Dowry harassment: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో వరకట్నం కోసం యువతిని అత్తమామలు చిత్రహింసలు పెట్టారు. గదిలో బంధించి ఆ యువతిని నానా ఇబ్బందులకు గురిచేశారు. ఏకంగా రూంలోకి పామును వదిలేశారు. పాము కాటేసిన కుటుంబ సభ్యులు ఆమె గురించి పట్టించుకోలేదు. ఆమెకు ఎలాంటి సాయం చేయలేదు. చివరకు ఆమె సోదరి అక్కడకు రావడంతో.. వెంటనే బాధిత మహిళను ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కాన్పూర్ నగరంలోని కల్నల్ గంజ్ లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. 2021 లో రేష్మకు షాన్ వాజ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం అయిన మరుసటి రోజు నుంచే రేష్మకు అత్తమామలు, భర్త నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. కొన్ని రోజుల క్రితం రేష్మ తన పుట్టింటి నుంచి రూ.1.5లక్షలు తీసుకువచ్చి అత్తమామాలకు అప్పగించింది. అయితే వారు ఇంతటితో ఆగకుండా మరో రూ.5లక్షలు తీసుకురావాలని ఇబ్బందికి గురి చేశారు. నిత్యం ఆమెను కొట్టడం, తన్నడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
చివరకు నాలుగు రోజుల క్రితం డబ్బులు తీసుకురావాలని ఒక రూంలో బంధించారు. చిత్ర హింసలు పెట్టారు. తిండి, మంచి నీళ్లు ఇవ్వకుండా ఆమెను ఇష్టమొచ్చినట్టు దాడి చేశారు. చివరకు బంధించిన రూంలోకి పామును వదిలేశారు. పాము అర్థ రాత్రి సమయంలో రేష్మను కాటు వేసింది. ఆమె పాము విషంతో కేకలు వేసింది. కానీ కుటుంబ సభ్యులు మహిళపై జాలి చూపకుండా.. రూం బయట నిలబడి నవ్వారు.
ALSO READ: Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?
చివరకు సమయానికి రేష్మ సోదిరి రిజ్వానా సంఘటనా స్థలానికి చేరుకుంది. తన సోదరి వెంటనే రూం లోకి వెళ్లి తన సోదరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించింది. వైద్యులు ఆమె చికిత్సను అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. సోదరి రిజ్వానా ఫిర్యాదు మేరకు పోలీసులు షాన్ వాజ్, అతని పేరెంట్స్, అన్నయ్య, సోదరి, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ALSO READ: EMRS Recruitment: ఈ ఉద్యోగం కొడితే గోల్డెన్ లైఫ్.. మొత్తం 7,267 ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు భయ్యా
ఈ సంఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినవారికి కఠినమైన శిక్ష విధించాల్సిన అవసరం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో మహిళల భద్రతకు ఎంత ముప్పు కలిగించాయో తెలియజేస్తాయని చెబుతున్నారు. ఈ మహిళ ధైర్యంగా నిలబడి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెకు న్యాయం జరగడానికి అవకాశం ఉంది. కానీ, ఇలాంటి ఘటనలు జరగకుండా నివారించడమే అత్యంత ముఖ్యమైన విషయం.