OTT Movie: ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు మరో లోకం లోకి తీసుకెళ్తాయి. ఈ సినిమాలు ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక యువరాణి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో సేనాపతి గా వ్యవహరించే ఒక వ్యక్తి, రాణి ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోగా, మూడు చెరువుల నీళ్లు కూడా తాగిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో
ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది ప్రిన్సెస్’ (The Princess).2022 లో వచ్చిన ఈ యాక్షన్ ఫాంటసీ మూవీకి లెవాన్ అకిన్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా ఒక యుద్ధ వీరురాలైన ప్రిన్సెస్ చుట్టూ తిరుగుతుంది. ఆమె తన రాజ్యాన్ని, తనను తాను ఒక శత్రువు నుండి కాపాడుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఒక యువ రాకుమారి తన ఇష్టానికి వ్యతిరేకంగా, ఒక క్రూరమైన సైనిక నాయకుడైన జూలియస్ తో వివాహం చేసుకోవడానికి ఒప్పించబడుతుంది. ఈ వివాహం ఆమె రాజ్యాన్ని బలపరచడానికి ఒక రాజకీయ ఒప్పందంగా ఉద్దేశించబడింది. అయితే రాకుమారి ఈ వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరిస్తుంది. దీంతో జూలియస్ కోపంతో ఆమెను ఒక ఎత్తైన టవర్‌లో బంధిస్తాడు. ఆమె మీద కోపంతో రాజ్యంపై దాడి కూడా చేస్తాడు. అక్కడ నుండి, రాకుమారి తన శిక్షణ పొందిన యుద్ధ నైపుణ్యాలను ఉపయోగించి, టవర్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది ? తన కుటుంబాన్ని, రాజ్యాన్ని కాపాడటానికి పోరాడుతుంది. ఆమె ఒంటరిగా శత్రువుల సైన్యంతో తలపడుతూ, తన ధైర్యం తెలివితేటలతో అనేక అడ్డంకులను అధిగమిస్తుంది. ఈ ప్రయాణంలో ఆమెకు సహాయం చేసే వారు కూడా కొందరు ఉంటారు, కానీ ప్రధానంగా ఆమె ఒక్కటే ఎక్కువగా పోరాటం చేస్తూ ఉంటుంది. రాకుమారి ఒక ధైర్యవంతమైన నైపుణ్యం గల యోధురాలు. జూలియస్ ఒక కపటమైన, అధికార దాహంతో ఉన్న విలన్. వీళ్లిద్దరి మధ్య స్టోరీ రసవత్తరంగా సాగిపోతుంది. ఈ సినిమా రాజకుమారిని ఒక శక్తివంతమైన యోధురాలిగా చూపిస్తూ, వినోదభరితమైన యాక్షన్ అనుభవాన్ని అందిస్తుంది. చివరికి రాకుమారి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది ప్రిన్సెస్’ (The Princess) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.