Brahmamudi Kavya : స్టార్ మా చానల్లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ ప్రేక్షకుల ఆదరాభిమానాన్ని సొంతం చేసుకుంది. టాప్ రేటింగ్ సీరియల్ కార్తీకదీపం స్థానంలో ప్రసారం అవుతున్న ఈ ధారవాహిక అదే రేంజ్‌లో రేటింగ్‌ను సొంతం చేసుకొంటున్నది. అయితే ఈ సీరియల్‌లో కావ్య పాత్రతో తనదైన నటనతో ఆకట్టుకుంది తమిళ నటి దీపికా రంగరాజు. ఈ సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ మధ్య వరుసగా షోలలో కనిపిస్తూ సందడి చేస్తుంది. ఈ సీరియల్ తో బాగా పాపులర్ అయిన సొంతం చేసుకున్న కావ్య రెమ్యూనరేషన్ఎంత? అని చాలామందికి సందేహం ఉంటుంది. ఈమె రెమ్యూనరేషన్ గురించి తెలుసుకోవాలని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. ఇక ఆలస్యమెందుకు ఈమె ఒక రోజుకి ఎంత చార్జ్ చేస్తుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
Also Read :ఆ స్టార్ హీరో, ప్రదీప్ స్కూల్ మేట్స్.. నిజంగానే నమ్మలేరు..
కావ్య పాత్రకు రెమ్యూనరేషన్..
ప్రస్తుతం స్టార్ మా లో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్స్లలో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి. ఈ డైలీ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కావ్య అలియాస్ దీపిక రంగరాజు. బ్రహ్మముడి సీరియల్ అతి కొద్ది సమయంలోనే భారీ స్పందన ఆడియెన్స్ నుంచి వచ్చింది. దాంతో తెలుగులో కూడా దీపికకు పెద్ద స్థాయిలో అభిమానులు ఏర్పడ్డారు. దాంతో ప్రేమ విశ్వనాథ్ తర్వాత ఆ స్థాయిలో ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. అందుకే బుల్లితెర పై పలు షోలలో కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది..
ఇకపోతే బ్రహ్మముడి సీరియల్‌లో నటిస్తున్న దీపిక రంగరాజకు భారీ రెమ్యునరేషన్ అందుకొంటున్నట్టు సమాచారం. ఈ సీరియల్‌లో నటించిన ఆమెకు పెద్ద మొత్తమే ముడుతుందని తెలుస్తుంది. ఈమెకు ఒక రోజుకు గాను 40 వేల రూపాయలు పారితోషికం అందుకుంటుంది. అంతేకాదు అదనంగా మరో 20 వేలతో నిర్మాతలకు తడిచిపోతుంది. అంటే ఒక్కరోజుకు రూ. 60 వేల వరకు అందుకుంటుంది.. నెలలో ఉన్న షూటింగ్లకు ఈమెకు బాగానే ముడుతుందని అర్థమవుతుంది.. ఈ లెక్కన ఈమెకు భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటుందని తెలిసిందే. సీరియల్స్ మాత్రమే కాదు.. పలు లైవ్ షోలలో సందడి చేస్తుంది. ఈ మధ్య వస్తున్న పలు షోలల్లో ఈమె పేరే ఎక్కువగా వినిపిస్తుంది.
రియల్ లైఫ్..
ఈమె నిజానికి తమిళ అమ్మాయి. చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్‌తో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ సీరియల్‌కు అనూహ్యమైన ప్రేక్షకాదరణ లభించింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సీరియల్స్ మాత్రమే కాదు తమిళంలో ఓ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం సీరియల్స్ లతో బిజీగా ఉంది దీపికా రంగరాజు.. తమిళ, తెలుగు రంగంలో రాణిస్తున్న దీపిక రంగరాజు.. తమిళంలో ఓ సినిమా లో కూడా నటించింది. ఆరాడీ అనే చిత్రం ద్వారా సినిమా రంగంలో కి ప్రవేశించింది.. సినిమాల్లో మంచి పాత్రలు వస్తే నటిస్తానని చెబుతుంది.