OTT Movie: మలయాళీ మూవీకి ఒక్కసారి అలవాటు పడ్డామంటే.. మళ్లీ మళ్లీ చూస్తూనే ఉంటాం. ఓటీటీలు వచ్చిన తర్వాత వీటికి మరింత క్రేజ్ ఏర్పడింది. వాటిలో అలా రిలీజ్ అవ్వగానే.. వెంటనే చూసేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు ఇలాంటి మూవీలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. అందులో చూపించే చాలా సన్నివేశాలు మన రోజువారీ జీవితాలకు చాలా దగ్గరగా.. సహజంగా ఉంటాయి. అందుకే మన తెలుగు ప్రేక్షకులు కూడా మలయాళ చిత్రాలకు అంతగా కనెక్ట్ అయిపోతున్నారు. తాజాగా ఓటీటీలో విడుదలైన ‘వ్యసనసమేతం బంధుమిత్రాదికల్’ (Vysanasametham Bandhumithradhikal) మూవీ కూడా అలాంటిదే. ఇక కథలోకి వెళ్తే…
కథ ఏమిటంటే?:
కేరళలోని తిరువనంతపురం సమీపంలోని ఒక చిన్న గ్రామం తోన్నక్కల్‌లో జరిగే చిన్న కథ ఇది. అంత్యక్రియలు సమయంలో బంధువుల చిత్రవిచిత్ర ప్రవర్తనల ఆధారంగా ఈ కథ సాగుతుంది. కేవలం హాస్యమే కాకుండా భావోద్వేగాలు, సామాజిక అంశాలు కూడా ఈ మూవీలో అంతర్లీనంగా ఉంటాయి. ముఖ్యంగా సిట్చ్యువేషనల్ కామెడీ.. భలే నవ్విస్తుంది. దర్శకుడు, రచయిత ఎస్. విపిన్ (S. Vipin) చాలా చక్కగా ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ కథ మొత్తం ఒకే రోజులో జరుగుతుంది. కాస్త డార్క్ కామెడీ కూడా ఉంటుంది.
ముచ్చటైన కుటుంబం, కానీ..
సావిత్రి అమ్మ (Mallika Sukumaran)కు ఇద్దరు కుమార్తెలు, నలుగురు మనవరాళ్లు ఉంటారు. ఆమెకు తన పెద్ద మనవరాలు అంజలి (Anaswara Rajan) అంటే చాలా ఇష్టం. ఆమెను మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని, ఆమె సంతోషంగా ఉంటే చూడాలని సావిత్రి కలలుగంటుంది. ఈ సందర్భంగా ఒక అబ్బాయితో సంబంధం కుదురుస్తుంది. అయితే, అతడు చాలా పోసెసివ్. పైగా అంజలీ మాట్లాడే యాస అతడికి అస్సలు నచ్చదు. ఆమెను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మరోవైపు.. ఆమెను మరో యువకుడు వన్ సైడ్ లవ్ చేస్తుంటాడు. అతడి వల్ల అంజలి చిక్కుల్లో పడుతుంది. దీంతో అంజలి పెళ్లి చేసుకోవాలా? లేదా? అనే సందేహంలో పడుతుంది.
సావిత్రి మరణంతో కథలో మలుపులు
అయితే.. కొద్ది రోజుల్లో అంజలి ఎంగేజ్మెంట్ ఉందనగా అంజలి అమ్మమ్మ సావిత్రి గుండె పోటుతో చనిపోతుంది. దీంతో అంజలీతో సహా ఇంట్లోవారంతా షాకవుతారు. అంత్యక్రియల కోసం బంధువులంతా వస్తారు. అయితే ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఉంటారు. వారి ఆలోచనలు.. ప్రవర్తన, ఉద్దేశాలు చాలా చిత్రంగా ఉంటాయి. ఇవే ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిస్తాయి. మరికొన్ని సీన్లు మన నిజ జీవితంలో చూసే మనుషుల ప్రవర్తనకు దగ్గరగా ఉంటాయి. కుల రాజకీయాలు, ఆస్తులు.. ఇలాంటి చర్చలు జరుగుతుంటాయి. అది అంత్యక్రియల కార్యక్రమమే అయినా.. సన్నివేశాలు మాత్రం గిలిగింతలు పెడుతుంటాయి. ఈ మూవీ స్టార్టింగ్‌లో కాస్త నెమ్మదిగా సాగుతుంది. అది మలయాళ సినిమాల్లో చాలా సాధారణం. కానీ, తరువాతి భాగం మాత్రం కామెడీగా సాగిపోతుంది. ఈ మూవీ అస్సలు బోరు కొట్టదు. ఇది తెలుగులో కూడా ఉంది. ప్రస్తుతం ఇది Manorama Max ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: OTT Movie: అక్క అంటూనే.. టీనేజ్‌లో అలాంటి పని చేసే అబ్బాయి, ఆ కథతోనే సినిమా.. ఫుల్ కామెడీ భయ్యా!