E-Paper
Advertisement

6 నెలల తరువాత ఓటీటీలోకి తెలుగు ఏ రేటెడ్ హర్రర్ ఫిల్మ్

6 నెలల తరువాత ఓటీటీలోకి తెలుగు ఏ రేటెడ్ హర్రర్ ఫిల్మ్
Advertisement

Telugu horror thriller: కొంతమంది దెయ్యాలు, భూతాలు ఒట్టి మూఢనమ్మకాలు అని కొట్టి పారేస్తుంటారు. కానీ ఓటీటీలో అలాంటి సినిమాలు వస్తే మాత్రం వదలకుండా చూస్తారు. ఇదే ఏడాది థియేటర్లలో విడుదలైన ఏ రేటెడ్ హర్రర్ మూవీ Eesha, దాదాపు 6 నెలల తరువాత ఓటీటీలోకి వచ్చింది. అయితే ఈ సినిమా ఈ ఆరు నెలల్లో రెండు సార్లు డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? ఇప్పుడు ఎందుకు వార్తల్లో నిలిచింది ? అన్న వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కళ్యాణ్, నైనా ఈ సినిమాలో మన హీరో హీరోయిన్. వీళ్ళకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లిద్దరే ఆదిత్ అరుణ్, సిరి హన్మంతు. సైంటిఫిక్ గా ఆలోచించే ఈ నలుగురు ప్రాణస్నేహితులు. కథ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సమాజంలో దేవుడి పేరుతో, ఆత్మల పేరుతో ప్రజలను మోసం చేసే నకిలీ బాబాలను, మంత్రగాళ్లను గుడ్డిగా నమ్మకూడదని వాళ్ళు బలంగా నమ్ముతారు. మూఢనమ్మకాలను రూపుమాపడానికి ఒక ఇన్వెస్టిగేటివ్ మిషన్‌ను ప్రారంభిస్తారు.

Advertisement

ఈ క్రమంలో సమాజంలో బాగా పాపులర్ అయిన ఒక పవర్ ఫుల్, ఆధ్యాత్మిక బాబాను కలుస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఫేక్ బాబా. దెయ్యాలు, ఆత్మలు అనేవి కేవలం భ్రమ మాత్రమేనని, వాటికి ఎలాంటి ఉనికి లేదని ఆ బాబాతో వాదిస్తారు. దాంతో ఆ బాబా వారికి ఒక ఛాలెంజ్ విసురుతాడు. నమ్మకం లేని వాళ్ళు రాత్రిపూట ఒక పాడుబడిన భవనంలో గడపగలరా? అని అడుగుతాడు. ఆ ఛాలెంజ్ ను ఈ నలుగురు ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయడమే కాదు, ఆ పాడుబడిన ఇంట్లోకి రాత్రి పూట ఎంట్రీ కూడా ఇస్తారు.

అక్కడ దెయ్యాలు లేవని నిరూపించడమే వాళ్ళ టార్గెట్. కానీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన కొద్దిసేపటికే వింత సంఘటనలు జరుగుతాయి. ఊహించని విధంగా ఆ ఇంటి తలుపులన్నీ లాక్ అయిపోతాయి. బయట ప్రపంచంతో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోతుంది. ఆ భయంకరమైన ఇంట్లో బందీలుగా మిగిలిపోతారు. ఆ చీకటి గదులలో ఒక్కొక్కటిగా అంతుచిక్కని విచిత్రమైన సంఘటనలు జరగడం షురూ అవుతుంది. గాలిలో వస్తువులు కదలడం, వింత శబ్దాలు రావడం, భయపెట్టే నీడలు కనిపించడం… ఇవన్నీ వాళ్ళను పిచ్చివాళ్లను చేస్తాయి. ఆ గదిలోని క్లోజ్డ్ అట్మాస్ఫియర్ వారిని ఒకరినొకరు అనుమానించుకునే స్థాయికి తీసుకెళ్తుంది. మరి ఆ నరకం నుండి ఆ నలుగురు స్నేహితులు ప్రాణాలతో బయటపడ్డారా ? అనేదే మూవీ క్లైమాక్స్.

రెండవసారి ఓటీటీలోకి ?

Advertisement

హారర్ థ్రిల్లర్ జానర్‌లోవచ్చి తెలుగు సినిమా ప్రేమికులను అలరించిన చిత్రం ‘ఈషా’. హిందీ వెర్షన్‌లో ISHAగా విడుదలైంది. కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మాణంలో శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన ఈ చిత్రం Amazon Prime Videoలో తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంతు ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులో ఈ సినిమా చాలా రోజుల క్రితమే విడుదలైంది. కానీ తాజాగా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ షురూ అవ్వడంతో, ఈ మూవీ మరోసారి ట్రెండ్ అవుతోంది.

Read Also: 40 రోజులు నలుగురు పిల్లలు మిస్సింగ్… అమెజాన్ అడవుల్లో అదిరిపోయే అడ్వెంచర్

Related News

లైవ్-స్ట్రీమింగ్ డెత్ మ్యాచ్ గేమ్స్ … ట్రోలింగ్ చేసే వాళ్ళను టార్గెట్ చేసే కిల్లర్

విడుదలకు ముందే ‘ది ఒడిస్సీ’ ఓటీటీ సర్‌ప్రైజ్… ఎక్కడ చూడొచ్చంటే ?

ఓటీటీలో ‘పెద్ది’ని తొక్కేస్తున్న చిన్న సినిమాలు… మెగా డిసప్పాయింట్మెంట్

హర్రర్ నుంచి కామెడీ వరకు… ఈవారం ఓటీటీలోకి రానున్న మలయాళం సినిమాలు

 సూపర్ హీరో సినిమా తీయాలని కుర్రాళ్ల ఆరాటం… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్

ప్రతీ ఎపిసోడ్లో ఒక కొత్త కేసు… ట్విస్టులతో మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

ఒకే ఒక్క టాబ్లెట్ తో కంట్రోల్ తప్పే అమ్మాయిలు… కట్ చేస్తే చెమటలు పట్టించే థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

Advertisement
×