Gundeninda GudiGantalu Today episode march 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. శృతి వీడియోను అడ్డుపెట్టుకొని చంద్రకాంతని దగ్గరుండి ఫంక్షన్ చేసేలా చేస్తుంది. అటు నీలకంఠం సంజయ్ సడన్ గా అక్కకి ఏమైందని ఆలోచిస్తూ ఉంటారు. చంద్రకాంతం ప్రవర్తన చూసి సంజయ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక తప్పక ఆమె చెప్పినట్టు విని అక్కడినుంచి మెల్లగా జారుకుంటాడు. పదండి త్వరగా వెళ్ళిపోదామని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మా మౌనికను ఏడిపిస్తే మాత్రం మామూలుగా ఉండదు అని అంటే దానికి చంద్రకాంతం అయ్యో అలా ఎందుకు అవుతుంది నేను ఉంటాను కదా దగ్గరుండి చూసుకుంటానని అంటుంది. ప్రభావతి ఫ్యామిలీ మాత్రం ఈమెలో ఇంత మార్పు ఎలా వచ్చిందని ఆలోచిస్తూ ఉంటారు. వచ్చినప్పటి నుంచి గయ్యాలి లాగా అలా అరుస్తూ ఉన్నది ఇప్పుడు ఏమైందో తెలియలేదే ఇంత సైలెంట్ గా ఇంత బుద్ధిగా మారిపోయింది అనేసి అనుకుంటూ ఉంటారు. మౌనిక నువ్వు దగ్గరుండి అందరూ సాగనంపుతారు. ప్రభావతి మీనాకు క్లాస్ పీకుతుంటే శృతి వచ్చి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. శృతి చెప్పినా కూడా ప్రభావతి తగ్గదు. అదే నాకు ఇచ్చింటే ఇలాంటి జరిగేది కాదు అని అంటుంది. మీ భార్యాభర్తల వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. తాళి జాగ్రత్తగా పెట్టమని చెప్పాను మనకిస్తే కదా. తన భర్తే ఇదంతా చేస్తున్నాడని తెలిసేలా తన దగ్గరే పెట్టుకుంది అని ప్రభావతి అంటుంది. ఇక తనముందే మీనా పుస్తెలు తాడు ఎక్కడుందో చెప్పింది కదా. కావాలనే సాంబార్ పోసుకుని బట్టలు మార్చుకుందామని వెళ్లి గోల్డ్ తీసుకెళ్లి కారులో పెట్టింది అని శ్రుతి అంటుంది. అమ్మో.. అదే తీసి అదే ఇంత గొడవ చేసిందా అని ప్రభావతికి ఫీజులు ఎగిరిపోతాయి. చూశావా అనవసరంగా మీనాను అన్నావ్ అని సత్యం అంటాడు. దాంతో ప్రభావతి, మీనా ఒకరినొకరు చూసుకుంటారు..
ప్రభావతి మాటలకు మీనా షాక్ అవుతుంది.. ఏదైనా జరిగితే అవడానికి, పడటానికి నేనొకదాన్ని ఉన్నాను కదా అనేసి మీనా అంటూ బాధ పడుతుంది. అంతా జరిగిపోయింది కదా ఇక గొడవలు అనవసరం వెళ్లి ఎవరి పనులు వాళ్లు చూసుకోండి అని సత్యం అంటాడు. అందరు వెళ్లి పోతారు. రాత్రి మళ్లీ బాలు అందరికి షాకిస్తాడు. తర్వాత ఇంట్లో అందరిని బాలు పిలుస్తాడు. వీడు మళ్లేదో చేసేనట్లున్నాడు అని ప్రభావతి అనుకుంటుంది. షీలా డార్లింగ్ పండగకు అందరిని కట్టకట్టుకుని అక్కడికు తీసుకురమ్మంటుంది అని బాలు అంటాడు. అందరం వెళ్దాం, సరదాగా ఉంటుందని అనుకుంటారు. ఏమంటారు అని సత్యం అడుగుతాడు. నాకు వీలు కాదు నాన్న అని మనోజ్ చెబుతాడు. అవును, పార్క్ బోసి పోతుంది అని బాలు కౌంటర్ వేస్తాడు..
ఆ మాట అనగానే రోహిణి బాలు పై అరుస్తుంది. ఏది జరిగిన అదే ఎందుకు తీసుకొస్తావని అంటుంది.మీ నాన్నకు చెప్పి మలేషియాలో మంచి ఉద్యోగం ఇప్పించకపోయావా అని బాలు అంటాడు. దాంతో రోహిణి షాక్ అవుతుంది. ఆయన బిజినెస్‌లన్నీ వీడికే అప్పజెబుతారు అని ప్రభావతి గొప్పగా అంటుంది. ముందు వాళ్ల పుట్టింటి నుంచి ఒక్కరంటే ఒక్కరు అయినా మన ఇంటికి వచ్చి మొహం చూపించమను. అప్పుడు చూద్దాం అని బాలు ఛాలెంజ్ చేస్తాడు..
రోహిణి బాధపడుతుంటే ప్రభావతి వెళ్తుంది. ఎంత పొగరుగా మాట్లాడాడో చూశారుగా, మనోజ్‌ను ఎప్పుడు అవమానిస్తూనే ఉంటాడు అని రోహిణి బాధగా చెప్పుకుంటుంది. అలాంటి వాళ్ల పొగరు దించాలంటే ఒక్కటే మార్గం. మీ నాన్నను ఇక్కడికి పిలిపించడమే అని ప్రభావతి అంటుంది. లేని నాన్నని ఎక్కడి నుంచి పిలిపించాలి. దీనికి పరిష్కారం చూడకపోతే నేను ఇరుక్కుంటాను అని రోహిణి అంటుంది.. మొత్తానికి రోహిణి మెడకు చుట్టుకుంటుంది. మరి రోహిణి ఏం ప్లాన్ చేస్తుందో చూడాలి.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో బాలు అందరిని ఒక ఆట ఆడుకుంటారు. శృతి వెళ్తుందా? లేదా అనేది సోమవారం చూడాలి..