర్ పట్ల వారు వ్యవహరిస్తున్న తీరును అధిష్టానం దగ్గరకు తీస్కెళ్లాల్సిన బాధ్యత ఇంచార్జి మంత్రిదే అవుతుంది. అలాంటి మంత్రి ఎంత మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్పీ వ్యవహార శైలి కారణంగా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పార్టీ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కలుగుతోందని అంటున్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో అధినేత చంద్రబాబు కానీ, లోకేష్ గానీ చర్య తీసుకోకుంటే.. పార్టీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు పడేలా కనిపిస్తోంది.

2019నాటికీ ఇప్పటికీ పెద్ద తేడా కనిపించడం లేదంటోన్న తమ్ముళ్లు

లీడ్ తీస్కుని.. అధికారులకు దశా- దిశా నిర్దేశించాల్సిన సీనియర్ లీడర్లే సైలంట్ కావడంతో.. పాలన మొత్తం అధికారుల ఒంటెత్తు పోకడలు పోతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇందుకంటూ ఎక్కడో ఒక చోట బ్రేక్ పడకుంటే కష్టమని కామెంట్ చేస్తున్నాయి స్థానిక టీడీపీ శ్రేణులు. ఇది ప్రజా ప్రతినిథుల పాలన కాకుండా- అధికారుల నియంతృత్వ పాలనగా మారుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. దీంతో తాము అధికారంలో ఉన్నా.. ఒకటే లేకున్నా ఒకటే అన్న భావన సర్వత్రా వ్యాపిస్తుందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరు. అంతే కాదు 2019 నాటికీ ఇప్పటికీ తమకేమీ పెద్ద తేడా కనిపించడం లేదన్న వీరి ఆందోళన.. ఇకనైనా అధిష్టానం దృష్టికి వెళ్తుందా? లేదా తేలాల్సి ఉందంటున్నారు వీరు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×