Mazaka Collections : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మజాకా’.. ప్రముఖ నిర్మాణ సంస్థలు AK ఎంటర్‌టైన్‌మెంట్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండ, అనీల్ సుంకర, ఉమేష్ భన్సాల్ నిర్మించారు. శివరాత్రి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ థియేటర్ల వద్ద పర్వాలేదనే టాక్ ను అందుకుంది. శివరాత్రి కావడంతో ఈ మూవీకి ప్లస్ అయ్యింది. మొదటి రోజు పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం సుమారుగా 20 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడాలి..
ధమాకా లాంటి భారీ హిట్ తర్వాత నక్కిన త్రినాథ్ రావు సినిమా రావడం, అలాగే ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంతో ఈ సినిమాపై ఓ మాదిరి అంచనాలు నెలకొన్నాయి.. సందీప్ కిషన్ ఖాతాలో హిట్ మూవీ పడుతుందని అనుకున్నారు. ఆంధ్రా, నైజాం హక్కులు 9 కోట్ల రూపాయల మేర, ఓవర్సీస్ రైట్స్ 1 కోటి రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 50 లక్షల మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌గా వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా బిజినెస్ 10.5 కోట్లు కాగా, బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు రాబట్టాలి గతంలో సందీప్ కిషన్ మూవీకి ఇది పెద్ద టార్గెట్ అనే చెప్పాలి. మరి రెండు రోజులకు ఎంత వసూల్ చేసిందో ఒకసారి చూసేద్దాం..
సందీప్ కిషన్ మజాకా రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 1.5 కోట్లు, ఇతర ప్రాంతాల్లో 50 లక్షల నెట్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 40 లక్షల రూపాయలు నెట్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం ఓవరాల్‌గా 3 కోట్ల వసూల్ చేసిందని తెలుస్తుంది.. రెండో రోజు కూడా కలెక్షన్స్ తగ్గలేదు. కాస్త డౌన్ అయినా కూడా భారీగానే వసూల్ చేసింది. రెండు కోట్ల వరకు వచ్చాయని తెలుస్తుంది. మరి 12 కోట్లు రాబడుతుందేమో చూడాలి.. ఇకపోతే.. ఎడిటర్‌గా చోటా కే ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్‌గా లియోన్ జేమ్స్, సినిమాటోగ్రాఫర్‌గా నిజార్ షఫీ తదితరులు సాంకేతిక నిపుణులుగా పనిచేశారు. మురళీ శర్మ, శ్రీనివాసరెడ్డి తదితర ఆర్టిస్టులు కీలక పాత్రల్లో నటించారు..
Also Read : ‘డాకు మహారాజ్ ‘ డిజాస్టర్ మూవీ… రెస్పాండ్ అయిన నాగ వంశీ..
గతంలో వచ్చిన భైరవ కోన మూవీ సందీప్ కిషన్ కు మంచి పేరును అందించింది. ఆ మూవీలోని పాటలు ఇప్పటికి వినిపిస్తున్నాయి. అయితే సందీప్ కు ఇంకా బ్రేక్ ఈవెన్ సినిమా మాత్రం పడలేదు. మరి విభిన్న కథతో వచ్చిన ఈ మజాకా మూవీ ఎలాంటి కలెక్షన్స్ ను రాబడుతుందో చూడాలి.. సందీప్ కిషన్, రావు రమేష్, రీతూ వర్మ, అన్షు జంటలుగా నటించారు. కామెడీ మూవీ కావడంతో పాటుగా ఈ వారం చెప్పుకొనే సినిమాలు లేవు. దాంతో వీకెండ్ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.