BigTV English

Vijayawada News: అంతా ఉచిత మహిమ.. బస్సులో సీటు కోసం మహిళలు ఫైటింగ్, వీడియో వైరల్

Vijayawada News: అంతా ఉచిత మహిమ.. బస్సులో సీటు కోసం మహిళలు ఫైటింగ్, వీడియో వైరల్

Vijayawada News: దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సులు ఏమోగానీ.. సీట్ల కోసం కొట్టుకున్న ఘటనలు ఎక్కడో దగ్గర వెలుగు చూస్తున్నాయి. అలాంటి ఘటన ఒకటి ఉమ్మడి కృష్ణాజిల్లాలో బయటపడింది. బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు ఫైటింగ్‌కు దిగారు. దీనికి సంబందించిన వీడియో వైరల్ అయ్యింది.


కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతోంది. మహిళల నుంచి మాంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్త బస్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఉచిత ట్రావెలింగ్ కావడంతో బస్సులో రద్దీ అమాంతంగా పెరిగింది. ఇదే క్రమంలో మహిళల మధ్య గొడవలు జరుగుతున్న సందర్భాలు లేకపోలేదు.

ఒకప్పుడు బస్సుల్లో ఎవరికి కేటాయించిన సీట్లలో వారు కూర్చొనేవారు. ఉచిత బస్సులో ఎవరు ముందుగా బస్సు ఎక్కితే వారు కూర్చొంటున్నారు. ఈ విషయంలో పురుషులు సైతం నోరు మెదపడం లేదు. వారి సీట్లను మహిళలకే ఇస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. సీట్ల కోసం మహిళలు కొట్టుకున్న సందర్భాలు బయటకు వస్తున్నాయి.


తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. వీకెండ్ కావడంతో పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ అమ్మవారి దేవాలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. పెనుగంచిప్రోలు నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఎక్కారు. అందులో మూడొంతుల మహిళలు ఉన్నారు.

ALSO READ: తాతకు తగ్గ మనవడు, దేవాన్ష్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు

సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య మాటలు చిలికి చిలికి గాలివానగా మారాయి. ఎవరూ వినలేనంత అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. ఆయా మహిళలకు బస్సులోని ప్రయాణికులు మద్దతు పలికారు. దీంతో గొడవ తారాస్థాయికి చేరింది. ఆ ఇద్దరు మహిళలు నీళ్ల సీసాలతో కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

డ్రైవర్‌ మాత్రం బస్సు ఆపలేదు. చివరకు బస్సు నందిగామ సమీపంలోకి కొంతమంది ప్రయాణికులు బస్సుని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాలని డ్రైవర్‌ని కోరారు. అప్పటివరకు గొడవ సద్దు మణగలేదు. ఈ ఘటనను ఓ ప్రయాణికుడు తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.

అది వైరల్‌గా మారింది. స్త్రీ శక్తి పథకం అమలుతో బస్సుల్లో మహిళా ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. అదనంగా బస్సులు నడపాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. ఉచిత బస్సు స్కీమ్ మొదలుపెట్టిన ఈ తరహా ఘటనలు నిత్యం ఏదో ఒక దగ్గర వెలుగులోకి వస్తున్నాయి.

 

Related News

AP Politics: ఏపీని షేక్ చేస్తున్న ఐఏఎస్ గిరిషా.. అసలు కథ ఇదే..

CM Progress Report: ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్ట్‌పై సీఎం చంద్రబాబు రివ్యూ..

Nara Devansh: తాతకు తగ్గ మనవడు.. నారా దేవాన్ష్‌కి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు

Rain Alert: ఈ జిల్లాల ప్రజలు అలర్ట్..! భారీ వర్షం, పిడుగులు పడే ఛాన్స్..

Ayyanna Patrudu: మాజీ సీఎం జగన్‌కు.. అయ్యన్నపాత్రుడు చురకలు..

Chicken Price Hike: భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా?

AP Politics: బీజేపీలోకి పోతుల సునీత.. చీరాల టికెట్‌పై కన్ను, తెర వెనుక జగన్?

Big Stories

×