OTT Movie : బాలీవుడ్ నుంచి వచ్చే వెబ్ సిరీస్ లు ఇప్పుడు కొంచెం హాట్ గానే నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే వెబ్ సిరీస్ ఒక క్రైమ్ చుట్టూ తిరుగుతుంది. దీని వెనక రహస్యాలు తెలుసుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ ని నియమిస్తారు. ఆ తర్వాత స్టోరీ ముందుకు వెళ్తుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ తన నటనతో అదరగొట్టాడు. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
జీ 5 (ZEE5) లో
ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘సైలెన్స్ :2 ‘(Silence 2). ఇది 2021 లో విడుదలైన “Silence… Can You Hear It?” సీక్వెల్‌గా వచ్చింది. ఈ సిరీస్‌కి అబన్ భరుచా దేవోహన్స్ దర్శకత్వం వహించారు. ఈ స్టోరీ ముంబైలోని నైట్ ఓల్ బార్‌లో జరిగిన ఒక భారీ కాల్పుల సంఘటన చుట్టూ తిరుగుతుంది. ఇది జీ 5 (ZEE5) లో 2024 ఏప్రిల్ 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రధాన పాత్రలలో మనోజ్ బాజ్‌పాయ్, ప్రాచీ దేశాయ్, పరుల్ గులాటీ నటించారు.
స్టోరీలోకి వెళితే
ముంబైలోని నైట్ ఓల్ బార్‌లో భారీగా కాల్పులు జరుగుతాయి. ఈ సంఘటనలో చాలా మంది చనిపోతారు. దీనిని పరిశోధించడానికి పోలీస్ కమిషనర్ ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) అవినాష్ వర్మ ను నియామిస్తాడు. అతనికి ఒక స్పెషల్ క్రైమ్ యూనిట్ బృందాన్ని కూడా ఏర్పాటుచేస్తాడు. ఈ కేసు మొదట్లో రాజకీయ హత్యలా అందరికీ అనిపిస్తుంది. కానీ అవినాష్ దర్యాప్తు ప్రారంభించినప్పుడు, ఈ సంఘటన వెనుక మరింత పెద్ద చీకటి కుట్ర ఉందని తెలుసుకుంటాడు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, ఈ కాల్పుల సంఘటన ఒక సాధారణ హత్య కేసు కాదని, ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్‌తో సంబంధం కలిగి ఉందని వెల్లడవుతుంది. కొంతమంది వేశ్యలను ఈ కిల్లర్ టార్గెట్ చేసినట్లు తెలుసుకుంటాడు. అవినాష్, అతని బృందం ఈ కేసును ఛేదించడానికి నిరంతరం కృషి చేస్తారు. ఈ ప్రక్రియలో వారు అనేక ఆశ్చర్యకరమైన మలుపులు, చీకటి రహస్యాలు, ఊహించని ట్విస్ట్ లను ఎదుర్కొంటారు. కథలో ఒక ముఖ్యమైన పాత్ర అయిన ఒక థియేటర్ నటుడు, షేక్‌స్పియర్ డైలాగ్‌లు చెప్పే సైకోపాత్‌గా చూపించబడతాడు. ఇతను కేసులో ఒక కీలకమైన అనుమానాస్పద వ్యక్తిగా ఉంటాడు.
ACP అవినాష్ వర్మ ఈ కేసు విచారణను తనదైన స్టైల్ లో విచారిస్తాడు. ఖచ్చితమైన పద్ధతులను పాటిస్తాడు. అయితే మరోవైపు అవినాష్ వ్యక్తిగత జీవితంలో ఒంటరితనం నిండిపోయి ఉంటుంది. అతని భార్య నుండి అవినాష్ విడిపోయి ఉంటాడు. కూతురు కూడా లండన్‌లో తనకు దూరంగా ఉంటుంది. ఈ ఎమోషన్ కాస్త బాధ కలిగిస్తుంది. ఈ రాకెట్ వెనుక ఉన్న నిజమైన నేరస్థులను కనిపెట్టడం కోసం, అవినాష్ తన బృందంతో కలిసి అవిశ్రాంతంగా పనిచేస్తాడు. చివరికి ఆ నెరస్తులను అవినాష్ పట్టుకుంటాడా ? తన ఫ్యామిలీకి దగ్గర అవుతాడా ?ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూడండి. ఈ సిరీస్ మనోజ్ బాజ్‌పాయ్ బలమైన నటన, ఒక ఉత్కంఠభరితమైన కథాంశంతో ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ మిస్టరీ సిరీస్ లను ఇష్టపడే వారికి ఇది ఒక బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.