OTT Movie : షాకింగ్ ట్విస్ట్ లతో మతిపోగొడుతున్న ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ కథ క్యాడెన్స్ అనే 17 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. బీచ్ లో జరిగిన ఒక ప్రమాదంలో ఆమె గతం మరిచిపోతుంది. ఆ తరువాత స్టోరీ నెక్స్ట్ లెవెల్ లో నడుస్తుంది. ఏం జరుగుతోంది ? నెక్స్ట్ ఏం జరగబోతోంది ? అనే ఇంటెన్స్ ని ఈ సిరీస్ క్రియేట్ చేస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘వీ వర్ లయర్స్’ (We were liars) 2025లో విడుదలైన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇ. లాక్‌హార్ట్ రాసిన 2014లోని బెస్ట్‌సెల్లింగ్ యంగ్ అడల్ట్ నవల ఆధారంగా జూలీ ప్లెక్, కరీనా ఆడ్లీ మెకెంజీ దీనిని సృష్టించారు. ఇందులో ఎమిలీ ఆలిన్ లిండ్, షుభం మహేశ్వరి, ఎస్తర్ మెక్‌గ్రెగర్, జోసెఫ్ జడా ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 జూన్ 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో 8 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్ విడుదలైంది. 2025 సెప్టెంబర్ 17 నుంచి సీజన్ 2కి రిన్యూల్ కూడా అయింది. IMDbలో 7.2/10 రేటింగ్ తో ఈ సిరీస్ ప్రశంసలు అందుకుంది.
కాడెన్స్ ఒక సంపన్న ఫ్యామిలీలోని అమ్మాయి. ప్రతి సమ్మర్ తన కజిన్స్ జానీ, మిర్రెన్ , బెస్ట్ ఫ్రెండ్ గట్ తో బీచ్‌వుడ్ ఐలాండ్‌లో గడుపుతుంది. వీళ్లను ఫ్యామిలీ మెంబర్స్ ‘లయర్స్’ అని పిలుస్తుంటారు. 16 ఏళ్ల వయసులో కాడెన్స్ తీవ్రమైన హెడ్ ఇంజరీతో బీచ్‌లో బట్టలు లేకుండా పడి ఉంటుంది. ఆమెకు ఉన్న ఆ సమ్మర్ జ్ఞాపకాలు మొత్తం పోతాయి. ఈ యాక్సిడెంట్ తర్వాత ఆమె మైగ్రేన్స్, పెర్కోసెట్ అడిక్షన్ తో చదువులో కూడా వెనుకబడుతుంది. ఆమె ‘లయర్స్’ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించినా, వాళ్లు రెస్పాండ్ అవ్వరు. 17 ఏళ్ల వయసులో, ఒక సంవత్సరం తరువాత అదే బీచ్ కి కాడెన్స్ తిరిగి వస్తుంది. గత ఏడాది జరిగిన యాక్సిడెంట్ గురించి ఎవరూ మాట్లాడకపోవడంతో, స్వయంగా తానే నిజాన్ని కనుగొనే ప్రయత్నంలో పడుతుంది.
సెకండ్ హాఫ్‌లో కాడెన్స్ జ్ఞాపకాలు క్రమంగా తిరిగి వస్తాయి. గతంలో డబ్బు, అధికారంతో వచ్చిన ఫ్యామిలీ సమస్యలను కాడెన్స్ గమనిస్తుంది. ‘లయర్స్’ అక్కడ ఉండే మాన్షన్‌ని తగలబెట్టాలని నిర్ణయిస్తారు. దీని వల్ల సమస్యలు తగ్గుతాయని అనుకుంటారు. కానీ ఈ ప్లాన్ ట్రాజెడీలో ముగుస్తుంది. కాడెన్స్ ఒక్కర్తీ తప్ప జానీ, మిర్రెన్, గట్ అందరూ ఫైర్‌లో చనిపోతారు. ఆమె ఈ ట్రాజెడీకి తానే కారణమని తెలుసుకుంటుంది. ఎందుకంటే ఆమె పెర్ల్ నెక్లెస్‌ని తీసుకోవడానికి వెళ్లటంతో అక్కడ ఆలస్యమైంది. ఇంతలోనే మిగతా వాళ్ళ ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ఇప్పుడు ఆమె లయర్స్‌తో స్పెండ్ చేసిన టైమ్ ని, వాళ్ల ఆత్మలతో పంచుకున్నట్లుగా చూపిస్తూ ఈ కథ ముగుస్తుంది.
Read Also : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్