Free Ganesh Idols:అన్ని విఘ్నాలను తొలగించే ఆది దేవుడు విఘ్నేశ్వరుడి చవితి సమీపిస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర కెమికల్స్ తో తయారు చేసిన విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలను పూజించి, పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న సందేశాన్నిస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) మట్టి విగ్రహాలను సిద్దం చేసింది. హైదరాబాద్ నగరంలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా రోజురోజుకి పెరుగుతున్న వాహన కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం నుంచి బయట పడేందుకు మట్టి విగ్రహాలను పూజించాలని అధికారులు సూచిస్తున్నారు.
నేటి నుంచి 13 వరకు ఉచితంగా పంపిణీ
ఇందుకు గాను వాతవరణానికి, వాటర్ బాడీలకు ఎలాంటి ముప్పుు కల్గించని జిగురు మట్టితో తయారు చేసిన, మూడు వివిధ రకాల ఎత్తులో తయారు చేసిన మట్టి విగ్రహాలను హెచ్ఎండీఏ సిద్దం చేసింది. ఈ నెల 14వ తేదీ వినాయక చవితి ఉన్నందున, ఈ నెల 9వ తేదీ బుధవారం నుంచి 13 వతేదీ వరకు సిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఈ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విగ్రహాలను వాటర్ బాడీల్లో నిమజ్జనం చేసినా, నీటికి గానీ, నీటిలో జీవులకు ఎలాంటి నష్టం వాటిల్లే పరిస్థితి ఉండదని అధికారులు తెలిపారు.
8 అంగుళాల ఎత్తులో 80 వేల విగ్రహాలు
ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇతర కెమికల్స్ వినియోగించి తయారు చేసిన విగ్రహాలను పూజించే పద్దతిని క్రమంగా తగ్గించాలన్న సంకల్పంతో హెచ్ఎండీఏ 2017 నుంచి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలు, స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లోని 34 ప్రాంతాల్లో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడానికి హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేసింది. ఇందులో 8 అంగుళాల ఎత్తుతో ఉన్న విగ్రహాలు 80 వేలు, ఒక అడుగు ఎత్తు ఉన్న విగ్రహాలు 53 వేలు, మొత్తం లక్షా 33 వేల మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయనున్నారు.
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేసే పాయింట్లు
ఆరోగ్యశ్రీ, సైలెంట్ వ్యాలీ హిల్స్, జూబ్లీహిల్స్, రైతుబజార్, మెహదీపట్నం, కేబీఆర్ పార్కు ప్రధాన ప్రవేశ ద్వారం, జూబ్లీహిల్స్, హిందూ న్యూస్‌పేపర్ కార్యాలయం సమీపంలో, గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట, ప్రెస్ క్లబ్, ఈనాడు కార్యాలయం ఎదురుగా, సోమాజిగూడ, హైదరాబాద్, ఎల్లమ్మ ఆలయం, బల్కంపేట, కోత్వాల్‌గూడ ఎకో పార్క్, పెద్దమ్మ ఆలయం, జూబ్లీహిల్స్, శిల్పారామం, హైటెక్ సిటీ, మాదాపూర్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, కూకట్‌పల్లి ,శిల్పారామం, ఉప్పల్, కార్యాలయం, మైత్రివనం, స్వర్ణ జయంతిలలో పంపిణీ చేయనున్నారు.
ALSO READ:మీ అయ్య జాగీరా.. మా MLCలను సస్పెండ్ చేస్తావా? కేటీఆర్ ఫైర్
అలాగే అమీర్‌పేట్, ట్యాంక్‌బండ్, సచివాలయం, ఎన్టీఆర్ గార్డెన్స్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్, ప్రియదర్శిని పార్క్, సరూర్‌నగర్ , రాజీవ్ గాంధీ పార్క్, వనస్థలిపురం, కుందన్‌బాగ్, ఐఏఎస్ కాలనీ, లైఫ్‌స్టైల్ సమీపంలో, బేగంపేట, దుర్గం చెరువు పార్క్ ప్రవేశ ద్వారం, మెల్‌కోటే పార్క్, నారాయణగూడ, వేదిక్ ధర్మ ప్రకాశ్ స్కూల్, సుధా సినీప్లెక్స్ థియేటర్ సమీపంలో, ఓల్డ్ సిటీ, భారతీయ విద్యా భవన్, తేజ్‌నిక్ పురి, వాయుపురి రిక్రియేషన్ సెంటర్, సఫిల్‌గూడ పార్క్, మైండ్‌స్పేస్ జంక్షన్, మాదాపూర్, మై హోమ్ నవద్వీప సమీపంలో, మాదాపూర్, తార్నాక కమర్షియల్ కాంప్లెక్స్, ఆర్టీసీ బస్ డిపో ఎదురుగా, ఇందు అరన్య, బండ్లగూడ, నాగోల్, నానక్ రాంగూడ, హెచ్ జీసీఎల్ కార్యాలయం, తెలంగాణ హైకోర్టు భవనంతో పాటు మొబైల్ వాహానంలో కూడా విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.