BigTV English

Thangalaan OTT : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన విక్రమ్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

Thangalaan OTT : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన విక్రమ్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

Thangalaan OTT : తమిళ హీరో విక్రమ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాత్ర కోసం తనను తాను మార్చుకుంటాడు. ఐ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో చూసాము.. అలాంటి విక్రమ్ కు ఇటీవల పెద్దగా హిట్ సినిమాలు లేవని చెప్పాలి. ఈ ఏడాది భారీ యాక్షన్ మూవీ తంగలాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఆ సినిమా వచ్చి చాలా రోజులు అయ్యింది. కొన్ని కారణాల వల్ల ఓటీటీ రిలీజ్ ఆగిపోయింది. ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రకటించిన డేట్ కన్నా కూడా ముందుగానే సడెన్ గా ఓటీటీలో కి వచ్చేసింది. ఇక ఆలస్యం ఎందుకు ఓటీటీ డీటెయిల్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం..


ఓటీటీ లోకి తంగలాన్ మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన ప్రేక్షకులకు గుడ్ న్యూస్. అసలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా చియాన్ విక్రమ్ మూవీ నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. గత నెలలోనే కోర్టు కేసుకు సంబంధించి క్లియరెన్స్ రావడంతో ఓటీటీ స్ట్రీమింగ్ కు అడ్డంకి తొలగిపోయింది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ తో కొన్ని వాదనల తర్వాత ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసింది.. డిసెంబర్ 13 లేదా 20 వ తేదీ అని ముందుగా అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు సడెన్ గా ఓటీటీలో ఇవాళ ప్రత్యేక్షమైంది.. సడెన్ గా ఓటీటీలోకి రావడం విక్రమ్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన మూవీ తంగలాన్. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది.. ఇక ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దాదాపు 30 కోట్లకు అమ్ముడు పోయింది.

తంగలాన్ స్టోరీ విషయానికొస్తే.. విక్రమ్ ను ఎప్పుడు చూడని లుక్ లో ఈ మూవీలో కనిపిస్తాడు. ప్రేక్షకులను ఆశ్చర్య పరిచేలా ఈ మూవీలో జీవించేశారు. స్వేచ్ఛ స్వాతం త్య్రాల కోసం ఓ గిరిజన తెగ సాగించిన పోరాటానికి నిధి అన్వేషణను జోడించి యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా దర్శకుడు పారంజిత్ తంగలాన్ ను తెరకేక్కించాడు. కానీ కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యాడు. అదే కాస్త నెగిటివ్ టాక్ ను అందుకొనేలా ఉంది. అక్కడ ప్రాంతంలోని ప్రజలు పన్ను కట్టలేదని సాకుగా చూపించి తంగలాన్‌ భూమిని ఊరి జమీందారు స్వాధీనం చేసుకుంటాడు. జమీందారు ఆక్రమించుకున్న భూమిని తిరిగి సొంతం చేసుకోవడం కోసం బ్రిటీషర్లతో కలిసి అడవిలో ఓ బంగారు నిధిని వెలికితీయడానికి వెళతాడు. అక్కడ హీరోయిన్ తో పరిచయం ఏర్పడుతుంది. బంగారం కోసం వెళ్లిన హీరోకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్నది సినిమా స్టోరీ.. ఇన్ని రోజులకు అన్ని అడ్డంకులను దాటుకొని ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఈ సినిమా తర్వాత కొత్త సినిమాలో బిజీగా అయ్యాడు విక్రమ్..


Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×