Horror Movies In OTT: ఓటీటీ సంస్థలు హారర్ థ్రిల్లర్ సినిమాలను ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఒకదానికి మించి మరొకటి హారర్ సన్నివేశాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలోనే అలాంటి సినిమాలను చూసే వాళ్ళము.. కానీ ఈ మధ్య తమిళ్, తెలుగు మలయాళం, ఇండస్ట్రీ నుంచి కూడా హారర్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. భయంకరమైన హారర్ సీన్లు.. మెంటలెక్కించే క్లైమాక్స్ లు ఉన్న సినిమాలేంటో ఒకసారి చూసేద్దాం..
పిజ్జా..
తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హారర్ సినిమా పిజ్జా.. ఇది ఒక కట్టు కదే కానీ మొదట చూస్తే అర్థం కాదు. ప్రేక్షకులను మైండ్ బ్లాక్ చేసే సన్నివేశాలు ఇందులో ఎన్నో ఉంటాయి. ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటించారు. ఈ మూవీతో విజయ్ సేతుపతి బాగా పాపులర్ అయ్యాడు. 2021లో విడుదలై భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది.. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. పిజ్జా డెలివరీకి వెళ్లిన ఓ వ్యక్తికి ఓ ఇంట్లో ఎదురైన భయానక పరిస్థితుల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. జియో హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది..
అవల్..
సిద్ధార్థ్, ఆండ్రియా జెరెమియా ప్రధాన పాత్రలు పోషించిన ‘అవల్’.. 2017 లో థియేటర్లలోకి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదొక తమిళ హారర్ సినిమా. తెలుగులో గృహం పేరుతో సినిమా రిలీజ్ అయింది. భయంకరమైన సన్నివేశాలతో పాటు స్టోరీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా అప్పట్లో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి మిలింద్ రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను యూట్యూబ్‍లో ఫ్రీగా చూసేయవచ్చు..
అంధగారమ్..
ఈ సినిమా కూడా తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి మంచి టాక్ ని సొంతం.. 2020 నవంబర్‌లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో వినోద్ కిషన్, అర్జున్ దాస్, పూజా రామచంద్రన్, కుమార్ నటరాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి విఘ్నరాజన్ దర్శకత్వం వహించారు. అంధుడైన లైబ్రరేరియన్, ఓ క్రికెటర్, ఓ సైకలాజిస్ట్ మధ్య ఈ చిత్రం సాగుతుంది. హారర్, సైకలాజికల్ థీమ్‍లతో థ్రిల్లింగ్‍గా మూవీ స్టోరీ ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
పిశాచి..
డిఫరెంట్ కథతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒక యాక్సిడెంట్ లో ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అవుతుంది. అది గమనించకుండా వెళ్ళిపోతారు.. రోడ్డు ప్రమాదంలో మరణించిన అమ్మాయి దెయ్యంగా మారడం చుట్టూ ఈ సినిమా ఉంటుంది. పిసాచు చిత్రాన్ని ప్రస్తుతం జియోహాట‍్‍స్టార్ ఓటీటీలో చూడొచ్చు. తెలుగులోనూ అందుబాటులో ఉంది.. 2014 డిసెంబర్‌లో వచ్చింది. తెలుగులో పిశాచి పేరుతోనూ థియేటర్లలోకి వచ్చిది. ఈ మూవీలో నాగా, ప్రగాయా మార్టిన్, రాధారవి, రాజ్‍కుమార్, అశ్వత్ లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమాకు మిస్కిన్ దర్శకత్వం వహించారు..
తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హారర్ సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని సినిమాలు ఓటీటీల్లో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతున్నాయి.