OTT Movie : కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక థ్రిల్లర్ సినిమా ఓటీటీలో ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా థియేటర్లలో నిరాశపరచింది. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో జరిగిన సంఘటన ఆధారంగా, ఈ కన్నడ సినిమా తెరకెక్కింది. భర్యాభర్తల మధ్యలో మరొకరు లాక్‌డౌన్ సమయంలో చిక్కుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. మామూలుగా మొదలయ్యే ఈ కథ, నడిచే కొద్దీ థ్రిల్లర్ వైబ్ ని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘టెనెంట్’ (Tenant) 2024లో వచ్చిన కన్నడ థ్రిల్లర్ సినిమా. శ్రీధర్ శాస్త్రి దర్శకత్వంలో రాకేష్ మైయా, సోను గౌడా, కీర్తిరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 నవంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడ, తెలుగు సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉంది.
బెంగళూరులో కమలేష్, దమిని అనే జంట ఒక చిన్న ఇంట్లో జీవిస్తుంటారు. వాళ్లు ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. కోవిడ్ వల్ల లాక్‌డౌన్ విధించడంతో వాళ్ల కష్టాలు మరింత పెరుగుతాయి. వాళ్ల ఇంట్లో ఒక చిన్న గదిలో ఒక వ్యక్తి అద్దెకు ఉంటాడు. అయితే ఇప్పుడు కోవిడ్ వల్ల, అతను కూడా రెంట్ చెల్లించడం మానేస్తాడు. దీంతో కమలేష్, దమిని అతనితో గొడవపడతారు. కానీ లాక్‌డౌన్ వల్ల అతన్ని బయటకు పంపలేరు. ఈ సమయంలో టెనెంట్ వాళ్లతో స్నేహంగా మాట్లాడటం మొదలెడతాడు, దమిని అతనితో కొంచెం క్లోజ్ అవుతుంది. కమలేష్‌కు ఈ విషయం నచ్చదు. అతనికి టెనెంట్‌పై డౌట్ వస్తుంది.
Read Also : రాత్రికి రాత్రే యవ్వనంగా మారిపోయే భార్య… ఒక్క సిప్ తో అమరత్వం ఇచ్చే అమృతం… భర్తకు దబిడి దిబిడే