OTT Movies : ప్రతి నెలలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల తో పాటు ఓటిటిలో కూడా భారీ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.. అయితే ఓటీటీ లో రిలీజ్ అవుతున్న కంటెంట్ పై మూవీ లవర్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. మిగిలిన ఇండస్ట్రీలలో కంటే మలయాళ సినిమాలకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. కానీ అస్సలు తగ్గలేదు. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. మార్చి నెల ముగుస్తుంది. ఏప్రిల్ నెలలో ఓటిటిలోకి ఎలాంటి సినిమాలు వస్తాయని ఇప్పటినుంచే మూవీ లవర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు మనం వచ్చే నెలలో ఓటీడీలో రిలీజ్ అవుతున్న మలయాళ సినిమాల గురించి ఒకసారి తెలుసుకుందాం..
బ్రోమాన్స్..
మలయాళీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలలో మంచి టాక్ ని సొంతం చేసుకున్న మూవీ బ్రోమాన్స్..మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్ లతో పాటు సంగీత్ ప్రతాప్, మహిమ నంబియార్, శ్యామ్ మోహన్ కలిసి నటించిన ఈ మూవీ.. ఈ మూవీ మొత్తం సరదాగా సాగుతుంది. అందరూ కలిసి బయటికి వెళ్తారు కానీ ఒకచోట మాత్రం అందరూ విడిపోతారు ఒకరికొకరు సంబంధం లేకుండా పోతారు కానీ చివరికి అందరూ ఒకే చోట కలుస్తారు. ఇది మొత్తం యువతీయువకుల మధ్య సాగే ఒక క్యూట్ స్టోరీ.. కళాభవన్ షాజోన్ కూడా వారితో చేరతాడు. ఈ సినిమాలోని కొడవా వెడ్డింగ్ సాంగ్ జనరేషన్ జెడ్ ప్రేక్షకులలో బాగా పాపులర్ అయింది. ఈ మూవీ కూడా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి డేట్ ను చూసుకుంటుంది..
ప్రవీణ్‌కూడు షాపు..
ఈనెల రిలీజ్ అయిన పోన్ మ్యాన్ మూవీకి ఓటీటిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కల్లు దుకాణం లో దాని యజమాని మరణం, దానిపై సాగే దర్యాప్తు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్ కూడా నటించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ సోనిలైవ్ లో స్ట్రీమింగ్ రాబోతుంది. వచ్చే నెల 11 న ఈ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతుంది.
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్..
ఈ మూవీ స్టోరీ కొంచెం కొత్తగా ఉంటుంది. మమ్ముట్టి ఒక సాధారణ కేసును తీసుకునే డిటెక్టివ్ గా నటించాడు. కానీ అతను లోతుగా తవ్వే కొద్దీ, కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి. స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన మొదటి మలయాళ చిత్రం ఇది. థియేటర్ల లో విడుదలైన ఏ మూవీ ఇప్పటివరకు ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది..
వీటితో పాటు మరికొన్ని సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. వచ్చేనెల మొదటి వారంలో ఏ సినిమా ఏ ఓటిటి లో రాబోతుంది అన్న దానిపై క్లారిటీ అయితే వచ్చేలా ఉంది..