OTT Movie : సైకలాజికల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఒక హాంగ్ కాంగ్ సినిమా, దిమ్మతిరిగే ట్విస్టులతో ప్రేక్షకుల మతి పోగొడుతోంది. ఒక డిటెక్టివ్‌తో తిరిగే ఈ కథ క్లైమాక్స్ వరకు చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఇది 64వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, గోల్డెన్ లయన్ అవార్డుకు నామినేట్ అయింది. అలాగే 2008 హాంగ్ కాంగ్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘Mad Detective’ 2007లో విడుదలైన హాంగ్ కాంగ్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. దీనిని జానీ టో, వై కా-ఫై దర్శకత్వం వహించారు. మిల్కీవే ఇమేజ్ కంపెనీ, వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ కంపెనీ దీనిని నిర్మించింది. ఇందులో లాఉ చింగ్-వాన్ (బన్), ఆండీ ఆన్ (హో కా-ఆన్), లామ్ కా-తుంగ్ (కో చి-వై), కెల్లీ లిన్ (మే చెయుంగ్) ప్రధాన పాత్రలు పోషించారు. 1 గంట 29 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా , IMDbలో 7.1/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2007 నవంబర్ 29న హాంగ్ కాంగ్‌లో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం Netflix, Amazon Prime Video, Apple TVలో కాంటోనీస్, మాండరిన్ ఆడియోతో, ఇంగ్లీష్, తమిళ, తెలుగు సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ బన్ అనే డిటెక్టివ్‌తో స్టార్ట్ అవుతుంది. అతను మానసిక సమస్యలతో ఉండాడు. అయితే అతనికి ఇతరుల ఇన్నర్ పర్సనాలిటీస్ ని చూడగల అసాధారణ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ సినిమా ఓపెనింగ్‌లో, బన్ తన బాస్ రిటైర్మెంట్ పార్టీలో తన చెవిని కత్తిరించి గిఫ్ట్‌గా ఇస్తాడు. ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. దీంతో అతన్ని మాడ్ గా ముద్రవేసి, పోలీస్ ఫోర్స్ నుండి తొలగిస్తారు. ఇప్పుడు అతను తన భార్య మే తో ఒంటరి జీవితం గడుపుతుంటాడు. కానీ మే నిజమైన వ్యక్తి కాదని, అతని హాలుసినేషన్‌లో భాగమని తర్వాత తెలుస్తుంది.
ఐదు సంవత్సరాల తర్వాత హో కా-ఆన్ అనే ఇన్‌స్పెక్టర్, ఒక క్లిష్టమైన కేసును పరిష్కరించడానికి బన్ సహాయం తీసుకుంటాడు. ఈ కేసులో పోలీస్ ఆఫీసర్ వాంగ్ 18 నెలల క్రితం ఒక సస్పెక్ట్‌ను వెంబడిస్తూ మిస్సింగ్ అవుతాడు. అతని గన్‌తో ఆర్మ్‌డ్ రాబరీలు, హత్యలు జరుగుతాయి. వాంగ్‌తో ఉన్న అతని పార్టనర్ కో చి-వై ఒంటరిగా తిరిగి వస్తాడు. కానీ హో అతన్ని సస్పెక్ట్ చేస్తాడు. ఎవిడెన్స్ లేకపోవడంతో బన్‌ను ఆశ్రయిస్తాడు.
కో చి-వైలో ఏడు ఇన్నర్ పర్సనాలిటీస్ ఉన్నాయని బన్ గుర్తిస్తాడు. అతని లోపలి ఉన్న ఈ పర్సనాలిటీస్ కి, ఈ కేసుకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తాడు. బన్ తన విచిత్రమైన పద్ధతులతో ఈ కేసును ఛేదిస్తాడు. కానీ అతని హాలుసినేషన్స్, రియాలిటీ మధ్య క్లైమాక్స్ గందరగోళంగా మారుతుంది. బన్ అసాధారణ పద్ధతులను అర్థం చేసుకోవడానికి హో కష్టపడతాడు. కానీ అతని ఇన్‌స్టింక్ట్‌ను ట్రస్ట్ చేస్తాడు. చివరికి బన్ ఈ కేసును ఎలా డీల్ చేస్తాడు ? అసలు నేరస్థుడు ఎవరు ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ప్రధాన మంత్రితో సీక్రెట్ రిలేషన్… ఒక్క క్లిక్ తో డేంజర్ లో తల్లీ కూతుర్లు… నిమిషానికో ట్విస్ట్