BigTV English

OTT Movie : ఒకే గదిలో భర్త, ప్రియుడు… మంచం కిందనే అన్ని సీన్లు… ఇదో కొత్త ట్రయాంగిల్

OTT Movie : ఒకే గదిలో భర్త, ప్రియుడు… మంచం కిందనే అన్ని సీన్లు… ఇదో కొత్త ట్రయాంగిల్
Advertisement

OTT Movie : ప్రంపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్న సినిమాలు, ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. థియేటర్లలోకి రావడమే ఆలస్యం, వారం రోజుల్లోనే ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. కంటెంట్ ఉన్న అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే జపాన్ థ్రిల్లర్ సినిమా, డిఫరెంట్ స్టోరీతో వచ్చింది. హీరో తన చిన్ననాటి స్నేహితురాలిని, ఆమె భర్త నుంచి సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆమె ఇంట్లోనే బెడ్ కింద దూరి ఆమెను గమనిస్తుంటాడు. ఆ ఇంట్లో దారుణమైన సంఘటనలు ఉంటాయి. ఈ సినిమాను ఒంటరిగా చూడటమే మంచిది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌

‘అండర్ యువర్ బెడ్’ (Under your Bed) ఒక జపాన్ సైకలజికల్ థ్రిల్లర్ సినిమా. మారీ అసాటో దర్శకత్వంలో కెంగో కోరా, కానాకో నిషికావా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2019 జూలై 19న జపాన్‌లో రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. IMDb లో 6.0/10 రేటింగ్ తో ఉంది.

కథ ఏమిటంటే

హీరో చిన్నప్పటి నుంచి లోన్లీగా ఫీల్ అవుతుంటాడు. అతను చదువుకునేటప్పుడు కూడా స్కూల్‌లో చాలా ఒంటరిగా ఉండేవాడు. అందరూ అతన్ని దూరం పెట్టే వాళ్ళు. అతనికి స్నేహితులు కూడా లేరు. ఆ సమయంలో హీరోయిన్ అతనితో మంచిగా మాట్లాడుతుంది. ఆ ఒక్క సంఘటనతో హీరో ఆమెను ఎప్పటికీ మర్చిపోలేక పోతాడు. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోతుంది. పది సంవత్సరాల తర్వాత, హీరో ఆమెను వెతకడం మొదలెడతాడు. అతను ఒక డిటెక్టివ్‌ సహాయంతో ఆమె గురించి తెలుసుకుంటాడు. ఆమెకు ఇప్పుడు పెళ్లై, ఒక కొడుకుతో హౌస్‌వైఫ్‌గా ఉంటుంది. అయితే ఆమె భర్త చాలా శాడిస్ట్. ఆమెను ఎప్పుడూ హింసిస్తుంటాడు.


Read Also : మేనమామ చావుకు రివేంజ్… ఓటీటీని షేక్ చేస్తున్న కొరియన్ సిరీస్… యాక్షన్ ప్రియులకు పండగే

హీరో ఆమెను రహస్యంగా గమనిస్తాడు. చేపలు అమ్మే వాడిలా ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఆమె ఇంట్లోకి రహస్యంగా వెళ్లి, ఆమె బెడ్ కింద దాక్కుంటాడు. అక్కడి నుంచి ఆమె బాధలను దగ్గరగా చూస్తాడు. అనుకున్న దాని కంటే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఆమె భర్త రాత్రి పూట ఫిజికల్ గా దారుణంగా వేధిస్తుంటాడు. చేయకూడని పనులు చేపిస్తుంటాడు. ఈ దారుణాలను చూసి, హీరో ఆమెను కాపాడాలని అనుకుంటాడు. చివరికి ఒక షాకింగ్ ట్విస్ట్ తో స్టోరీ ముగుస్తుంది. ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? హీరోయిన్ ను, ఆమె భర్త ఎలా వేధిస్తుంటాడు ? హీరోయిన్ ని హీరో కాపాడతాడా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movie : డివోర్స్‌డ్ సేల్స్ మ్యాన్‌కు దిమ్మతిరిగే ట్విస్ట్… జైల్లో భార్య ప్రియుడితో… క్లైమాక్స్ హైలెట్

OTT Movie : మార్చురీలో వరుస మర్డర్స్… 30 ఏళ్ల తరువాత మళ్ళీ మొదలుపెట్టే సీరియల్ కిల్లర్… నరాలు కట్టయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఆడపిల్లలే టార్గెట్… అమ్మాయి కాదు కాటేరమ్మ… సింగిల్ మదరా మజాకా

OTT Movie : లవ్, లస్ట్ డెడ్లీ డెత్ గేమ్‌గా మారితే… ఇలాంటి థ్రిల్లర్ ను ఇప్పటిదాకా చూసుండరు భయ్యా

OTT Movie : కళ్ళముందే తల్లిదండ్రుల ఊచకోత… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… ఈగోను శాటిస్ఫై చేసే రివేంజ్ డ్రామా

OTT Movie : వేశ్యతో అలాంటి పని.. కూతురు పుట్టాక ఎస్కేప్… ఈ సిరీస్ లో ఒక్కో సీన్ మెంటల్ మాస్ మావా

OTT Movie : మాంసం కొట్టు యజమాని మర్డర్… ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ కన్నడ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

Big Stories

×