BigTV English

Brahmamudi Serial Today September 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేవతి ముసుగు తీసేసిన రుద్రాణి – షాక్‌ లో దుగ్గిరాల కుటుంబం  

Brahmamudi Serial Today September 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేవతి ముసుగు తీసేసిన రుద్రాణి – షాక్‌ లో దుగ్గిరాల కుటుంబం  

Brahmamudi serial today Episode: రుద్రాణి ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి బౌల్‌ ముందు పెడుతుంది. ఒక్కోక్కరు వచ్చి తమకు చీటిలో వచ్చింది చేసి వెళ్తుంటారు. ఇంతలో రాజ్ చీటి తీస్తాడు. అందులో తన మొదటి ప్రేమను తెలియజేయాలని వస్తుంది. అది చదివిన రుద్రాణి దూరంగా వెళ్తుంది. వెళ్లండి నిజాయితీగా మీ మొదటి ప్రేమను చెప్పండి.. నేను అని మాత్రం అబద్దం చెప్పకండి ఎందుకంటే ముందు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంది మా అక్కను.. ఆ విషయం మర్చిపోకండి అంటుంది కావ్య. సరే నిజాయితీగానే నా ప్రేమను చెప్తాను.. అంటూ లేచి వెళ్లి.. నిజాయితీగా నా ప్రేమను చెప్పమంటున్నారు. చెప్తాను.. కానీ దానికంటే ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి.. ప్రేమ గొప్పదా..? పెళ్లి గొప్పదా..? అని రాజ్‌ అడగ్గానే ఎవ్వరూ చెప్పరు..


కొంత మంది పెద్దలు చేసిన పెళ్ళిల్లే కరెక్టు అని వాదిస్తే.. మరికొంత మంది ప్రేమ లేకపోతే అసలు పెళ్లే లేదంటారు. వీటిలో ఏది నిజం అనే ప్రశ్న జోలికి నేను వెళ్లడం లేదు.. కేవలం నా అనుభవం మాత్రమే చెప్పబోతున్నాను.. పెళ్లి రెండు అక్షరాలతో మొదలై మూడు ముళ్లతో బంధం వేసి నలుగురి చేత అక్షింతలు వేయించి.. పంచభూతాల సాక్షిగా నేనే ఆరోప్రాణం అంటూ నాతో ఏడడుగులు వేయించింది. దాని ప్రతిఫలం నాకు ఇష్టం లేని ఒక మనిషి జీవితాంతం నాతోనే ఉంటానంటూ నా ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇష్టం లేని మనిషితో నేను ఎందుకు కాపురం చేయాలని దూరంగా వెళ్లిపోతూనే ఉన్నాను.. కానీ నేను ఎంత దూరం వెళితే అంత దూరం వెతుక్కుంటూ వచ్చింది నా కళావతి. ఇష్టం లేని పెళ్లి అని నేను అనుకున్నాను.. కానీ తను మాత్రం ఇది దేవుడు చేసిన పెళ్లి అనుకుంది. మూడు ముళ్లు వేసినందుకే నాకు జన్మజన్మలకు సరిపడా ప్రేమను ఇచ్చింది.

అలాంటి మనిషికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. మళ్లీ జన్మంటూ ఉంటే తిరిగి తన భర్తను అవ్వడం తప్పా.. కళావతి గడిచిన కాలం.. ఆ పెళ్లితో నువ్వు పెట్టిన కన్నీళ్లను నేను మార్చలేను.. కానీ భవిష్యత్తులో మాత్రం నీకు కన్నీరంటే తెలియని ప్రపంచాన్ని ఇస్తాను. నువ్వు ఇచ్చిన ప్రేమను పదింతలు చేసి నీకు ఇస్తాను. నా దృష్టిలో పెళ్లే గొప్పది అంటాను. దానికి కారణం అయిన కళావతే గొప్పది అంటాను. ఇక మీరు అడిగిన మొదటి ప్రేమ గురించి చెప్పాలంటే.. మన కంపెనీ వంద సంవ్సరాలు పూర్తి చేసుకున్న రోజున ఇదే వినాయకుడి పూజలు చేసినప్పుడు చీకట్లో నీడ చాటున నాట్యం చేస్తున్న  ఒక బాపు బొమ్మను చూసి ఇష్టపడ్డాను. ఆ క్షణం నిజంగానే ఒక తెలియని అనుభూతి చెందాను. దాన్నే ప్రేమ అనుకున్నాను. తనను ఎలాగైనా చూడాలనుకున్నాను. కానీ నేను వెళ్లే సరికి తను మిస్‌ అయ్యింది. తర్వాత స్వప్న అదే పాటకి డాన్స్‌ వేస్తూ కనిపించింది. అప్పుడే నాకు అర్థం అయింది. ఆ నీడలో చూసిన అమ్మాయి  స్వప్న అని అంటూ చెప్పగానే..


