OTT Movie : లవ్ స్టోరీలతో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలలో లవ్ ట్రాక్ తో పాటు రివెంజ్ ట్రాక్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ప్రాణంగా ప్రేమిస్తున్నానంటూ ప్రియురాలిని కడతేరుస్తాడు. ఆమెపై దారుణంగా అఘాయిత్యం చేస్తాడు. చివరి వరకు సస్పెన్స్ తో సాగే ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
2024 లో విడుదలైన ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ప్రేమలో’ (Premalo). డ్రీమ్ జోన్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజేష్ కోడూరి నిర్మించిన ఈ సినిమాకు చందు కోడూరి దర్శకత్వం వహించారు. ఇందులో చందు కోడూరి, చరిష్మా శ్రీఖర్, శివాజీ రాజా, మధుసూదన్ రావు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 22న విడుదల చేసి, థియేటర్లలో జనవరి 26న ఈ మూవీని విడుదల చేశారు. రొమాన్స్, సస్పెన్స్ కలిగిన స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ రవి, ప్రసంతి అనే ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. రాజమండ్రిలో రవి ఒక మెడికల్ షాప్ లో పని చేస్తుంటాడు. ఇతని తండ్రి ఒక పెద్ద తాగుబోతు. అతని వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అయితే రవికి ఎప్పటికైనా ఒక మెడికల్ షాప్ పెట్టాలని అనుకుంటాడు. ఇంతలో ప్రసంతి అనే అమ్మాయి ఇతనికి పరిచయం అవుతుంది. కొద్దిరోజుల్లోనే వీరిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే ఒకరోజు రవి ప్రసంతిపై దాడి చేసినట్లు కనిపించే ఒక వీడియో క్లిప్ ప్రసంతి తండ్రికి చేరుతుంది. ఈ ఘటన కథలో కీలకమైన మలుపును తీసుకొస్తుంది. ఆ తరువాత ప్రసంతి దారుణంగా చనిపోయి ఉంటుంది. ఆ వీడియొలో రవి ఆమెపై దారుణంగా ప్రవర్తిస్తాడు. అతను ఎందుకు అలా ప్రవర్తించాడు ? ఇందులో మారెవరైనా ఉన్నారా ? అనేది సస్పెన్స్ గా ఉంటుంది .
చివరికి ప్రసంతిని రవి నిజంగా ప్రేమిస్తాడా? అతను ఎందుకు ఇలాంటి చర్యకు పాల్పడ్డాడు? అనే ప్రశ్నల చుట్టూ కథ అల్లుకుంటుంది. కథనం ముందుకు సాగే కొద్దీ, ప్రేమ, ద్రోహం, వంటి భావోద్వేగాలతో నిండిన అనేక అనుమానాలు వస్తాయి. ప్రసంతి తండ్రి పాత్ర కథలో మిస్టరీని మరింత లోతుకి వెళ్ళే విధంగా చేస్తుంది. చివరికి, ఈ సంఘటనల వెనుక ఉన్న నిజం బయటపడుతుంది. ఇది ప్రేక్షకులకు భావోద్వేగపరమైన క్లైమాక్స్‌ను అందిస్తుంది. ఆ వీడియో క్లిప్ ఎలా వచ్చింది. దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటనేది చివరివరకు ఉత్కంఠంగా ఉంటుంది. ఈ సినిమా ఒక వైపు భావోద్వేగపరమైన డ్రామాగా ఉంటూనే, మరోవైపు సస్పెన్స్, రొమాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సస్పెన్స్ మిస్టరీ ఏమిటో మీరుకూడా తెలుసుకోవాలి అనుకుంటే, ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.