OTT Movie : ఈరోజు మన మూవీ సజెషన్ ఓ అద్భుతమైన మలయాళం బ్లాక్ కామెడీ-డ్రామా-థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ మొదటి సీన్ నుండే ఆకట్టుకుంటుంది. గ్రిప్పింగ్ స్టోరీ, ఊహించని ట్విస్ట్‌లతో, ఈ మూవీ కామెడీ-థ్రిల్లర్ ఎంత బాగుంటుందంటే… ఫ్యామిలీతో మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ అని చెప్పొచ్చు. సినిమాను చూశాక నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవడిదిరా బాధ్యత అని మనసారా హాయిగా నవ్వుకునేలా ఉంటుంది ఈ మూవీ.
ఈ మలయాళ కామెడీ డ్రామా పేరు Nunakkuzhi. 128-నిమిషాల ఈ మలయాళం మూవీ జీతు జోసెఫ్ దర్శకత్వంలో, కె.ఆర్. కృష్ణకుమార్ రచనలో, సరేగమా ఇండియా లిమిటెడ్ నిర్మాణంలో రూపుదిద్దుకుంది. 2024 ఆగస్టు 15న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ZEE5 ఓటీటీలో అదే ఏడాది సెప్టెంబరు 13 నుండి అందుబాటులో ఉంది. ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. ఇందులో బాసిల్ జోసెఫ్ (ఎబీ జాకరయా పూజికున్నెల్), గ్రేస్ ఆంటనీ (రశ్మితా రంజిత్), నిఖిలా విమల్ (రిమి జాకరయా), సిద్దీక్ (భామకృష్ణన్), మనోజ్ కె. జయన్ (సుందర్‌నాథ్), బీను పప్పు (సాగరన్ చమకల), బైజు సంతోష్ (సీఐ అబ్రహం తరకన్), అల్థాఫ్ సాలిం (నవీన్), అజు వర్గీస్ (రంజిత్), సాయిజు కురుప్ (డాక్టర్), స్వాసిక విజయ్ (స్వాసిక) తదితరులు కీలక పాత్రలు పోషించారు. IMDbలో 6.8 మాత్రమే ఉంది. కానీ బాసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటనీ పర్ఫార్మెన్స్‌లు, జీతు జోసెఫ్ డైరెక్షన్ అద్భుతంగా ఉన్నాయి. ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా నవ్వుకునేలా ఉంటుంది ఈ మూవీ.
కథ ఎబీ జాకరయా పూజికున్నెల్ (బాసిల్ జోసెఫ్) చుట్టూ తిరుగుతుంది. అతను పూజికున్నెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ MD. తన లైఫ్‌లో జరిగే సిరీస్ ఆఫ్ అన్‌ఫర్చునేట్ ఈవెంట్స్‌లో చిక్కుకుంటాడు. ఎబీ లైఫ్ స్మూత్‌గా సాగుతుంది. కానీ ఒక చిన్న మిస్టేక్ అతన్ని చిక్కుల్లో పడేస్తుంది. ఎబీ యొక్క లైఫ్‌లో జరిగే అనేక మిస్టేక్స్… కంపెనీ స్కాండల్స్, ఫ్యామిలీ సీక్రెట్స్ వంటివి అతన్ని మరింత డీపర్ ట్రబుల్‌లలోకి నెట్టివేస్తాయి. ఎబీ తన మిస్టేక్స్‌ను కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ, అతని చుట్టూ ఉన్నవారిని ఎలా ప్రభావితం చేస్తాడో చూస్తూ కడుపుబ్బా నవ్వుకోవచ్చు. మూవీలో సుందర్‌నాథ్ (మనోజ్ కె. జయన్), సాగరన్ చమకల (బీను పప్పు), సీఐ అబ్రహం తరకన్ (బైజు సంతోష్) వంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కథకు ట్విస్ట్‌లు జోడిస్తారు. మొదటి రాత్రి వీడియో మిస్ అవ్వడం, హీరో వేరొక అమ్మాయి ఇంట్లో దొంగలా దొరికిపోవడం, ఆ తరువాత హత్య కేసులో ఇరుక్కోవడం వంటి సీన్స్ సినిమాలో కీలకం. క్లైమాక్స్ ఊహించని ట్విస్ట్‌లతో ముగుస్తుంది. ఇంతకీ క్లైమాక్స్ ఏంటి? అన్నది తెరపై చూసి హాయిగా నవ్వుకోండి.
Read Also : ఆత్మహత్య కోసం వెళ్లి ఐలాండ్ లో ఇరుక్కుపోయే అమాయకుడు… ట్విస్టులతో మెంటలెక్కించే సర్వైవల్ థ్రిల్లర్