బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. లేకపోతే ప్రజల్లో చులకన అవుతారు. తాజాగా ఓ ఎమ్మెల్యే గారు చేసిన పని కూడా తీవ్ర విమర్శలకు కారణం అయ్యింది. నలుగురిలో నవ్వుల పాలు చేసింది. ఓ శంకుస్థాపనకు వెళ్లిన ఆయన, రెడ్ రిబ్బన్ కట్టిన కట్టలేదని కోపంతో ఊగిపోయాడు. అక్కడే పాతిన అరటి మొక్కను తీసుకుని సిబ్బందిపై దాడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు ఎమ్మెల్యేపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి వెధవను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న అక్కడి ప్రజలను అనాలి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
అస్సాంలోని ధుబ్రి జిల్లా బిలాసిపారా ప్రాంతంలోని దైఖోవా మార్కెట్ దగ్గర రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. చాలా కాలంగా ఈ సమస్య ఉండటంతో, మజులి- జోర్హాట్ మధ్య నది మీద వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ. 1019 కోట్లు కేటాయించింది. తాజాగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు తూర్పు బిలాసిపారాకు చెందిన ఎఐయుడిఎఫ్ ఎమ్మెల్యే షంసుల్ హుడాను ఆహ్వానించారు. ఆయన వెళ్లే సరికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు అరటి మొక్కలను పాతి దానికి ఓ పింక్ రిబ్బన్ ను కట్టారు. అయినప్పటికీ, శంకుస్థాపనకు భారీగా ఏర్పాటు చేయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వంతెన నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్ అవినాష్ అగర్వాల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.
అక్కడే ఉన్న నిర్మాణ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే షంసుల్ హుడా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఇంత సింపుల్ గా ఏర్పాట్లు చేస్తారా? అంటూ కాంట్రాక్టు సంస్థకు చెందిన ఉద్యోగిని కాలర్ పట్టి లాగి చెంప దెబ్బ కొట్టాడు. అంతటితో ఆగకుండా అక్కడే పాతిన అరటి మొక్కను తీసుకుని అతడిపై దాడికి దిగారు. ఎమ్మెల్యే ప్రవర్తనను చూసి ఆ కార్యక్రమానికి వచ్చి అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు షాకయ్యారు.
असम के धुबरी जिले के पूर्वी बिलासिपारा विधानसभा से विधायक हैं समसुल हुदा…
विधायक जी को एक पुल के शिलान्यास के लिए बुलाया गया था…
विधायक जी को शिलान्यास के लिए फीता काटना था. इसके लिए केले के दो पौधों के बीच एक गुलाबी फीता लगाया गया था…
लेकिन विधायक जी इस बात पर भड़क गए… pic.twitter.com/TXEGBK6WkW
— Amit Yadav (Journalist) (@amityadavbharat) March 20, 2025
Read Also: గుడ్డు మాంసాహారమా.. శాకాహారమా.. నిపుణులు ఏం చెప్తున్నారంటే?
ఎమ్మెల్యే తీరుపై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు
అటు ఎమ్మెల్యే దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. స్థానిక ప్రజలు కూడా ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత ముఖ్యమైన కార్యక్రమంలో ఎమ్మెల్యే అంత చీప్ గా ప్రవర్తించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వాడిని ఎమ్మెల్యేగా గెలిపించారంటే, అక్కడి ప్రజలు ఎలాంటి వాళ్లో అర్థం చేసుకోవచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అటు ఈ ఘటన మీడియాలో బాగా ప్రసారం కావడంతో అక్కడి ముఖ్యమంత్రి కూడా సదరు ఎమ్మెల్యేను మందలించినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలా ప్రవర్తిస్తే బాగోదని హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విపక్ష ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: విడాకుల కోసం కోర్టుకెక్కిన భార్య.. పాటపాడి మనసు కరిగించిన భర్త!