Nindu Noorella Saavasam Serial Today Episode: సరస్వతి వార్డెన్ ఉన్న రూంలోకి మిస్సమ్మను తీసుకెళ్లుంది నర్సు. వెనకాలే వెళ్లిన మనోహరి, వార్డెన్‌ను చూసి షాక్ అవుతుంది. నేను అంతా వెతుకుతుంటే ఇక్కడ చచ్చిందా ఇది అని మనసులో అనుకుంటుంది. అక్కడే ఉన్న డాక్టర్ ఈవిడను ఇలా వదిలేయడం ఏంటండి అంటూ కోప్పడతాడు. దీంతో మిస్సమ్మ.. ఈవిడ నాతో చెప్పాలనుకుంటున్న విషయాన్ని ఎవరో చెప్పకుండా అడ్డుకుంటున్నారు. డాక్టర్ ఈవిడకు స్పృహ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది. ఒక్క ఇంజక్షన్ చేసి స్పృహలోకి తీసుకొస్తాను. కానీ కొంచెం టైం పడుతుంది అని చెప్తాడు డాక్టర్.
వెంటనే ఆవిడకు ఆ ఇంజక్షన్ ఇవ్వండి. అలాగే ట్రీట్‌మెంట్ కూడా స్టార్ట్ చేయండి. ఒక స్పెషల్ రూం ఇవ్వండి. తను చాలా డేంజర్‌లో ఉన్నారు. అని మిస్సమ్మ చెప్పగానే.. ఓకే మేడం అంటాడు డాక్టర్. రాథోడ్ అలాగే నువ్వు స్పెషల్ రూం ఎదుట స్పెషల్ సెక్యూరిటీ పెట్టించు అని చెప్తుంది. రాథోడ్ ఓకే మిస్సమ్మ అంటాడు. మనకు తెలియకుండా ఆ రూంలోకి ఎవ్వరూ వెళ్లకూడదు. ఆవిడను కలవకూడదు. ఆవిడ స్పృహలోకి రాగానే తను చెప్పాలనుకున్న విషయం తెలుసుకుంటాను. ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను అంటుంది మిస్సమ్మ. సరే మిస్సమ్మ ఇప్పుడే అరెంజ్ చేస్తాను అంటాడు రాథోడ్.
తర్వాత రాథోడ్ వచ్చి మిస్సమ్మ నువ్వు చెప్పినట్టే వార్డెన్ గారిని స్పెషల్ రూంలోకి షిప్ట్ చేశాను. బయట ఇద్దరు సెక్యూరిటీని పెట్టాను. వాళ్లను కాదని చిన్న చీమ కూడా లోపలికి వెళ్లదు. ఆవిడకు స్పృహ లేకుండా చేసింది కచ్చితంగా మనోహరే అయ్యుంటుంది మిస్సమ్మ. ఇందులో డౌటే లేదు అంటాడు రాథోడ్. కానీ ఆధారాలు లేకుండా మనం ఏం చేయలేం కదా రాథోడ్ అంటుంది మిస్సమ్మ. కానీ వార్డెన్ మేడం నీతో చెప్పాలనుకుంటున్న విషయాలను నీతో చెప్పకుండా మనోహరి అడ్డుకుంటుంది మిస్సమ్మ అంటూ రాథోడ్ చెప్పగానే.. ఆ విషయం నాకు తెలుసు రాథోడ్ కానీ ఆవిడ నోరు తెరచి చెప్పే వరకు మనం వెయిట్ చేయాల్సిందే.. అని మిస్సమ్మ చెప్తుండగానే డాక్టర్ వస్తాడు. ఏమ్మా బ్లడ్ దొరికిందా అని అడుగుతాడు. ఇంకా దొరకలేదు డాక్టర్ ట్రై చేస్తున్నాము అని మిస్సమ్మ చెప్తుంది.
ఇంకా ట్రై చేయడం ఏంటి..? టైం లేదు త్వరగా సర్జరీ చేయాలి అని చెప్తాడు డాక్టర్. ఒక అరగంటలో బ్లడ్ దొరుకుతుంది డాక్టర్ మీరు సర్జరీకి ఏర్పాట్లు చేయండి అని మిస్సమ్మ చెప్పగానే.. ఓకే అమ్మా అంటూ డాక్టర్ వెళ్లిపోతాడు. ఇంతలో రామ్మూర్తి అరగంటలో ఎలా అవుతుందమ్మా.. అల్లుడు గారేమో పిల్లలను తీసుకుని రావానికి నిమజ్జనం దగ్గరకు వెళ్లాడు. మనం అంతా ఇక్కడే ఉన్నాం. మరి బ్లడ్ ఎవరు తీసుకొస్తారు అని అడుగుతాడు.. దీంతో మిస్సమ్మ బ్లడ్ కోసం మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నాన్న..ఇక్కడే దొరుకుతుంది అని మిస్సమ్మ చెప్పగానే.. రాథోడ్ ఆశ్చర్యంగా మిస్సమ్మ ఇక్కడ ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికి ఉంటుంది అని అడుగుతాడు.
మనోహరికి అని మిస్సమ్మ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. మనోహరిది అంజలి బ్లడ్ గ్రూప్ ఎలా అవుతుందమ్మా.. అని రామ్మూర్తి అడగ్గానే.. ఎందుకంటే.. మనోహరి, అంజలి కన్నతల్లి కాబట్టి అని చెప్తుంది మిస్సమ్మ.. దూరం నుంచి అంతా చూస్తున్న ఆరు కరెక్టు భాగీ అదే కరెక్టు.. అదే కన్నతల్లి అంటుంది. రాథోడ్ మాత్రం అది ఇంకా కన్‌ఫం కాలేదు కదా మిస్సమ్మ అని అడుగుతాడు. ఇప్పుడు కన్‌ఫం అవుతుంది అంటూ నాన్నా మీరు ఏం చేస్తారు అంటే అని రామ్మూర్తికి తన ప్లాన్ చెప్తుంది మిస్సమ్మ. ఆరు దగ్గరకు వెళ్లి వినాలకుంటుంది. గుప్త ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. భాగీ నాన్నతో ఏదో చెప్తుంది వెళ్లి వింటాను గుప్త గారు అంటుంది ఆరు. నువ్వు అచ్చటకు వెళితే నీ సోదరికి కనిపిస్తావు అంటూ ఆరును ఆపేస్తాడు గుప్త.
ఇక మిస్సమ్మ మీరు అలా చేయండి నాన్న మేమొచ్చి మిగతాది పూర్తి చేస్తాం.. అని చెప్పగానే.. రామ్మూర్తి అలాగే అమ్మా అంటాడు. మిస్సమ్మ, రాథోడ్ అక్కడి నుంచి పక్కకు వెళ్లి చాటు నుంచి చూస్తుంటారు.. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.