Action Thriller on OTT: బార్డర్ దాటి శత్రువుల ప్రాంతంలోకి వెళ్లిన కమాండోలు… అక్కడ అడుగు పెట్టిన క్షణం నుంచే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మిషన్ పూర్తి చేయాల్సి వస్తే ? చుట్టూ శత్రువులే, ఏ చిన్న పొరపాటు జరిగినా మొత్తం టీమ్ ప్రమాదంలో పడే పరిస్థితి, ఇలాంటి హైటెన్షన్ మిలిటరీ యాక్షన్ డ్రామానే ‘Fauda Season 5’. శత్రువుల డెన్‌లోకి వెళ్లి అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్లను చేపట్టే కమాండోల చుట్టూ కథ సాగుతుంది. మరి ఈ ఇంట్రస్టింగ్ హై ఓల్టేజ్ యాక్షన్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనేది తెలుసుకుందాం పదండి.
‘ఫౌడ’లో ఎప్పటిలాగే అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ చుట్టూ కథ మొదలవుతుంది. శత్రువుల కదలికలను గుర్తించేందుకు, కీలకమైన టార్గెట్లను పట్టుకునేందుకు కమాండోలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రంగంలోకి దిగుతారు. కానీ శత్రువుల ప్రాంతంలో అడుగు పెట్టిన తర్వాత పరిస్థితులు అనుకున్నట్టుగా ఉండవు. ఒక్కో క్లూ ఆధారంగా ముందుకు వెళ్తున్న కొద్దీ కొత్త ప్రమాదాలు ఎదురవుతాయి. ఎవరిని నమ్మాలో, ఎవరు శత్రువుల కోసం పనిచేస్తున్నారో అర్థం కాని పరిస్థితులు టీమ్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి.
ఒక చిన్న తప్పిదం కూడా ప్రాణాంతకంగా మారే సమయంలో ఆపరేషన్ ను విజయవంతం చేయడం పెద్ద సవాల్ గా మారుతుంది. మరోవైపు శత్రువులు కూడా తమ వ్యూహాలతో ఎదురుదాడికి దిగడంతో వేట మరింత ఉత్కంఠగా మారుతుంది. ఈ మిషన్ వెనుక అసలు లక్ష్యం ఏంటి ? శత్రువుల ప్లాన్ ను కమాండోలు ఛేదించగలరా ? తమ టీమ్‌లోనే దాగి ఉన్న ముప్పు ఏమైనా ఉందా ? చివరికి ఈ డెడ్లీ ఆపరేషన్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ? అనేదే సీజన్‌లో చూడాల్సిన అసలు కథ.
ప్రతి మిషన్‌లోనూ ఊహించని అడ్డంకులు ఎదురవుతుండటంతో కథ క్షణక్షణం ఉత్కంఠను పెంచుతుంది. ఒకవైపు తమ టీమ్‌ను కాపాడుకోవాలి, మరోవైపు శత్రువుల ప్లాన్‌ను ఛేదించాలి, ఈ రెండు బాధ్యతల మధ్య కమాండోలు చేసే పోరాటం సీట్ ఎడ్జ్ యాక్షన్‌ను అందిస్తుంది. మరి ఈసారి వాళ్లు చేపట్టిన మిషన్ ఏంటి ? శత్రువుల ప్రాంతంలో అసలు ఏం జరుగుతోంది ? ఎవరు ఎవరిని వేటాడుతున్నారు ? మిషన్ పూర్తయ్యేలోపు ఎలాంటి షాకింగ్ పరిణామాలు ఎదురయ్యాయి ? అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ సీజన్‌ను డోంట్ మిస్.
హీబ్రూ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ఇది. మిలిటరీ ఆపరేషన్స్, స్పై మిషన్స్, శత్రు ప్రాంతాల్లో జరిగే హైటెన్షన్ యాక్షన్ ఇష్టపడేవారికి ఈ సిరీస్ మంచి సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సిరీస్ ఇంగ్షీషులోనే అందుబాటులో ఉంది.
Read Also: అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా జరిగిన దారుణం… నరనరాల్లో భయం పుట్టించే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్