NED Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లోని డిప్యూటేషన్, షార్ట్ టర్మ్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆంధ్రప్రదేశ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NED) నుంచి డిప్యూటేషన్, షార్ట్ టర్మ్, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. జూన్ 5 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 21
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సీనియర్ డిజైనర్, అసోసియేట్ సీనియర్ డిజైనర్, ప్రిన్సిపల్ టెక్నికల్ ఇన్ స్ట్రక్టర్, సీనియర్ టెక్నికల్ ఇన్ స్ట్రక్టర్, ఫ్యాకల్టీ, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – ఖాళీలు
రిజిస్ట్రార్: 01
కంట్రోలర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్: 01
సీనియర్ డిజైనర్: 06
అసోసియేట్ సీనియర్ డిజైనర్: 03
ప్రిన్సిపల్ టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్: 02
సీనియర్ టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్: 01
ఫ్యాకల్టీ: 05
సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్: 01
సీనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్- 01
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ, పీజీ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తకు చివరి తేది: జూన్ 5
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nid.edu
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం వెకెన్సీల సంఖ్య: 21
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 5