E-Paper
Advertisement

లైవ్-స్ట్రీమింగ్ డెత్ మ్యాచ్ గేమ్స్ … ట్రోలింగ్ చేసే వాళ్ళను టార్గెట్ చేసే కిల్లర్

లైవ్-స్ట్రీమింగ్ డెత్ మ్యాచ్ గేమ్స్ … ట్రోలింగ్ చేసే వాళ్ళను టార్గెట్ చేసే కిల్లర్
Advertisement

Hollywood Action Thriller: ఒక నార్మల్ అబ్బాయి ఇంటర్నెట్ ట్రోలింగ్ చేస్తూ కాలం గడిపితే ఎలా ఉంటుంది ? సడన్ గా ఒక్కసారిగా అతని జీవితంలో సీన్ రివర్స్ అయితే… చేతులు రెండింటికీ తుపాకులు అతుక్కుపోతే… అంతలోనే ఎదురుగా ప్రాణాలు తీసే సైకో కిల్లర్ వస్తే… 24 గంటల్లో ఎలా బ్రతికి బయట పడ్డాడు అనే డేంజరస్ డెడ్లీ గేమ్… ‘గన్స్ అకింబో’ (Guns Akimbo). మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

మైల్స్ లీ హారిస్ అనే వీడియో గేమ్ డెవలపర్ మన హీరో. రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని గేమ్‌లు తయారు చేయడమే అతని పని. రాత్రి పూట ఇంటర్నెట్ లో ట్రోల్ చేయడం అతని హాబీ. తన మాజీ ప్రేయసి నోవాను మరచిపోలేక డిప్రెషన్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఒకరోజు రాత్రి డార్క్ వెబ్‌ లో ‘స్కిజం’ అనే భయంకరమైన లైవ్ స్ట్రీమింగ్ గేమ్ ను చూస్తాడు. ఆ డెడ్లీ డెత్ గేమ్ ఏంటంటే… నగర వీధుల్లో నిజమైన నేరస్థులు ఒకరినొకరు చంపుకునే డెత్ మ్యాచ్.

Advertisement

ఆ గేమ్‌ను చూసి మైల్స్ ఆన్‌లైన్‌లో బూతులు తిడుతూ ట్రోల్ చేస్తాడు. దీంతో గేమ్ లీడర్ రిక్టర్ కోపం తెచ్చుకుంటాడు. అదే అతను చేసిన తప్పు అవుతుంది. రిక్టర్ ముఠా మైల్స్ ఇంటిపై దాడి చేస్తారు. అతన్ని స్పృహ తప్పేలా కొడతారు. మైల్స్ కళ్ళు తెరిచేసరికి ఒక భయంకరమైన సీన్ కనిపిస్తుంది. అతని రెండు చేతులకు రెండు స్మార్ట్ తుపాకులు బోల్టులతో బిగించబడి ఉంటాయి. చేతులు కత్తిరించకుండా తీయలేని విధంగా ఆ తుపాకులు అతని శరీరంలో భాగమైపోతాయి.

రిక్టర్ అతన్ని ‘స్కిజం’ గేమ్‌ లోకి నెట్టేసి, 24 గంటల్లో సైకో కిల్లర్ నిక్స్ ను చంపాలని ఛాలెంజ్ చేస్తాడు. ఆ టాస్క్ ఫినిష్ చేయకపోతే మైల్స్ చనిపోతాడు. ఇక్కడి నుండి సినిమాలో కామెడీతో పాటు యాక్షన్, సస్పెన్స్ తో కథ మలుపు తిరుగుతుంది. చేతులకు తుపాకులు ఉండటం వల్ల మైల్స్ సాధారణ పనులు కూడా చేయలేకపోతాడు. తలుపు తీయడం, ఫోన్ ఉపయోగించడం, ప్యాంట్ వేసుకోవడం… ప్రతి చిన్న పని అతనికి ఇబ్బందిగా మారుతుంది. ఇంతలో నిక్స్ అతన్ని వేటాడటం స్టార్ట్ చేస్తుంది.

Advertisement

నిక్స్ నిజానికి సైకో కిల్లరే. కానీ ఆమెకు కూడా ఒక పాస్ట్ ఉంటుంది. రిక్టర్ ఆమె ఫ్యామిలీని చంపి, చిన్నప్పటి నుండి ఆమెను ఈ గేమ్‌లోకి లాగాడనే విషయం తెలుస్తుంది. ఈ క్రమంలోనే మైల్స్ తన మాజీ ప్రేయసి నోవాను కాపాడుకోవాలని డిసైడ్ అవుతాడు. మరి తన ప్రియురాలిని హీరో ఎలా కాపాడుకున్నాడు ? ఆ కిల్లర్ నుంచి హీరో ఎలా తప్పించుకున్నాడు ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? అన్న విషయం తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే ?

2019లో విడుదలైన హాలీవుడ్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ‘గన్స్ అకింబో’. ఇప్పటికీ ఈ సినిమా మూవీ అభిమానులను అలరిస్తూనే ఉంది. డేనియల్ రాడ్‌క్లిఫ్ హ్యారీ పాటర్ ఇమేజ్‌ ను పూర్తిగా మార్చుకుని ఒక పిరికి, బ్రేవ్ యువకుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. ఈ సినిమా ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ లేకపోయినా, ఇంగ్లీష్ ఆడియోతో Amazon Prime Videoలో అద్దెకు, Lionsgate Play సబ్‌స్క్రిప్షన్ ద్వారా అందుబాటులో ఉంది.

Read Also: హైవేల పక్కన 14 మంది మహిళల శవాలు… వెన్నులో వణుకు పుట్టించే రియల్ మిస్టరీ థ్రిల్లర్

Related News

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

Big Stories

Advertisement
×