OTT Movie : బో*ల్డ్ డ్రామాలు, రొమాంటిక్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి, ముఖ్యంగా లస్ట్ స్టోరీస్ ఫాన్స్‌కి ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఇందులో నాలుగు కథలు వేర్వేరుగా ఉన్నా, అన్నీ సమాజంలో మాట్లాడుకోవడానికి ఇష్టపడని థీమ్స్ ను బో*ల్డ్‌గా ఎక్స్‌ప్లోర్ చేస్తాయి. ప్రతి ఎపిసోడ్ సమాజం విధించే రూల్స్‌ను బ్రేక్ చేసే క్యారెక్టర్స్, వాళ్ల ఎమోషనల్ జర్నీ, పెర్ఫార్మెన్స్‌లు ఔట్ స్టాండ్ గా చూపిస్తాయి. ఇది వరకే వచ్చిన సీజన్ :1 ప్రేక్షకుల మతి పోగొట్టింది. ఇక ఇప్పుడు వచ్చిన సీజన్ 2 బో*ల్డ్ థీమ్స్ తో మైండ్ ని బెండ్ చేస్తోంది. ఈ కథ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
“Sshhh” సీజన్ 2, 2025లో Aha Tamil, OTTplay స్ట్రీమింగ్ అయిన తమిళ యాంథాలజీ వెబ్ సిరీస్. ఈ సిరీస్‌ను ప్రితివి అదిత్య, వాలి మోహన్ దాస్, హరీష్ GY, IB కార్తికేయన్ డైరెక్ట్ చేశారు. దీనిని బిగ్ ప్రింట్ పిక్చర్స్, డైనా పిక్చర్స్, ఎక్స్‌లెంట్ పిక్చర్ బాక్స్ నిర్మించాయి. ఇందులో ఐశ్వర్య దత్త, వేదిక, సుబాష్ సెల్వం, ప్రేమ్‌గి అమరన్, వెట్రి, జినల్ జోషి, విలియం పాట్రిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. 4 ఎపిసోడ్‌లతో వచ్చిన ఈ సిరీస్ IMDbలో 5.5/10 రేటింగ్ పొందింది. Aha Tamilలో 2025 సెప్టెంబర్ 19 నుండి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
“Sshhh” సీజన్ 2 నాలుగు ఎపిసోడ్ లతో అలరిస్తోంది. ప్రతి ఒక్కటి సమాజంలో మాట్లాడుకోవడానికి ఇబ్బందిపడే అంశాలపై ఫోకస్ చేస్తుంది. రియలిస్టిక్ డైలాగ్స్, ఎమోషనల్ మూమెంట్స్‌తో ఈ సిరీస్ ఆకట్టుకుంటోంది.
కళ్ళ కాదల్ (ఎపిసోడ్ 1)
ఈ కథలో శరత్, ప్రియా కొత్తగా పెళ్లైన జంట. తమ మొదటి ఇంటిమేట్ మూమెంట్‌లో ఇబ్బందులు పడతారు. శరత్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ప్రియా ఒక స్కూల్ టీచర్. వాళ్ల మధ్య ప్రేమ ఉన్నా, సమాజం, ఫ్యామిలీ ఒత్తిడి కారణంగా ఇంటిమేట్ సీన్స్‌లో ఇబ్బంది పడతారు. శరత్‌కి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో వల్ల అవమానం ఎదురవుతుంది. ఇది వాళ్ల రిలేషన్‌షిప్‌ను టెస్ట్ చేస్తుంది. ఈ ఎపిసోడ్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. శరత్ గతంలో ఒక సీక్రెట్ ఉందని తెలుస్తుంది. అది ప్రియాకి షాక్ ఇస్తుంది.
కన్ని వాసల్ (ఎపిసోడ్ 2)
ఈ స్టోరీలో అను అనే 30 ఏళ్ల విడాకులైన మహిళ, తన లైఫ్‌ని రీస్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆమె ఒక ఆర్టిస్ట్, కొత్తగా చెన్నైలో సెటిల్ అవుతుంది. అను తన కోరికలను ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటుంది. కానీ సమాజం, ఫ్యామిలీ ఆమెను “విడాకులైన ఆడది”గా జడ్జ్ చేస్తారు. ఆమె ఒక కొత్త ఫ్రెండ్ కిషోర్ తో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేస్తుంది. కానీ కిషోర్ ఫ్రెండ్స్ ఆమె గతం గురించి కామెంట్స్ చేస్తారు. అను తన ఐడెంటిటీని, సెల్ఫ్-రెస్పెక్ట్‌ను తిరిగి పొందే జర్నీ ఈ కథలో ఉంటుంది.
ఫియర్ (ఎపిసోడ్ 3)
ఈ కథలో విక్రమ్ అనే యంగ్ బిజినెస్‌మాన్, ఒక ప్రైవేట్ వీడియో ఆన్‌లైన్‌లో లీక్ అవడంతో సోషల్ షేమ్ ఫేస్ చేస్తాడు. విక్రమ్ ఒక డేటింగ్ యాప్‌లో మీట్ అయిన అమ్మాయితో ఇంటిమేట్ మూమెంట్ రికార్డ్ అవుతుంది. అది లీక్ అయ్యాక అతని కెరీర్, ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటాయి. విక్రమ్ ఈ సిట్యుయేషన్‌ను ఎదుర్కోవడానికి, లీక్ వెనుక ఉన్న వ్యక్తిని కనిపెట్టడానికి ట్రై చేస్తాడు. ఈ ప్రాసెస్‌లో అతని స్నేహితుడు సపోర్ట్ చేస్తాడు. అయినా కూడా విక్రమ్ మానసికంగా కుంగిపోతాడు.
జస్ట్ మిస్సు (ఎపిసోడ్ 4)
ఈ స్టోరీలో రాజ్ అనే వ్యక్తి తన క్లయింట్స్‌తో ఫిజికల్ రిలేషన్స్‌తో జీవితం కొనసాగిస్తాడు. కానీ ఒక సోఫియా అనే ఒక క్లయింట్ అతనితో ఎమోషనల్ కనెక్షన్ ఫీల్ అవుతుంది. రాజ్ తన జీవితంలో మొదటిసారి ప్రేమను పొందుతాడు. కానీ అతని గతం, ప్రొఫెషన్ ఈ కొత్త రిలేషన్‌షిప్‌ను కాంప్లికేట్ చేస్తాయి. సోఫియా గతంలో ఒక అనుభవం వల్ల ఎమోషనల్‌గా బ్రోకెన్, రాజ్‌తో తన ఫీలింగ్స్‌ను షేర్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ స్ట్రగుల్స్‌ను సెన్సిటివ్‌గా చూపిస్తుంది. క్లైమాక్స్‌లో రాజ్ తన జీవితంలో ఒక పెద్ద డెసిషన్ తీసుకుంటాడు, ఇది ఆడియన్స్‌ను ఆలోచింపజేస్తుంది.
Read Also : దెయ్యాలు మేనేజ్ చేసే హోటల్ ఇది… ఫ్యామిలీ ఎంట్రీతో ట్విస్టు… హిలేరియస్ హార్రర్ సిరీస్