OTT Movie : ఓటీటీలోకి కొత్త కొత్త స్టోరీలతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. మంచి కంటెంట్ ఉన్న స్టోరీలను ప్రేక్షకుల ఆదరిస్తూనే ఉన్నారు. అలా ఆదరిస్తున్న వాటిలో మలయాళం సినిమాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ సినిమాలను డిఫరెంట్ స్టోరీలతో తెరకెక్కిస్తున్నారు దర్శకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక సైబర్ క్రైమ్ చుట్టూ తిరుగుతుంది. ఒక అమ్మాయిని క్రిమినల్ గ్యాంగ్ వేధించటంతో ఈ సినిమా స్టోరీ మలుపు తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
రాధిక బాలన్ (రజిషా విజయన్) అనే అమ్మాయకి సైబర్ సెక్యూరిటీలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఆమె తన తండ్రి రిటైర్డ్ అడ్వకేట్ బాలన్ తో కలిసి జీవిస్తూ, కొత్తగా ఒక స్టార్టప్ కంపెనీలో పనిచేస్తుంది. ఒక రోజు ఆమె పొరపాటున రాంగ్ నంబర్‌కు కాల్ చేస్తుంది. అది ఒక క్రిమినల్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తికి వెళ్తుంది. ఆ తర్వాత ఆ గ్యాంగ్ ఆమెను ఫోన్ కాల్స్, అసభ్యకరమైన క్లిప్స్ పంపడం వంటి వాటితో వేధించడం మొదలుపెడుతుంది. ఈ వేధింపులను భరించలేక రాధిక చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయినా కానీ వేధింపులు మాత్రం ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఇక ఆమె తన సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలను ఉపయోగించి, ఈ క్రిమినల్స్‌ను సొంతంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె వాళ్ళను ట్రాక్ చేసి, తెలివిగా ఓడించడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అనుకోని సంఘటనలు ఎదురౌతాయి. చివరికి రాధిక ఆ క్రిమినల్స్ కి బుద్ధి చెబుతుందా ? ఈ వేధింపుల నుంచి బయటపడుతుందా ? ఆమె క్రిమినల్స్ నుంచి ఎటువంటి సమస్యలను ఎదుర్కుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : పిల్లల నుంచి పెద్దల దాకా అందరినీ అబ్బురపరిచే ఫ్యాంటసీ థ్రిల్లర్… నెవర్ బిఫోర్ సీన్స్ మావా
యూట్యూబ్ (Youtube) లో
ఈ మలయాళ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కీడం’ (Keedam). 2022 లో విడుదలైన ఈ మూవీకి రాహుల్ రిజి నాయర్ దర్శకత్వం వహించారు. ఇందులో రజిషా విజయన్, శ్రీనివాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ 2022 మే 20న థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమా స్టోరీ ఒక మహిళ జీవితంలోకి చొరబడిన క్రిమినల్ గ్యాంగ్ చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం యూట్యూబ్ (Youtube) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజుల్లో ఇటువంటి నేరాలు బాగా పెరిగిపోయాయి. వీటి వల్ల అమ్మాయిలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ సినిమాని అవగాహన కోసం అమ్మాయిలు తప్పకుండా చూడాలి.