Venuswamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ, రాజకీయ జ్యోతిష్యాలకు పెట్టింది పేరు ఈయన. సమంత-నాగచైతన్య విడిపోతారంటూ చెప్పి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు వేణు స్వామి. ఆ తర్వాత పలు సంచనల వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వేణుస్వామి జ్యోతిష్యంలోనూ సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్నారు. రీసెంట్ గా ఉగాది పండుగ సందర్బంగా రాశి ఫలాలు చెప్పిన ఆయన మరో బాంబ్ పేల్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో మహేష్ బాబు పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరో వివాదంలో వేణు స్వామి..
జ్యోతిష్యుడు వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా మరో వివాదంను రాజేశారు. ఆయన ఏకంగా సీనియర్ హీరో కృష్ణ మరణానికి మహేష్ బాబు కారణమంటూ బాంబు పేల్చారు. 1995 నుంచి తాను.. కృష్ణ ఇంట్లో పూజలు చేశానని చెప్పారు . కానీ గతంలో ఒకసారి.. 2020 నుంచి మీ ఇంట్లో మరణాలు సంభవిస్తాయని విజయ్ నిర్మలతో చెప్పినట్లు చెప్పారు. అప్పటి నుంచి తనను పూజలకు రావొద్దని చెప్పారన్నారు. విజయనిర్మల ఇంట్లో పూజలు చేయడానికి వెళ్తుంటాను. ఆ సమయంలో ఎలా ఉంది జాతకం అని ఆమె నన్ను అడిగారు. అయితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పడం, మాట్లాడటం అలవాటు. అలానే అన్నాను. ఆ తర్వాత నన్ను పిలవడం మానేశారు అని అన్నారు.
Also Read :పెళ్లి పీటలు ఎక్కబోతున్న ప్రదీప్.. ఆమె లైఫ్ పార్ట్నర్..
మహేష్ బాబు జాతకం పై బాంబ్..
మహేష్ బాబు జాతకం గురించి చెప్పాడు. నేను జాతకం చెప్పిన ఆ సమయంలో మహేశ్ బాబు జాతకంలో శని గ్రహం మారుతున్నది. దాని ప్రభావం కూడా తల్లిదండ్రుల జాతకంపై పడింది. జనవరి 16 తర్వాత వాళ్లింట్లో తల్లిదండ్రులకు ఏదో ఒక చెడు జరుగుతుందని నేను గ్రహించాను. మహేశ్ బాబు గ్రహ స్థితి వల్లే కృష్ణ గారు చనిపోయారని అన్నారు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ వేణు స్వామి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఇటీవల ఆయన వరుస వివాదాలను కోరి తెచ్చుకుంటున్నాడు. సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్‌లు సూసైడ్ చేసుకొనే ప్రమాదం ఉంది అని సంచలనం రేపాడు. ఆయన జ్యోతిష్యాలపై నెటిజన్లు, సినీ అభిమానులు మండిపడుతున్నారు. ఇలా సెలబ్రిటీల జీవితాలపై కామెంట్లు చేయడం మంచిది కాదని వేణు స్వామికి సలహాలు ఇస్తున్నారు. ఇక ఈసారి ఏ సెలబ్రిటీపై తన అస్త్రాన్ని వదులుతారు అని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమాని చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చేయడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా లో మహేష్ బాబు లుక్ అదిరింది.. ఆ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది