E-Paper
Advertisement

ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘తిమ్మరాజు పల్లి టీవీ’..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘తిమ్మరాజు పల్లి టీవీ’..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

Timmaraju palli TV OTT: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో కామెడీ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం తిమ్మరాజు పల్లి టీవీ. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నిర్మాతగా నిర్మించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. తాజాగా ఈ విషయాన్ని ఆహా అధికారకంగా తెలియజేశారు. ఈ సినిమా తెలుగు ఓటీటీ హక్కులను కైవసం చేసుకున్న ఆహా వీడియో(Aha video) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారక ప్రకటన తెలియజేశారు. ఈ సినిమా థియేటర్లలో ఏప్రిల్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మొత్తం ఊర్లో ఉన్న ఒక టీవీ చుట్టూ కొనసాగుతుంది.

ఆహాలో తిమ్మరాజు పల్లి టీవీ..

వి. మునిరాజ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి తేజ్ (Sai Tej)హీరోగా పరిచయమయ్యారు. ఇక హీరోయిన్ గా వేద జలంధర్ నటించి సందడి చేశారు. థియేటర్లలో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. మే 15వ తేదీన ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని ఆహా అధికారకంగా తెలియజేస్తూ..”ఒక టీవీ మిస్సింగ్, ఒక దొంగ పై నిందా.. నిజం కోసం ఎదురుచూసే ఒక గ్రామం.. తిమ్మరాజు పల్లి టీవీ మే 15న ఆహాలో ప్రీమియర్ కానుందని తెలియజేశారు.

ఆహా గోల్డ్ యూజర్లకు బంపర్ ఆఫర్..

Advertisement

ఇక ఆహా గోల్డ్ యూజర్లకు మరొక ఆఫర్ కూడా ఇచ్చారు. ఆహా గోల్డ్ యూజర్లు ఈ సినిమాని 24 గంటల ముందే అంటే మే 14వ తేదీనే ఆహాలో ఈ సినిమా చూసే వెసులు బాటును కల్పించింది. కిరణ్ అబ్బవరం నిర్మాతగా దాదాపు కొత్త నటీనటులను పరిచయం చేస్తూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. థియేటర్లలో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఏ విధమైనటువంటి ఆదరణను సొంతం చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే..

Advertisement

తిమ్మరాజు పల్లి టీవీ సినిమా కథ 1996 రాయలసీమ బ్యాక్ ప్రాబ్లం కొనసాగుతుంది. తిమ్మరాజు పల్లి అనే ఒక పల్లెటూరులో ప్రతి శివ రాత్రికి ఊరు జనాలంతా కలిసి చందాలు వేసుకొని ఎంతో ఘనంగా పండుగను జరుపుకుంటారు. అలాగే సాయంత్రం అద్దెకు తెచ్చుకున్న టీవీ విసిఆర్ లో కొత్త సినిమాలు వేసుకొని వినోదాన్ని పొందుతారు. ఇలాంటి ఊరిలోకి రాజప్ప (ప్రదీప్ కొట్టే) ఒక టీవీ కొనుక్కొని తెచ్చుకుంటాడు. ఇలా తమ ఊర్లో టీవీ ఉండేసరికి ఊరి ప్రజలంతా ఇంట్లోనే టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. మరోవైపు దొంగతనాలు చేసే సతీష్ (సాయి తేజ్) రాజప్ప చెల్లి శారద (వేద జలంధర్) ను ప్రేమిస్తుంటాడు. టీవీ పేరుతో ప్రతిరోజు వారి ఇంటికి వెళ్లి శారదను కలుస్తుంటాడు. ఈ విషయం తెలిసి ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఆ సమయంలోనే రాజప్ప ఇంట్లో టీవీ దొంగతనం అవుతుంది. కచ్చితంగా టీవీ దొంగతనం సతీష్ చేసి ఉంటారని అందరూ నిందిస్తారు. మరి నిజంగానే సతీష్ దొంగతనం చేశారా? తనుకు ఇచ్చిన గడువులో దొంగతనం చేయలేదని నిరూపించుకున్నారా? చివరికి సతీష్ శారద ప్రేమ గెలిచిందా? అనేది ఈ సినిమా కథ

Also Read: నిర్మాత ఆర్. బి. చౌదరికి నివాళులు అర్పించిన విజయ్..

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×