OTT Movie : హారర్ సినిమాలను స్ట్రీమింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. వీటిని చూడటానికి మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ జానర్ కి భాషతో సంబంధం అంతగా ఉండదు. ఎందుకంటే విజవల్స్, సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ తోనే ఆడియన్స్ కి అదిరిపోయే థ్రిల్లింగ్ ఇస్తుంటాయి ఈ సినిమాలు. వీటిలో మలేషియన్ హారర్ సినిమాలలో హారర్ కంటెంట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ, కొంత మంది ఫ్రెండ్స్ ఒక డెజర్టెడ్ ఐలాండ్‌లో రాత్రి గడపడానికి వెళ్తారు. అయితే అక్కడ ఒక పాత శాపం వాళ్లను భయంకరంగా టార్గెట్ చేస్తుంది. ఈ హారర్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘పులౌ’ (Pulau) ఈ మలేషియన్ హారర్ మూవీకి యూహో దర్శకత్వం వహించారు. ఇందులో కాట్ (అమెలియా హెండర్సన్), యాయా (సాబ్రోన్జో), హారిస్ (హారిస్ అనువర్), ఇక్మల్ (ఇక్మల్ అమ్రీ), సాన్జ్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2023 మార్చి 9న మలేషియాలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
మలేషియాలో ఒక గ్రూప్ ఫ్రెండ్స్ (కాట్, యాయా, హారిస్, ఇక్మల్, సాన్జ్నా, సియో పూయి) వీకెండ్ ట్రిప్ కోసం ఒక బెట్ వేసుకుంటారు. బెట్ ప్రకారం, వాళ్లు ఒక డెజర్టెడ్ ఐలాండ్‌లో ఒక రాత్రి గడపాలి. ఈ ఐలాండ్ నగరానికి చాలా దూరంగా ఉంటుంది. అక్కడ ఎవరూ ఉండరు. అక్కడ ఉండే ఒక పాత గ్రామం కూడా, ఆ ప్రాంతాన్ని వదిలేసినట్టు ఉంటుంది. ఒక బోట్ మన్ వీళ్లను ఐలాండ్‌కు తీసుకెళ్తాడు. అతను ఈ ఐలాండ్ సేఫ్ కాదని హెచ్చరిస్తాడు. కానీ వీళ్లు అతని మాట వినకుండా, ఫన్ కోసం అక్కడ రాత్రి ఉండాలని అనుకుంటారు. ఐలాండ్‌లో చేరిన తర్వాత, వాళ్లు క్యాంప్ సెట్ చేస్తారు. గేమ్స్ తో సరదాగా గడుపుతారు. ఈ గ్రూప్ ను కాట్ అనే డేరింగ్ అమ్మాయి లీడ్ చేస్తుంది. కానీ రాత్రి అవుతున్న కొద్దీ, ఐలాండ్‌లో వింత శబ్దాలు, అసాధారణ సంఘటనలు మొదలవుతాయి. వాళ్లకు ఏదో తప్పు జరుగుతుందని అనిపిస్తుంది.
Read Also : ఒంటరిగా మనిషి దొరికితే వదలకుండా అదే పని… సీను సీనుకో ట్విస్ట్… పిచ్చెక్కించే సైకో థ్రిల్లర్
రాత్రి అవుతున్న కొద్దీ ఐలాండ్ మరింత భయంకరంగా మారుతుంది. ఫ్రెండ్స్ ఒకరినొకరు చూసుకుని భయపడతారు. వాళ్లు అక్కడ ఉండే ఒక పాత గ్రామాన్ని కనిపెడతారు. అక్కడ ఒక భయంకరమైన శాపం ఉందని తెలుస్తుంది. అక్కడ పగ తీర్చుకునే ఒక భూతం మానవుల రక్తం కోసం ఆకలితో ఉంటుంది. ఈ భూతం ఐలాండ్‌లోకి వచ్చిన వాళ్లను ఒక్కొక్కరినీ టార్గెట్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ శాపాన్ని ఆపడానికి ఒక రిచ్యువల్ చేయాల్సి ఉంటుంది. కానీ అది చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఈ ప్రాసెస్‌లో కొందరు ఫ్రెండ్స్ స్పిరిట్‌కు బలి అవుతారు. స్పిరిట్ ఒక్కొక్కరినీ టార్గెట్ చేసి, భయంకర రూపంలో కనిపిస్తుంది. కాట్ తన ధైర్యంతో, ఆ రిచువల్ చేస్తుంది. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. చివరకు కాట్ ఆ శాపాన్ని ఆపడంలో సక్సెస్ అవుతుందా ? ఆ గ్రూప్‌లో ఎవరైనా బతుకుతారా ? వాళ్ళు ఐలాండ్ నుంచి బయటపడతారా ? అనే ఈ భయంకరమైన విషయాలను, ఈ మలేషియన్ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.