BigTV English
Advertisement

OTT Movie : ప్రేమించి మోసం చేస్తే దయ్యమై కూర్చుంది.. వచ్చిన వాళ్ళని వచ్చినట్టే వేసుకుంటూ పోతోంది

OTT Movie : ప్రేమించి మోసం చేస్తే దయ్యమై కూర్చుంది.. వచ్చిన వాళ్ళని వచ్చినట్టే వేసుకుంటూ పోతోంది

OTT Movie : ఇండోనేషియన్ దర్శకులు హారర్ సినిమాలను తీయడంలో ఒక అడుగు ముందే ఉంటారు. చేతబడి, దయ్యాల కథలతో ప్రేక్షకులను బాగానే భయ పెడతారు. ప్రతి మనిషికి ఒక స్టోరీ ఉన్నట్టు, దయ్యాలకు కూడా కొన్ని స్టోరీలు ఉంటాయి. మరి ఈ స్టోరీలో ఉన్న దయ్యానికి ఏ కోరిక తీరలేదో గాని మనుషులపై పగ పెంచుకుంది. మూడు ఫ్లోర్లు ఉన్న హోటల్లో, థర్డ్ ఫ్లోర్ లోకి వచ్చిన వాళ్లను చంపుతూ ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది హాంటెడ్ హౌస్’ (The Haunted Hotel).  ఇద్దరు అక్కా, చెల్లెళ్ళు సెమరాంగ్‌కు వెళ్ళి ఒక రహస్యమైన హోటల్‌ను నిర్వహించడానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అక్కడ వారు ఒక చీకటి రహస్యాన్ని, ఘోరమైన శాపాన్ని ఎదుర్కొంటారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఇండోనేషియాలో ఒక పెద్ద హోటల్ రన్ అవుతూ ఉంటుంది. ఆ హోటల్ కి పని చేయడానికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ హోటల్ ని నడిపే మహిళ థర్డ్ ఫ్లోర్ లోకి వెళ్ళవద్దని చెప్తుంది. అయితే ఆ అమ్మాయి అదేమీ పట్టించుకోకుండా అక్కడికి వెళుతుంది. అందులో ఒక దయ్యం ఉంటుంది. నీకు మూడున్నర రోజు మాత్రమే ఉంది అంటూ చెప్తుంది. అన్నట్టుగానే మూడున్నర రోజుల్లోనే ఆ అమ్మాయిని ఆ దయ్యం చంపేస్తుంది. ఆ తర్వాత ఆ హోటల్ కి ఇద్దరు అక్క, చెల్లెలు వస్తారు. వాళ్లు ఆ హోటల్ ఓనర్ కూతుర్లు. అయితే థర్డ్ ఫ్లోర్ విషయం వాళ్లకు తెలిసి ఉండదు. అక్కడ ఉన్న వీళ్ళ నానమ్మ, ఆ విషయం మాకు కూడా అంతగా తెలియదని చెప్తారు. థర్డ్ ఫ్లోర్లో వస్తున్న కస్టమర్లు చనిపోతుండటంతో అక్కడ రాకపోకలు నిషేధం విధించామని చెప్తారు. అయితే వీళ్ళు కూడా ఆ గదిలోకి వెళ్లి దయ్యంతో వార్నింగ్ ఇప్పించుకుని వస్తారు. ఇక మూడున్నర రోజులే అని దయ్యం చెప్పిందని వీళ్ళు భయపడతారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటారు.

ఆ గదిలోనే ఒక లెటర్ చినిగిపోయి ఉంటుంది. దేనికి ఎవరో రాసిన లవ్ లెటర్ గా ఉంటుంది. ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్లి ఈ విషయం అంతా చెప్తారు. ఆ మంత్రగాడు ఆ దయ్యం దగ్గరికి వచ్చి విషయం కనుక్కుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో ఆ దయ్యాన్ని ఒక వ్యక్తి ప్రేమిస్తాడు. ఆమెకు బొల్లి ఉండటంతో, అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. చివరికి ఆ వ్యక్తి కూడా ఆ అమ్మాయిని మోసం చేస్తాడు. అలా మూడున్నర రోజు తనను తాను హింసించుకుని చనిపోతుంది. ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళను మూడున్నర రోజు సమయం ఇచ్చి  చంపుతూ ఉంటుంది. చివరికి అక్కా, చెల్లెళ్ళను కూడా చంపుతుందా? మంత్రగాడు ఆ దయ్యాన్ని బంధిస్తాడా? ఆమెను మోసం చేసిన వ్యక్తి ఎవరు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘ది హాంటెడ్ హౌస్’ (The Haunted House) అనే ఈ మూవీని చూడండి.

Related News

OTT Movie : అనామకుల పక్కన పడుకుంటేగానీ నిద్ర పట్టని విడ్డూరం… ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి భయ్యా

OTT Movie : ఇంటికొచ్చిన అబ్బాయిని టెంప్ట్ చేసి ఆ పని… కనక వర్షం కోసం మైండ్ బెండింగ్ క్రైమ్ ప్లాన్

OTT Movie : బ్లడీ బ్లడ్ గేమ్… చావు లేదా బతుకు రెండే ఆప్షన్స్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్

OTT Movie : ఇదేందయ్యా ఇదీ… సినిమా కోసం సీరియల్ కిల్లర్ తో… నెక్స్ట్ గుండె బద్దలయ్యే ట్విస్ట్

OTT Movie : భార్యనే ఛీటింగ్ చేసే భర్త… ఒకే ఒక్క బుక్ తో ఆమె ఇచ్చే ట్విస్ట్ కు దిమాక్ కరాబ్

OTT Movie : 100 గంటలు… టీనేజర్ ను కిడ్నాప్ చేసి లైవ్ లోనే ఆ పాడు పని… మెంటలెక్కించే రియల్ క్రైమ్ స్టోరీ

OTT Movie : లైఫ్ లోనే ఫస్ట్ డేట్… కట్ చేస్తే దెయ్యంగా మారే అబ్బాయి… అదిరిపోయే హర్రర్ కామెడీ మూవీ

OTT Movie : తల్లికొడుకులపై పగ తీర్చుకునే దుప్పి… జంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి మావా

Big Stories

×