No Handshake : ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో మరోసారి భారత్ తమ బలాన్ని ప్రదర్శించింది. అస్సలు పోటీ లేని మ్యాచ్ లో ఏకపక్షంగా ఆధిపత్యం చెలాయించి సునాయస విజయాన్ని అందుకుంది. దాయాది జట్టు పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే దుబాయ్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన టీ-20 మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు దాయాది దేశాన్ని గ్రౌండ్ లోనే అవమానించారు. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన తరువాత సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే మైదానం నుంచి వెళ్లిపోయారు. భారత ఆటగాళ్లు ఎవ్వరూ కూడా కూడా గ్రౌండ్ లోకి వచ్చి పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.
Also Read : Ind vs Pak Asia Cup 2025: దుబాయ్ లో చిత్తుగా ఓడిన పాకిస్థాన్…పహల్గాం బాధితులకు న్యాయం జరిగినట్టేనా
సాధారణంగా మ్యాచ్ ముగిసిన తరువాత ప్రత్యర్థిని గౌరవిస్తూ.. షేక్ హ్యాండ్ ఇస్తారు. కానీ ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నవిషయం.. మరోవైపు కొందరూ బాయ్ కాట్ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ అంటూ నినాదాలు చేయడంతో టీమిండియా వారిని గౌరవిస్తూ.. పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించింది. మరోవైపు టాస్ టైమ్ లోనూ పాకిస్తాన్ కెప్టెన్ తో కూడా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కరచాలనం చేయలేదు. గ్రౌండ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు వాళ్లే షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. టీమిండియా ఆటగాళ్లు తన తోటి ఆటగాళ్లతో స్టేడియం బయట ఒకరినొకరూ కరచాలనం చేసుకున్నారు. దీంతో టీమిండియా అభిమానులు టీమిండియా కి హ్యాట్సాప్ చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. మరోవైపు పాకిస్తాన్ కోచ్ మైక్ హెసన్ స్పందిస్తూ.. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం తమను తీవ్రంగా నిరుత్సాహపరిచిందని పేర్కొన్నారు. వారి కోసం గ్రౌండ్ లోతాము చాలా సేపు ఎదురు చూశామని.. ఇది సరికాదని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ లో తమ ప్రదర్శన కూడా ఏమీ బాగోలేదని వ్యాఖ్యానించారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అయితే తొలి ఓవర్ లో హార్దిక్ పాండ్యా, రెండో ఓవర్ లో బుమ్రా వరుసగా వికెట్లు తీశారు. పాకిస్తాన్ ఓపెనర్ షాహిబ్ జాదా పర్హాన్ (40), షాహిన్ అఫ్రిది (33) నాటౌట్ మినహా మిగతా బ్యాటర్లు ఎవ్వరూ పెద్దగా స్కోర్ చేయకపోవడం గమనార్హం. పాకిస్తాన్ ఓపెనర్ అయూబ్ వరుసగా రెండో మ్యాచ్ లో గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. చివర్లో షాహిన్ సిక్స్ లతో మెరిశాడు. టీమిండియా బ్యాటర్లు అభిషేక్ శర్మ (31), గిల్ (10), కెప్టెన్ సూర్యకుమార్ (47 నాటౌట్), తిలక్ వర్మ (31), శివమ్ దూబే (10 నాటౌట్) గా నిలిచారు. దీంతో భారత్ 131 పరుగులు చేసింది. 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది.
No handshake by Indian team.
Pakistan waited for handshake but India went to the dressing room and closed the doors.
What a humiliation by Indian team 🤣
Belt treatment for Porkis#INDvPAK #IndianCricket #INDvsPAK #indvspak2025 #AsiaCupT20 #AsiaCup #ShubmanGill #ViratKohli𓃵 pic.twitter.com/zXMXZEmiuP
— Aman (@dharma_watch) September 14, 2025