BigTV English

OTT Movie : చెత్తకుప్పలో చిన్న పిల్లల శవాలు… అత్యంత క్రూరంగా చంపేసే సైకో… స్పైన్ చిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : చెత్తకుప్పలో చిన్న పిల్లల శవాలు… అత్యంత క్రూరంగా చంపేసే సైకో… స్పైన్ చిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : సీరియల్ కిల్లర్ లేదా సైకో కిల్లర్ సినిమాలు క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఉంటాయి. అయితే ఆ కేసులను పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసే విధంగా మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అందులోనూ ఇన్వెస్టిగేషన్ లో ఫోరెన్సిక్ కీలక పాత్రను పోషిస్తుంది. అయితే ఫోరెన్సిక్ అనే అంశమే మెయిన్ ప్లాట్ గా క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కితే… అలాంటి అదిరిపోయే మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ పేరు Forensic. అఖిల్ పాల్ – అనాస్ ఖాన్ దర్శకత్వంలో, ప్రభావ్ సినిమాస్ నిర్మించిన ఈ మూవీ 2020 ఫిబ్రవరి 28న రిలీజ్ అయింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అందుబాటులో ఉంది. ఈ మూవీలో టోవినో థామస్ (సామ్యూల్ జాన్ కట్టూక్కారన్), మామతా మోహన్‌దాస్ (ACP రిథికా ఎక్సావియర్), సాయిజు కురుప్ (ఎక్సావియర్), రెంజి పనిక్కర్ (డాక్టర్ అల్ఫాంస్ కురియన్), రీబా మోనికా జాన్ (నాయనా), రేక్షా మాల్లూర్ (షిక్హా) తదితరులు నటించారు. టోవినో థామస్ పర్ఫార్మెన్స్, ఫోరెన్సిక్ డీటెయిల్స్, సస్పెన్స్ ఫుల్ అంశాలతో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, థియేటర్లలో 50 కోట్లు కలెక్ట్ చేసి 2020లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 2022లో హిందీలో కూడా రీమేక్ అయ్యింది.

స్టోరీలోకి వెళ్తే…

కథ త్రివేండ్రంలో జరుగుతుంది. ఇక్కడ ఒక సీరియల్ కిల్లర్ చిన్న అమ్మాయిలను టార్గెట్ చేసి, వారిని క్రూరంగా చంపుతూ, శవాలను ముక్కలు ముక్కలుగా చేసి హత్యలు చేస్తాడు. ACP రిథికా ఎక్సావియర్ (మామతా మోహన్‌దాస్) ఒక డివోర్సీ మదర్. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఫోరెన్సిక్ టీమ్‌ను రిక్వెస్ట్ చేస్తుంది. అయితే అసైన్ అయిన ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ సామ్యూల్ జాన్ కట్టూక్కారన్ (తోవినో థామస్) ఆమె ఎక్స్ హస్బెండ్ ఎక్సావియర్ (సాయిజు కురుప్) సోదరుడు అని తెలిసి అసౌకర్యంగా ఫీల్ అవుతుంది.


తమ బిడ్డ చనిపోవడం వల్ల రిథికా – ఎక్సావియర్ విడాకులు తీసుకుంటారు. ఇది రిథికా కేర్‌లెస్‌నెస్ వల్ల జరిగిందని అందరూ భావిస్తారు. ఈ ట్రామా వల్ల వారికి ఉన్న మరొక కూతురు సైకాలజిస్ట్ డాక్టర్ అల్ఫాంస్ కురియన్ (రెంజి పనిక్కర్)తో కౌన్సెలింగ్ తీసుకుంటుంది. సామ్యూల్ తన ఫోరెన్సిక్ స్కిల్స్‌తో కిల్లర్ ఒక చిన్న పిల్ల అని అనుమానిస్తాడు. మొదట రిథికా ఈ విషయాన్ని అస్సలు నమ్మదు. కానీ ఒక ఐ-విట్‌నెస్ ఒక చిన్న బాయ్ డెడ్ బాడీని డంప్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేస్తుంది. దీంతో సామ్యూల్ – రిథికా కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ మరిన్ని హత్యలు జరుగుతాయి. క్లైమాక్స్‌లో కిల్లర్ ఐడెంటిటీ రివీల్ అవుతుంది. మరి ఆ కిల్లర్ ఎవరు? నిజంగానే చిన్న పిల్ల హత్యలు చేస్తోందా? అనేది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

Read Also : కోరిక తీర్చలేదని గర్ల్ ఫ్రెండ్ ని ట్రిప్పుకు తీసుకెళ్లి… మస్ట్ వాచ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్

Related News

OTT Movie : గ్రామంలో వరుస హత్యలు… శవాలు మాయం… భార్య కోసం ఏకంగా ఊరినే లేపేసే ప్లాన్ వేసే సైకో

OTT Movie : హాస్పిటల్ స్టాఫ్ ను టార్గెట్ చేసి చంపే సైకో… హింట్ ఇచ్చి మరీ హత్యలు… గ్రిప్పింగ్ సైకాలజికల్ థ్రిల్లర్

OTT Movie : భార్యతో ఫస్ట్ నైట్ వీడియో రికార్డ్ చేసుకునే వింత ఫాంటసీ… కడుపుబ్బా నవ్వించే మలయాళ మూవీ

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బాధలో ఉన్నాడని భర్తకు తెలియకుండా… నెక్స్ట్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్ మావా

OTT Movie : పోలీసులపై పగ.. కమిషనర్లనే చంపి గుండెలు చీల్చే సైకో కిల్లర్… క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : టీచర్ పై స్టూడెంట్ పిచ్చి ప్రేమ… చివరికి ఊహించని ట్విస్ట్… యూత్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ

OTT Movie : ఆత్మహత్య కోసం వెళ్లి ఐలాండ్ లో ఇరుక్కుపోయే అమాయకుడు… ట్విస్టులతో మెంటలెక్కించే సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

×