కావ్య తానే డాన్స్‌ చేసిన విషయం గుర్తు చేసుకుంటుంది. ఇంతలో స్వప్న అది నేను కాదు రాజ్‌ అని చెప్తుంది. ఆరోజు నిన్ను ఇంప్రెస్‌ చేయాలంటే డాన్స్‌ చేయాలనుకున్న కానీ నాకు డాన్స్‌ రాదు.. అందుకే ఒకరి సాయం తీసుకున్నాను.. చీకట్లో డాన్స్‌ వేస్తుంటే.. నువ్వు చూసి మనసు పారేసుకుంది ఎవరి మీదో కాదు మా కావ్య మీదే.. తనే నాకు డాన్స్‌ నేర్పించింది అంటూ స్వప్న చెప్పగానే.. రాజ్‌ ఆశ్చర్యంగా అయితే మొదటిగా ఇష్టపడింది.. మొదటిగా ప్రేమించింది.. మొదటిగా పెళ్లి చేసుకుంది.. నిన్నే అన్నమాట అంటాడు రాజ్‌. దీంతో కావ్య అవునండి అంటూ రాజ్‌ను హగ్‌ చేసుకుంటుంది. అందరూ హ్యాపీగా ఫీలవుతారు.. ఇంతలో సీతారామయ్య ఓరేయ్‌ మనవడా నీ ప్రేమ నిజంగా చాలా గొప్పదిరా.. అందుకే మేమందరం కలసి నీకు స్వప్నతో పెళ్లి చేయాలని చూసినా.. నీకు కావ్యతోనే పెళ్లి జరిగింది నాకు ఇప్పుడు అర్థం అయింది ఎందుకో అంటాడు. దీంతో ఇంద్రాదేవి అదే ఆ దేవుడు మీకు ఎప్పుడో బ్రహ్మముడి వేశాడు.. మీకు ఆ విషయం ఆలస్యంగా తెలిసింది అన్నమాట.. అంటూ చెప్పగానే..

ఓకే ఈ రకంగా ఓ నిజం బయట పడింది. రాజ్‌ మొదటి ప్రేమ కావ్య అని తెలిసిపోయింది. ఓకే ఇప్పుడు దాదాపు అందరూ కవర్‌ అయిపోయారు.. ఇక మిగిలించి మన గెస్ట్‌ మాత్రమే.. తను కూడా చీటి తీస్తే ఓపెన్‌ అయిపోతుంది. అనగానే.. రేవతి అయ్యో నా వల్ల కాదండి.. అంటుంది. కావ్య వద్దని చెప్తుంది. అపర్ణ చేయమని చెప్తుంది. రుద్రాణి బౌల్‌ తీసుకుని వెళ్లి చీటీ తీయమని రేవతి ముందు పెడుతుంది.. రేవతి చీటి తీయగానే.. సోలో గా డాన్స్‌ చయాలని వస్తుంది. రేవతి చేయలేనని చెప్తున్నా.. రుద్రాణి వినకుండా బలవంతంగా రేవతిని తీసుకెళ్లి డాన్స్‌ చేయిస్తుంది. డాన్స్‌ చేస్తుంటే.. రేవతి ముసుగు తొలగిపోతంది. రేవతిని చూసిన అందరూ షాక్‌ అవుతారు.

రుద్రాణి మాత్రం ఎందుకు రేవతి ఈ నాటకం ఆడావు.. అంటూ తిడుతుంది. మధ్యలో రాజ్‌ రుద్రాణిని తిడతాడు.. దీంతో అందరూ రేవతిని తామే కలిసి తీసుకొచ్చామని చెప్తారు. అయితే అందరూ కలిసి మా వదినను మోసం చేశారా అంటూ నిలదీస్తుంది రుద్రాణి ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: అక్షయ్ పై బాస్ సీరియస్.. భరత్ ను మార్చేసిన పల్లవి.. పెళ్లి రోజుల వేడుక కోసం ఏర్పాట్లు..

GudiGantalu Today episode: రోహిణికి షాకిచ్చిన ప్రభావతి.. మీనా, బాలు రొమాన్స్.. మనోజ్ కు కొత్త కష్టాలు..

Nindu Noorella Saavasam Serial Today September 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని ఇరికించేందుకు మిస్సమ్మ ప్లాన్‌

Telugu TV Serials: ఈ వారం ఊహించని రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటంటే..?

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు.. ఆ ఒక్కటి స్పెషల్..

Nindu Noorella Saavasam Serial Today September 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు పునర్జన్మ ఉందన్న గుప్త

Bigg Boss 9 Telugu: శ్రేష్ఠ వర్మ ఒక్క వారానికి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Big Stories

×