BigTV English

OTT Movie : కళ్ళముందే తల్లిదండ్రుల ఊచకోత… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… ఈగోను శాటిస్ఫై చేసే రివేంజ్ డ్రామా

OTT Movie : కళ్ళముందే తల్లిదండ్రుల ఊచకోత… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… ఈగోను శాటిస్ఫై చేసే రివేంజ్ డ్రామా
Advertisement

OTT Movie : కౌ బాయ్ గెటప్ అంటే యూత్ చెవి కోసుకుంటారు. నిజం చెప్పాలంటే చాలా మందికి ఆ గెటప్ లో ఒక్క ఫోటో అయినా
దిగాలనుకుంటారు. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ ఈ గెటప్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా కౌ బాయ్ గెటప్ లోనే ఎక్కువగా జరుగుతుంది. ఇందులో రెండు గ్యాంగ్ ల మధ్య జరిగే యాక్షన్ సీన్స్ కి ఆడియన్స్ విజిల్ కూడా వేస్తారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ 

‘ది హార్డర్ దే ఫాల్’ (The harder they fall) ఒక అమెరికన్ యాక్షన్ సినిమా. జేమ్స్ సామ్యూల్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో జోనథన్ మేజర్స్, ఇద్రిస్ ఎల్బా, జాజీ బీట్స్, రెజీనా కింగ్, ఎడి గాథెగి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021 అక్టోబర్ 22న థియేటర్లలో విడుదలైంది. 2021 నవంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉంది. IMDbలో దీనికి 6.6/10 రేటింగ్ ఉంది.

కథలోకి వెళ్తే

హీరో చిన్నగా ఉన్నప్పుడు, రూఫస్ బక్ అనే విలన్ తన తల్లిదండ్రులను దారుణంగా చంపుతాడు. ఇప్పుడు హీరో యువకుడిగా ఉంటాడు. అంతేకాదు ఇప్పుడిప్పుడే ఒక గ్యాంగ్ స్టర్ గా కూడా ఎదుగుతుంటాడు. అయితే తన తల్లిదండ్రులను చంపిన రూఫస్‌పై ప్రతీకారంతో రగిలి పోతుంటాడు. ఒక రోజు రూఫస్ జైలు నుంచి బయటకు వస్తాడని తెలిసి, హీరో తన గ్యాంగ్‌ తో అతన్ని చంపడానికి ప్లాన్ వేస్తాడు. ఈ గ్యాంగ్ లో మేరీ అనే అతని మాజీ ప్రియురాలు కూడా ఉంటుంది. ఇక ఈ రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలు మొదలవుతాయి.


Read Also : మేనమామ చావుకు రివేంజ్… ఓటీటీని షేక్ చేస్తున్న కొరియన్ సిరీస్… యాక్షన్ ప్రియులకు పండగే

హీరో రూఫస్‌ను వెతుకుతూ వెళ్తాడు. ఒక చర్చిలో భీకరమైన ఫైట్ జరుగుతుంది. ఈ సమయంలో హీరోకి, మేరీ మధ్య పాత ప్రేమ మళ్లీ మొదలవుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో తన తల్లిదండ్రులను రూఫస్ ఎందుకు చంపాడో కూడా తెలుస్తుంది. ఇక క్లైమాక్స్ లో హీరో గ్యాంగ్, రూఫస్ గ్యాంగ్ మధ్య పెద్ద గన్‌ ఫైట్ జరుగుతుంది. ఇక్కడ యాక్షన్ సీన్స్ భయంకరంగా ఉంటాయి. ఈ ఫైట్ లో హీరో తన తల్లిదండ్రుల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడా ? రూఫస్ ఎందుకు హీరో తల్లిదండ్రులను చంపాడు ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ యాక్షన్ సినిమాని మిస్ కాకుండా చూడండి.

 

Related News

OTT Movie : వేశ్యతో అలాంటి పని.. కూతురు పుట్టాక ఎస్కేప్… ఈ సిరీస్ లో ఒక్కో సీన్ మెంటల్ మాస్ మావా

OTT Movie : మాంసం కొట్టు యజమాని మర్డర్… ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ కన్నడ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

Netflix Upcoming Movies : నెట్ ఫ్లిక్స్‌లో సినిమాల జాతర… 6 సినిమాలు ఒకే రోజు… డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్

OTT Movie : చెరువులో మనిషి పుర్రె… మర్డర్ మిస్టరీలో మతిపోగోట్టే ట్విస్టులు… టెన్షన్ పెట్టే ఇంటెన్స్ మలయాళ థ్రిల్లర్

Jr.NTR Dragon OTT : ఓటీటీ లవర్స్‌కు షాక్ ఇచ్చిన ఎన్టీఆర్… డ్రాగన్‌తో అంత ఈజీ కాదు

Akhanda 2 OTT: అఖండ 2 ఓటీటీ డీల్ క్లోజ్.. ఓటీటీ స్ట్రీమింగ్ కూడా అప్పుడేనా?

OG: ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న ఓజీ .. ఎప్పుడు? ఎక్కడంటే?

Big Stories

×