OTT Movie : సినిమాలపై నిషేధాలు వివాదాలు చిత్ర నిర్మాతలకు, నటీనటులకు కొత్తేమీ కాదు. కానీ ఈ సినిమా మాత్రం ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద చిత్రం. విడుదలైన వెంటనే బ్యాన్ చేయడమే కాకుండా, ఆ మూవీ డైరెక్టర్ కు శాపంగా మారింది. పైగా ఈ మూవీ 150 దేశాలలో బ్యాన్ చేయడం గమనార్హం. మరో షాకింగ్ విషయం ఏంటంటే మూవీ రిలీజ్ అయిన రోజుల వ్యవధిలోనే డైరెక్టర్ ను హత్య చేశారు. ఇంతటి వివాదాస్పద చరిత్రను మూట కట్టుకున్న ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
జస్ట్ వాచ్ (Just watch) లో
ఈ మూవీ పేరు ‘సాలో లేదా 120 డేస్ ఆఫ్ సోదొం’ (Salo or the 120 days of sodom). డైరెక్టర్ పియర్ పాలు పసోలి ఈ మూవీని తెరకెక్కించారు. 1975 లో రిలీజ్ అయిన ఈ సినిమాలోని కథ, సీన్స్ వల్ల తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఫలితంగా ఈ మూవీని అప్పట్లోనే 150 దేశాల్లో బ్యాన్ చేశారు. నిజానికి ఇదొక పొలిటికల్ ఆర్ట్ ఫిలిం. ఈ సినిమాను 1785లో రచించిన నవల ది 120 డేస్ ఆఫ్ సోదం ఆధారంగా తెలుగు తెరకెక్కించారు. ఆ నవలని మార్కిస్ డే సాడే రాశారు. ఈ మూవీ స్టోరీ అంతా రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగుతుంది.
స్టోరీలోకి వెళితే
నలుగురు ధనవంతులు, అవినీతిపరులు 18 మంది యువకులను మహిళలను కిడ్నాప్ చేసి, 4 నెలపాటు మానసికంగా,భావో ద్వేగాల పరంగా, శారీరకంగా హింసించే అంశం చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళని కీళ్లు బొమ్మలుగా మార్చి, లైంగిక వేదింపులు, శాడిజం క్రూరమైన హింస, పిల్లలను హత్య చేయడం అంటే హింసాత్మక సీన్స్ ఈ మూవీలో మెండుగా ఉన్నాయి. దీంతో 1993 వరకు ఈ మూవీని ఆస్ట్రేలియాలో బ్యాన్ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఈ మూవీ తెరపైకి రాగా 1998లో బ్యాన్ చేశారు. ఇక డైరెక్టర్ పియర్ ఫాలో పసోలిని మూవీ రిలీజ్ అయిన కొన్ని రోజులకే హత్యకు గురి కావడం సస్పెన్స్ గా మారింది. ఇక సినిమాలోని గ్రాఫిక్ కంటెంట్ అనేక దేశాలలో బ్యాన్ కు దారితీసింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన కొన్ని రోజులకే డైరెక్టర్ పియర్ ఫాలో పసోలిని హత్య చేయడం అనేది ఈ మూవీని మరింత అపఖ్యాత పాలు చేసింది. అయితే వివాదం ఉన్నప్పటికీ ఈ మూవీలో మనుషుల క్రూరత్వం, అవినీతి వంటి వాటిని ధైర్యంగా చూపించినందుకు ఫాలో అనేది ఒక ముఖ్యమైన కథగా మిగిలింది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటిదాకా మనం కేవలం టైటిల్ వివాదం, లేదా స్టోరీ వివాదాన్ని మాత్రమే చూసాం. కానీ ఈ మూవీ స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీని (Salo or the 120 days of sodom) స్టోరీని జస్ట్ వాచ్ వెబ్ సైట్ లో చూడవచ్చు.