BigTV English

OTT Movie : సచ్చినోళ్ళు మళ్ళీ బ్రతికొచ్చి ఊరంతా వల్లకాడైతే… వణికించే జాంబీ మూవీ

OTT Movie : సచ్చినోళ్ళు మళ్ళీ బ్రతికొచ్చి ఊరంతా వల్లకాడైతే… వణికించే జాంబీ మూవీ
Advertisement

OTT Movie : థియేటర్లలో ఎటువంటి సినిమాలు వచ్చినా, ఓటీటీలోకి కొద్ది రోజుల్లోనే వచ్చేస్తున్నాయి. భాషతో ప్రమేయం లేకుండా నచ్చిన సినిమాలను, దొరికిన సమయంలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. వీటిలో జాంబి సినిమాలను ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. కంటెంట్ బాగుంటే ఈ సినిమాలు మంచి విజయాలను కూడా అందుకుంటున్నాయి. తెలుగులో వచ్చిన జాంబిరెడ్డి సినిమా అందుకు నిదర్శనం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ హాలీవుడ్ నుంచి వచ్చింది. కామెడీ కంటెంట్తో తెరకెక్కిన ఈ సినిమా బీభత్సం బాగానే సృష్టించింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే


స్టోరీలోకి వెళితే

అమెరికాలో సెంటర్‌విల్లే అనే ఒక ప్రశాంతమైన పట్టణం ఉంటుంది. ఇక్కడ పోలీస్ చీఫ్ క్లిఫ్ అందరికీ ఇంచార్జ్ గా ఉంటాడు. అతని సహచర అధికారులు రానీ పీటర్‌సన్, మిన్డీ మోరిసన్ రోజువారీ సాధారణ విషయాలను చూసుకుంటారు. అయితే ఒకరోజు హఠాత్తుగా భూమి ధ్రువాలు మారడం వల్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల రోజుల సమయం మారిపోతుంది. జంతువులు వింతగా ప్రవర్తిస్తాయి.చనిపోయినవాళ్ళు, సమాధుల నుండి లేచి జాంబీలుగా మారతారు. ఈ జాంబీలు తమ జీవితంలో ఇష్టపడిన వాటి వైపు వెళ్తుంటారు. ఉదాహరణకు, కాఫీ, వైన్, Wi-Fi కోసం అల్లాడుతూ ఉంటారు. మరొవైపు క్లిఫ్, రానీ, మిన్డీ ఈ జాంబీలను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. కానీ పరిస్థితి వాళ్ళ నియంత్రణలో లేదని త్వరగా తెలుస్తుంది.


అదే సమయంలో జెల్డా విన్‌స్టన్ అనే వింతైన మనిషి కత్తితో జాంబీలను చంపుతూ ఉంటుంది. రానీ, పీటర్‌సన్ వీటిని ఎదుర్కునేటప్పుడు వచ్చే సన్నివేశాలు హాస్యం తెప్పించే విధంగా ఉంటాయి. ఇక జాంబిల తాకిడి ఎక్కువ అవుతుంది. ఇవి చేసే దాడులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. చివరికి ఈ జాంబీలు మనుషుల్ని అంతం చేస్తాయా ? వీటిని మనుషులు ఎలా ఎదుర్కుంటారు ? కత్తితో జాంబీలను చంపుతున్న మనిషి ఎవరు ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ జాంబీ కామెడీ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : ప్రేమ ప్రేమా అంటూ అందరూ కరువులోనే… ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో … ఇది లవ్ బర్డ్స్‌కి ఎక్స్ట్రా స్టఫ్

జీ 5 (Zee5) లో

ఈ జాంబీ కామెడీ మూవీ పేరు ‘ది డెడ్ డోంట్ డై’ (The Dead Don’t Die). 2019 లో వచ్చిన ఈ సినిమాకి జిమ్ జార్ముష్ దర్శకత్వం వహించారు. ఇందులో బిల్ మర్రే, ఆడమ్ డ్రైవర్, క్లోయ్ సెవిగ్నీ, స్టీవ్ బుస్సెమి, టిల్డా స్వింటన్ వంటి నటీనటులు ఉన్నారు. ఈ సినిమా స్టోరీ ఒక చిన్న పట్టణంలో జాంబీలు సృష్టించే విధ్వంసం చుట్టూ తిరుగుతుంది. జీ 5 (Zee5) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : డివోర్స్‌డ్ సేల్స్ మ్యాన్‌కు దిమ్మతిరిగే ట్విస్ట్… జైల్లో భార్య ప్రియుడితో… క్లైమాక్స్ హైలెట్

OTT Movie : మార్చురీలో వరుస మర్డర్స్… 30 ఏళ్ల తరువాత మళ్ళీ మొదలుపెట్టే సీరియల్ కిల్లర్… నరాలు కట్టయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఆడపిల్లలే టార్గెట్… అమ్మాయి కాదు కాటేరమ్మ… సింగిల్ మదరా మజాకా

OTT Movie : లవ్, లస్ట్ డెడ్లీ డెత్ గేమ్‌గా మారితే… ఇలాంటి థ్రిల్లర్ ను ఇప్పటిదాకా చూసుండరు భయ్యా

OTT Movie : ఒకే గదిలో భర్త, ప్రియుడు… మంచం కిందనే అన్ని సీన్లు… ఇదో కొత్త ట్రయాంగిల్

OTT Movie : కళ్ళముందే తల్లిదండ్రుల ఊచకోత… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… ఈగోను శాటిస్ఫై చేసే రివేంజ్ డ్రామా

OTT Movie : వేశ్యతో అలాంటి పని.. కూతురు పుట్టాక ఎస్కేప్… ఈ సిరీస్ లో ఒక్కో సీన్ మెంటల్ మాస్ మావా

OTT Movie : మాంసం కొట్టు యజమాని మర్డర్… ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ కన్నడ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

Big Stories

×