E-Paper
Advertisement

మైండ్ బ్లాక్ చేస్తున్న క్రేజీ థ్రిల్లర్.. హీరో లేడు, బడ్జెట్ తక్కువ.. కానీ రేటింగ్ మాత్రం మామూలుగా లేదుగా!

మైండ్ బ్లాక్ చేస్తున్న క్రేజీ థ్రిల్లర్.. హీరో లేడు, బడ్జెట్ తక్కువ.. కానీ రేటింగ్ మాత్రం మామూలుగా లేదుగా!
Advertisement

Vadh 2:మూవీ లవర్స్ కలిసారంటే  గంటల తరబడి సినిమాల గురించి డిబేట్స్ , డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయ్.ఇదిగో తాజాగా నెట్టింట్లో అలానే ఫుల్ డిస్కషన్ లో నలిగిపోతున్న సినిమా ‘వద్ 2’. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇపుడు ఫిల్మీ ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కిస్తుంది.వద్’కు స్పిరిచువల్ సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 6, 2026న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ చూసిన ఈ సినిమా సరిగ్గా ఎనిమిది వారాల అంటే ఏప్రిల్ 3, 2026 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో నిలవడం విశేషం.

భార్యాభర్తలుగా కనిపించిన సంజయ్ మిశ్రా , నీనా గుప్తా

Advertisement

‘వద్’ (2022) లో భార్యాభర్తలుగా కనిపించిన సంజయ్ మిశ్రా , నీనా గుప్తాలు ఇందులో  జైలు గార్డుగా, ఒక ఖైదీగా డిఫరెంట్ రోల్స్ ప్లే చేయడం విశేషం.ఇక వీరితో పాటు కుముద్ మిశ్రా,అక్షయ్ డోగ్రా,అమిత్ కె. సింగ్,శిల్పా శుక్లా కీలక పాత్రలో నటింఛి మెప్పించారు.ఇక  ఈ సినిమాకు జస్పల్ సింగ్ సంధు దర్శకత్వం వహించగా లవ్ రంజన్ , అంకుర్ గర్గ్ లు కలిసి నిర్మించారు.థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ, ఇప్పుడు ఓటీటీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

also read:అజిత్ ‘డబుల్’ ప్లాన్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే! సొంతంగా రంగంలోకి దిగుతున్న ‘థాలా’..?

Advertisement

రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న సాధారణ పోలీస్ ఆఫీసర్‌గా

సినిమా కథ విషయానికి వస్తే మధ్యప్రదేశ్‌లోని శివపురి జైలు బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ జరుగుతుంది. ఇందులో సంజయ్ మిశ్రా శంభునాథ్ మిశ్రా అనే ఒక రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న సాధారణ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. తన కొడుకు విదేశీ చదువుల కోసం చేసిన అప్పులు తీర్చడానికి జైలులోనే కూరగాయలు పండిస్తూ వాటిని బయట అమ్ముకునే ఒక సామాన్యుడి పాత్రలో ఆయన నటించి మెప్పించారు.ఇక అదే జైలులో తాను చేయని రెండు హత్యల కేసులో 28 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ముంజు సింగ్ (నీనా గుప్తా)తో ఆయనకు ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత జైలులోకి ఎంట్రీ ఇచ్చిన పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న రౌడీ కేశవ్ (అక్షయ్ డోగ్రా) వల్ల కథ ఊహించని మలుపు తిరుగుతుంది.

కథాకథనాలనే నమ్ముకున్న జస్పల్ సింగ్

ఇక కేశవ్ అనే రౌడీ జైలు అధికారులపైనే పెత్తనం చేస్తూ, ఒకరోజు అకస్మాత్తుగా సెల్ లోంచి మాయమైపోవడంతో సినిమా ఒకసారిగా సీరియస్ టర్న్ తీసుకుంటుంది.  అసలు ఆ రౌడీ ఏమయ్యాడు? ఈ చిన్న పోలీస్ ఆఫీసర్‌కి అతనికి ఉన్న సంబంధం ఏంటి? అనేది తెరపై చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా, ఒక సామాన్య వ్యక్తి ఎప్పుడు, ఎందుకు హంతకుడిగా మారుతాడు అనే అంశాన్ని ఈ సినిమా చాలా డెప్త్ గా ఇందులో చర్చించాడు దర్శకుడు జస్పల్ సింగ్ సంధు. గ్లామరస్ హీరోలు, భారీ యాక్షన్ సీక్వెన్స్లు కాకుండా  కేవలం కథాకథనాలనే నమ్ముకున్న జస్పల్ సింగ్ ని మెచ్చుకోవాల్సిందే.

ఒక మాంచి థ్రిల్లర్ కి గా తెరకెక్కిన ఈ సినిమాకి IMDbలో 7.4 రేటింగ్ ఉండటం విశేషం. మరి ఇంకెందుకు ఆలస్యం నెట్‌ఫ్లిక్స్‌లో వైరల్ అవుతున్న ఈ ఎంగేజింగ్ థ్రిల్లర్‌ను మీరు చూసేయండి. సాలిడ్ థ్రిల్ సొంతం చేసుకోండి !

also read:వంగా ‘వైల్డ్’ వెంచర్స్.. అటు ప్రభాస్.. ఇటు సుమంత్ ప్రభాస్.. మధ్యలో సెన్సేషన్ ట్వీట్!

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×