E-Paper
Advertisement

ఓటీటీలో ‘పెద్ది’ని తొక్కేస్తున్న చిన్న సినిమాలు… మెగా డిసప్పాయింట్మెంట్

ఓటీటీలో ‘పెద్ది’ని తొక్కేస్తున్న చిన్న సినిమాలు… మెగా డిసప్పాయింట్మెంట్
Advertisement

Peddi OTT: ఓటీటీలో మెగా ఫ్యాన్స్ కు పెద్ద దెబ్బే తగిలింది. రామ్ చరణ్ ‘పెద్ది’ థియేటర్ బ్లాక్‌బస్టర్ అయినా స్ట్రీమింగ్‌లో తడబడుతోంది. ఈ వారం స్ట్రీమింగ్ ప్రపంచం బిగ్గెస్ట్ సర్ప్రైజ్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల మార్కును దాటిన థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన Peddi. ఓటీటీలలోనూ రికార్డులు తిరగరాయడం ఖాయం అనే అంచనాలతో జూలై 9న Netflixలో విడుదలైంది. కానీ ఈ చిత్రం తొలినాళ్లలోనే అభిమానులకు మెగా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. వ్యూస్ పరంగా ఈ సినిమాను తొక్కేస్తున్న ఆ చిన్న సినిమాలు ఏంటి ? పెద్ది ఏ ప్లేస్ లో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 ఫిల్మ్స్ (నాన్-ఇంగ్లీష్)

మొదటి నాలుగు రోజుల్లో జూలై 6 నుంచి 12 వరకు ‘పెద్ది’ కేవలం 19 లక్షల వ్యూస్ మాత్రమే నమోదు చేసి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 ఫిల్మ్స్ చార్ట్ నాన్-ఇంగ్లీష్లో ఈ సినిమా ఐదవ స్థానంలో నిలిచింది. ఇంతటి భారీ చిత్రం వ్యూస్ పరంగా ఇలా నిరాశపరిచడాన్ని మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. హిందీ వెర్షన్ జాతీయ థియేటర్లలో పూర్తిస్థాయిలో విడుదల కాగా, ఎనిమిది వారాల థియేట్రికల్ విండోను పూర్తిచేసుకోక ముందే అది ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదు. హిందీ వెర్షన్ విడుదలయ్యాక వీక్షకుల సంఖ్య పెరుగుతుందేమో చూడాలి.

Advertisement

ఇప్పటికైతే ‘పెద్ది’ నాన్ ఇంగ్షీషు ప్రేక్షకులను ఆకర్షించలేక పోవడం గమనార్హం. ఈ ఎదురుదెబ్బకు తోడు, ‘పెద్ది’ చిత్రాన్ని వ్యూస్ పరంగా చిన్న చిత్రాలు అధిగమించడం విశేషం. సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా నటించిన కోర్ట్‌రూమ్ డ్రామా Ikka జూలై 10న విడుదలై, మూడు రోజుల్లోనే 4.4 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానాన్ని దక్కించుకుని, నెట్ ఫ్లిక్స్ ఇండియాలో నెం. 1 చిత్రంగా నిలిచింది.

మరోవైపు జూన్ 25న విడుదలైన చిన్న చిత్రం ‘బ్లాస్ట్’, మొదటి వీకెండ్ లోనే 4.4 మిలియన్ల వ్యూస్ తో 8వ స్థానంలో కొనసాగుతోంది. Peddi విషయానికి వస్తే… హిందీ వెర్షన్ లేకపోవడం వ్యూస్ పరంగా భారీ మూల్యం చెల్లించేలా చేసిందని అంటున్నారు మూవీ విశ్లేషకులు, మరి అది విడుదలైన తర్వాత కోలుకోగలదా లేదా అనేది వేచి చూడాలి. ఈ వారం నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 5 ఫిల్మ్స్ నాన్-ఇంగ్లీష్ సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం పదండి.

Advertisement

Nothing to Lose – 65 లక్షల వ్యూస్
Ikka – 44 లక్షల వ్యూస్
Wonderful Nightmare – 22 లక్షల వ్యూస్
Daadi Ki Shaadi – 21 లక్షల వ్యూస్
Peddi – 19 లక్షల వ్యూస్

Tags

Related News

ఓటీటీలోకి వచ్చేస్తున్న కొరియన్ కనకరాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

మోగ్లీని రక్షించడానికి వచ్చిన విచిత్ర మృగం… కట్ చేస్తే 20 ఏళ్ల సీక్రెట్ బట్టబయలు… తెలుగులోనే స్ట్రీమింగ్

మొగుడు పెళ్లాల మధ్యలోకి వచ్చి ముంచేశాడు… క్లైమాక్స్‌లో ఊహించని డ్రామా… తెలుగులో ఇంగ్లీష్ సిరీస్

మహిళల ఇళ్లకు వచ్చే విచిత్రమైన బాక్సులు… కట్ చేస్తే వరుస హత్యలు… ప్రతి కేసు వెనుక ఒకే మైండ్

మ్యాచ్ ఆడుతుంటే స్టేడియంలో పదే పదే వినిపించే సీక్రెట్ విజిల్… శబ్దంతో కోచ్ కొంపముంచిన లేడీ

రాత్రికి రాత్రే రాక్ స్టార్ శవంగా… తీరా శవం దగ్గరకు వెళ్తే ఊహించని షాక్… డార్క్ హారర్ థ్రిల్లర్

కూతురి సీక్రెట్ డైరీతో స్టేజ్‌పై జోకులు… నిజం తెలిసి నిలదీసిన కూతురికి షాకింగ్ ట్విస్ట్… తెలుగులోనే ఈ సిరీస్

Big Stories

Advertisement
×