Makhana: చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. స్థిరమైన శక్తిని కొనసాగించడానికి, ఈ సీజన్‌లో కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు తినాలి. ఇవి శరీరానికి వెచ్చదనాన్ని అందించడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మఖానా శీతాకాలంలో ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. శీతాకాలంలో మీ ఆహారంలో సులభంగా వీటిని చేర్చుకోవచ్చు. మరి మఖానా చలికాలంలో తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
పొటాషియం, మెగ్నీషియం , ఫాస్పరస్ వంటి ఖనిజాలు మఖానాలో లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులోని పోషకాలు గుండెను బలపరుస్తాయి. మఖానాను క్రమం తప్పకుండా తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటుంది. ఇది గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది:
మఖానాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మఖానా తినడం వల్ల చాలా కాలం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. అంతే కాకుండా మనం అతిగా తినకుండా చేస్తుంది. చలికాలంలో మీ ఆహారంలో మఖానాను చేర్చుకోవడం ద్వారా మీ బరువును నియంత్రించుకోవచ్చు.
ఎముకలను బలపరుస్తుంది:
మఖానాలో కాల్షియం, ఫాస్పరస్ మంచి మొత్తంలో లభిస్తాయి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఎముకలు నొప్పులు ప్రారంభమైనప్పుడు మఖానా తినడం వల్ల ఎముకలు బలపడి కీళ్లకు ఉపశమనం కలుగుతుంది. కీళ్ల నొప్పులు ఉన్న వారు కూడా మఖానా తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
మఖానా తినడం వల్ల జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ పొట్టను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. శీతాకాలంలో మఖానా తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు సంబంధిత సమస్యలను కూడా మీరు నివారించవచ్చు.
Also Read: ఏలకులు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు !
చర్మానికి ప్రయోజనకరమైనది:
యాంటీఆక్సిడెంట్లు, జింక్ వంటి పోషకాలు మఖానాలో లభిస్తాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చలికాలంలో చర్మం తేమను కాపాడుకోవడానికి మఖానా తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.