Bigg Boss Divya: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. ఇటీవలే తొమ్మిదవ సీజన్ కూడా పూర్తి చేసుకుంది.. ఈ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్న దివ్య కాంట్రవర్సీ క్వీన్ గా పేరు తెచ్చుకుంది.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆఫర్ అందుకొని బిజీగా ఉంటారు. కానీ దివ్య మాత్రం సినిమాలకు రివ్యూ ఇస్తుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మన శంకర వరప్రసాద్ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు ఈ అమ్మడు రివ్యూ ఇచ్చింది. ఆమె ఇచ్చిన రివ్యూ పై మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అసలు ఆమె ఏం చెప్పిందో ఒకసారి తెలుసుకుందాం..
సాధారణంగా బిగ్ బాస్ రివ్యూలు, స్టార్ హీరోల సినిమాలతో బాగా పాపులర్ అయిన ముద్దుగుమ్మ దివ్య.. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్‌గా వెళ్లి నెగిటివిటీతో బయటకు వచ్చింది.. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ ఫ్యాన్స్ ను గెలికి నెగిటివిటిని అందుకుంది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చింది. ఖర్చులేని యాపారం కదా.. ఈ మధ్య ప్రతి ఒక్కడూ రివ్యూవర్ అయిపోయాడు. ఫోన్ ఉంది కదా నీ నోటికి వచ్చినట్లు చెప్పేస్తున్నారు అంటూ రెచ్చిపోయింది దివ్య. మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి నా మినీ రివ్యూ. మీకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా నచ్చితే ఈ సినిమా కూడా నచ్చుతుంది. అనిల్ రావిపూడి ఇప్పుడే గతంలో చేసిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా ఈ సినిమాని చూసేయచ్చు అని దివ్య అంటుంది. సినిమా రిలీజ్ అయినప్పుడు ఆమె ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో మెగా ఫాన్స్ దివ్య పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నువ్వు ఇలాంటి రివ్యూలు ఎన్ని ఇచ్చిన చిరంజీవి సినిమా బ్లాక్ బాస్టర్ అంటూ మెగా ఫ్యాన్స్ ఆమెను ఏకీపారేస్తున్నారు..
Also Read :బాలు, మీనా ఫైట్.. ప్రభావతి దెబ్బకు మీనా ఫ్యూజుల్ అవుట్.. ఇదేం ట్విస్ట్..
మెగాస్టార్ చిరంజీవి నటించిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు.. అనిల్ రావిపూడి ఇప్పుడు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ లో నయనతార హీరోయిన్ గా నటించింది.. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ని అందుకున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతే కాదు కాసుల వర్షం కూడా కురిపిస్తుంది.. ఈ సినిమా దాదాపు 200 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఈ వీకెండు ఈ సినిమాకు మరింతగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. 300 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం 500 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం కూడా ఉందని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు. చివరగా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి..
?igsh=OG5pMmJpZjZ4Mm03