Suryakumar Yadav: ఆసియా కప్ 2025 టోర్నమెంటులో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ ఒమన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. గ్రూప్ స్టేజిలో నామమాత్రపు పోరులో భాగంగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో మొదట టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ తీసుకుంది. ఇక్కడే టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. అచ్చం రోహిత్ శర్మ లాగా వ్యవహరించారు. టాస్ వేసిన తర్వాత… కొత్తగా జట్టులోకి ఎవరు వస్తారని రవి శాస్త్రి ప్రశ్నిస్తే? అయ్యో మర్చిపోయాను అంటూ సూర్య కుమార్ యాదవ్ ఆన్సర్ ఇచ్చారు. దీంతో రోహిత్ శర్మ లాగా సూర్య కుమార్ యాదవ్ తయారయ్యాడని సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. రోహిత్ శర్మ తరహాలోనే సూర్య కుమార్ యాదవ్ కు ( Surya kumar yadav) మతిమరుపు రోగం వచ్చిందని అంటున్నారు.
Also Read: Asia Cup 2025 : పప్పులో కాలు వేసిన రషీద్ ఖాన్… అది ఔట్ రా బాబు అంటూ పరువు తీసిన అంపైర్
టీమిండియా వర్సెస్ ఒమన్ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరగగా… ఇందులో సూర్య కుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. అయితే టాస్ గెలిచిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ ను రవి శాస్త్రి… జట్టు సభ్యుల గురించి ప్రశ్నించారు. వాస్తవానికి బుమ్రా అలాగే వరుణ్ చక్రవర్తిని పక్కకు పెట్టారు సూర్య కుమార్ యాదవ్. వాళ్ళిద్దరి ప్లేస్ లో హర్షిత్ రానా,అర్షదీప్ సింగ్ ఇద్దరు జట్టులోకి వచ్చారు. ఈ విషయాన్ని రవి శాస్త్రి అడిగితే.. కేవలం హర్షిత్ రానా పేరు చెప్పి… మరొక ప్లేయర్ పేరు మర్చిపోయాడు. అయ్యో నేను రోహిత్ శర్మ లాగా అన్ని మర్చిపోతున్నాను అని స్వయంగా సూర్య కుమార్ యాదవ్.. టక్కున అనేశాడు. దీంతో స్టేడియంలో ఉన్న వాళ్లంతా పగలబడి నవ్వారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ తర్వాత ఒమాన్ జట్టు కెప్టెన్ కూడా ఇలాగే పేర్లు మర్చిపోయాడు.
టీమిండియా వర్సెస్ ఒమన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో … కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేయలేదు. ఈ మ్యాచ్ లో వికెట్లు పడినప్పటికీ.. బౌలర్ల ను బ్యాటింగ్కు పంపించాడు కానీ అతను మాత్రం బ్యాటింగ్ చేయలేదు. అయితే టాస్ విషయాన్ని గుర్తు చేసుకున్న క్రికెట్ అభిమానులు…. మనోడు రోహిత్ శర్మ లాగా మతిమరుపు వచ్చి బ్యాటింగ్ చేయడం మర్చిపోయాడు అనుకుంటా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఒమాన్ చిన్న జట్టు కాబట్టి సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేయలేదని తెలుస్తోంది. అయితే t20 లలో కెప్టెన్ అయ్యుండి కూడా బ్యాటింగ్ చేయని వారిలో మహేంద్ర సింగ్ మొదటి స్థానంలో ఉన్నారు.
"I have become like Rohit"
– Suryakumar Yadav when he forgets the team changes at the toss 😂😂 pic.twitter.com/ObGM0NQbpD— 𝐑𝐮𝐠𝐠𝐚 (@LoyalYashFaan) September 19, 2025
Skipper Suryakumar Yadav was padded up but held himself back against Oman. 👀
What’s your take on this move? 🤔#INDvOMAN #SKY #Sportskeeda pic.twitter.com/O3FxFoljuD
— Sportskeeda (@Sportskeeda) September 19, 2025