Samyuktha Menon : తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సంయుక్త మీనన్ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందంతో పాటు తన అభినయంతో అభిమానులను ఆకట్టుకుంటున్నది. దాదాపు పదేళ్ల కిందట ఇండస్ట్రీలోకి వచ్చిన బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇప్పటివరకు తెలుగుతో పాటుగా మరికొన్ని భాషల్లో నటిస్తూ వస్తుంది.. అయితే ఈ మధ్య ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త వినిపిస్తుంది. సంయుక్త ‘భీమ్లానాయక్’తో తెలుగుకు పరిచయమైంది. ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష, డేవిల్ మూవీల్లో నటించి టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా మారింది. తాజాగా ఆమె సినిమాలకు దూరం అయ్యింది. అయితే ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో క్లారిటీ ఇచ్చింది..
సంయుక్త మీనన్ ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. తాను ఎప్పుడూ విరామం తీసుకోలేదని, ఈ గ్యాప్ ఎందుకంటే ఆమె అంగీకరించిన సినిమా లు పూర్తి కావడంలో ఆలస్యం జరిగిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ రెండేళ్లలో ఆమె కొత్త సినిమాలపై ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో నటిస్తున్నది. సంయుక్త ‘భీమ్లా నాయక్’తో తెలుగుకు పరిచయమైంది. ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష, డేవిల్ మూవీల్లో నటించి టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా మారింది.. ఈమధ్య ఈ మా సినిమాలకు దూరంగా ఉందన్న విషయం చాలా మందికి తెలుసు. అదే గ్యాప్ తీసుకుందని అందరూ అనుకున్నారు కానీ కాస్త బ్రేక్ ఇచ్చిందని మాత్రం తన సన్నిహితులు చెబుతున్నారు. మరి దీనిపై హీరోయిన్ ఎలా స్పందిస్తుందో చూడాలి..
Also Read: ఈ వారం ఊహించని రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటంటే..?
ఈ ముద్దుగుమ్మ రెండేళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకుంది.. ఈ ఏడాది డిసెంబర్ నుంచి బాలయ్య హీరోగా నటిస్తున్న ‘అఖండ 2’ చిత్రంతో ఆమె గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వనుంది. డిసెంబర్ తర్వాత సంక్రాంతి సందర్భంగా ‘నారీ నారీ నడుమ మురారీ’ అనే రొమాంటిక్ చిత్రం తో నటించింది. నిఖిల్ నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘స్వయంభు’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న ‘హైందవ’ చిత్రాల్లో నూ సంయుక్త కీలక పాత్రల్లో నటిస్తున్నది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో ఓ మూవీలో నటినస్తుంది. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు అటు మలయాళం లో కూడా పరసగా సినిమాలు చేస్తూ బిజీగా కలుపుతుంది. ఏడాది అటు 4, 5 సినిమాలలో నటించబోతున్నట్లు సమాచారం.. వాటి గురించి పూర్తి అప్డేట్స్ ఇవ్వనుందని తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ అమ్మడు ఇప్పటివరకు నటించిన ప్రతి సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. సినిమాలు హిట్ అయినా సరే సంయుక్త కు క్రేజ్ మాత్రం పెరగలేదు.. ఆమె కన్నా చిన్న హీరోయిన్లు ప్రస్తుతం స్టాప్ లిస్టులో ఉంటున్నారు.. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలు ఒకటైన బ్రేక్ ఇవ్వని ఇస్తారేమో చూడాలి..