Romantic Fantasy Series: ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా గతంలోకి వెళ్లిపోతే ? తిరిగి వచ్చిన క్షణంలో భవిష్యత్తులో ఉంటే ? తనకు ఎప్పుడు, ఎక్కడ టైమ్ ట్రావెల్ జరుగుతుందో తెలియని వ్యక్తి, తన ప్రేమను ఎలా కాపాడుకుంటాడు ? ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్‌తో సాగే రొమాంటిక్ ఫాంటసీ సిరీస్ ‘The Time Traveler’s Wife’. టైమ్ ట్రావెల్ కారణంగా ఎప్పుడూ ఒకే వయసులో, ఒకే కాలంలో ఉండలేని ఓ వ్యక్తి, అతని జీవితంలోకి వచ్చిన ప్రేమ చుట్టూ కథ తిరుగుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ బలపడుతున్న కొద్దీ, అతని అనూహ్యమైన టైమ్ ట్రావెల్ వారి బంధానికి పెద్ద పరీక్షగా మారుతుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడ ? తెలుగులో అందుబాటులో ఉందా ? అనేది తెలుసుకుందాం పదండి.
హెన్రీ అనే వ్యక్తికి తన టైమ్ ట్రావెల్ పై ఎలాంటి నియంత్రణ ఉండదు. ఎప్పుడు గతంలోకి వెళ్తాడో, ఎప్పుడు భవిష్యత్తులోకి చేరుకుంటాడో అతనికే తెలియదు. ఈ విచిత్రమైన పరిస్థితి అతని జీవితాన్ని మొదటి నుంచే గందరగోళంగా మార్చేస్తుంది. కానీ క్లేర్ అతని జీవితంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారతాయి. వీరిద్దరి మధ్య ప్రేమ పెరుగుతున్న కొద్దీ, హెన్రీ టైమ్ ట్రావెల్ వారి జీవితాల్లో కొత్త సమస్యలను తీసుకొస్తుంది. ఒకసారి కలిసి ఉన్న వ్యక్తి మరుక్షణమే ఎక్కడ ఉంటాడో తెలియని పరిస్థితి.
క్లేర్ మాత్రం అతని కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. గతంలో కలిసిన క్షణాలు, వర్తమానంలో కలిసి గడిపిన సమయం, భవిష్యత్తులో ఎదురయ్యే సంఘటనలు ఇలా మూడు కాలాల మధ్య వారి ప్రేమ ప్రయాణం సాగుతుంది. హెన్రీకి తన ప్రయాణాలను ఆపే శక్తి వస్తుందా ? క్లేర్ తో అతని ప్రేమ ఈ కాలాల పరీక్షను తట్టుకోగలదా ? గతాన్ని మార్చే ప్రయత్నం భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ? చివరికి ఈ ప్రేమకథకు ఎలాంటి ముగింపు ఎదురవుతుంది ? ఒకరితో ఒకరు గడపాలనుకున్న ప్రతిసారీ కాలం వాళ్లను విడదీస్తుంటే, ఈ ప్రేమికులు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు ? అసలు అతని టైమ్ ట్రావెల్ కు కారణమేంటి ? ఈ ప్రయాణం చివరికి వారి ప్రేమను ఎటు తీసుకెళ్లింది ? అనేదే సిరీస్‌లో చూడాల్సిన అసలు విషయం.
‘ది టైమ్ ట్రావెలర్స్ వైఫ్’ ఇంగ్లీష్ ఫాంటసీ రొమాంటిక్ సిరీస్. టైమ్ ట్రావెల్, ఎమోషన్, ప్రేమ, ఫాంటసీ కలిసిన కథలను ఇష్టపడేవారికి ఈ సిరీస్ మంచి అనుభూతిని ఇవ్వొచ్చు. ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది. కానీ తెలుగులో లేదు.
Read Also: పాత జ్ఞాపకాల మధురమైన కాన్వాస్… సతీష్ వేగేశ్న మార్క్ ఫ్యామిలీ ఈవెంట్ విజువల్ ట్రీట్