OTT Movie : సౌత్ సినిమాలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది. అయితే యాక్షన్, డ్రామా కంటే ఫ్రెష్ కంటెంట్ కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. మీరు కూడా అలాంటి సినిమాల కోసం వెతుకుతుంటే ఈ మూవీ మీ కోసమే.
ఈ తమిళ థ్రిల్లర్ పేరు Flashback. సంతోష్ జయకుమార్ దర్శకత్వంలో, అభిషేక్ ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ 2025లోనే థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video)లో తమిళ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో అందుబాటులో ఉంది. ప్రభు దేవా, రెజినా కాసండ్రా, అనసుయా భరద్వాజ్, విజయ్ విశ్వ తదితరులు నటించిన ఈ మూవీ రిలీజ్ అయ్యిందన్న విషయం కూడా చాలా మందికి తెలీదు. IMDbలో 7.8 రేటింగ్ ఉన్న ఈ మూవీకి సామ్ సీ.ఎస్ సంగీతం అందించారు. ఈ మూవీ హిందీ డబ్డ్ వెర్షన్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
కథ ప్రభు దేవా పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఫ్లాష్‌బ్యాక్ కథలో అర్జున్ (ప్రభుదేవా) ఒక యువ రచయిత. తన యూత్‌లో జరిగిన ఎమోషనల్ జర్నీని ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా చెప్పే కథ ఇది. అర్జున్ ఒక చిన్న ఊరిలో పెరిగిన యువకుడు. తన స్కూల్ టీచర్ మీనా (రెజినా కాసండ్రా) పట్ల ఇన్ఫాట్యుయేషన్‌తో కథ మొదలవుతుంది. మీనా ఒక స్మార్ట్, ఇన్‌స్పైరింగ్ టీచర్. అర్జున్ రచనా ప్రతిభను గుర్తించి, అతన్ని ఎంకరేజ్ చేస్తుంది. అయితే అర్జున్ కు ఆమెపై ఉన్న యూత్‌ఫుల్ ఇన్ఫాట్యుయేషన్, లస్ట్ అతని జీవితంలో ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది.
అర్జున్ స్కూల్ డేస్‌లో, మీనా పట్ల ఆకర్షణ పెంచుకుంటాడు. మీనా అతని రచనలను ప్రశంసిస్తూ, అతనికి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంది, కానీ ఆమె ప్రొఫెషనల్ బౌండరీస్‌ను ఎప్పుడూ గౌరవిస్తుంది. అర్జున్ తన యౌవన ఆవేశంలో మీనాపై ఉన్న ఆకర్షణను ప్రేమగా భావిస్తాడు. కానీ అతని ఫీలింగ్స్‌లో లస్ట్ ఎక్కువగా ఉంటుందని తర్వాత అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో అర్జున్ ఫ్రెండ్/మెంటర్ సావిత్రి (అనసూయా భరద్వాజ్) అతని ఇన్ఫాట్యుయేషన్‌ను అర్థం చేసుకుని, ఆమె లైఫ్ లో జరిగిన ఒక ట్రాజిక్ లవ్ స్టోరీని షేర్ చేస్తుంది. అది అర్జున్‌ను ఆలోచింపజేస్తుంది. సావిత్రి పాస్ట్‌లో ఒక ప్రేమికుడిని కోల్పోయిన బాధను రివీల్ చేస్తుంది, ఇది అర్జున్‌కు ఎమోషనల్ మెచ్యూరిటీని నేర్పిస్తుంది. ప్రజెంట్ లో అర్జున్ సక్సెస్ ఫుల్ రైటర్. తన స్కూల్ డేస్ మెమరీలను రిఫ్లెక్ట్ చేస్తూ, మీనాతో జరిగిన ఇంటరాక్షన్స్‌ను ఒక నవలగా రాస్తాడు. అతను మీనాను మళ్లీ కలుస్తాడు. మరి అనసూయ పాస్ట్ ఏంటి? చివరికి మీనాను కలిసిన అర్జున్ ఏం చేశాడు? అనేది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.
Read Also : అర్ధరాత్రి అమ్మాయి అదృశ్యం… 2 గంటల సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్