OTT Movie : హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఇండియన్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ సినిమాలలో మన వాళ్ళు బాగానే ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కన్నడ సినిమాను చూస్తే విషయం అర్థమవుతుంది. ఈ కథ స్పేస్ లో ఉండే ఒక కొత్త ప్రపంచంలో జరుగుతుంది. యుద్ధాలతో ఆడియన్స్ న్ ని హడలెత్తిస్తున్న ఈ సినిమా రేటింగ్ లో కూడా దూసుకెళ్తోంది. IMDbలో దీనికి 9.5/10 రేటింగ్ ఉందంటేనే, ఈ కథ ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతోంది. ఈ సినిమాలో ఉండే విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘మోంక్ ది యంగ్’ (Monk The Young) మాస్చిత్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా. ఇందులో సరోవర్, సౌదర్య గౌడా, ఉషా భండారి, తరుణ్ భాస్కర్, కృతి భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజ్ అయింది. మార్చి 28 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది IMDbలో 9.5/10 రేటింగ్ పొందింది.
ఒక ఫాంటసీ ప్రపంచంలో ఈ కథ మొదలవుతుంది. ఇక్కడ ఒక భయంకరమైన యుద్ధం మొదలవుతుంది. ఇక్కడ తిరుగుబాటు దారులు అధికారం కోసం ఫైట్ చేస్తుంటారు. ఈ యుద్ధం యూనివర్స్‌లోని వేరే గ్రహాలలో ఉండే రాజ్యాలను కూడా షేక్ చేస్తుంది. ఇక్కడ రెండు ప్రధాన శక్తులు పోరాడుతుంటాయి. కొంతమంది విశ్వాన్ని తమ చేతులతో నియంత్రించాలని, మరి కొంతమంది మంచి పాలన కోసం ఫైట్ చేస్తుంటారు. మరో వైపు హీరో భిక్షాటన చేసే ఒక సన్యాసి. ఈ యుద్ధంలో అనుకోకుండా చిక్కుకుంటాడు. అతను ప్రశాంతంగా బతికే వ్యక్తి. అయితే అతని దగ్గర అద్భుతమైన శక్తులు కూడా ఉంటాయి. హీరో ఒక చిన్న ప్లానెట్‌లో తన పవర్స్ గురించి తెలుసుకుంటాడు.
Read Also : మిస్టీరియస్ హౌజ్… అడుగు పెడితే తిరిగిరారు… కామెడీ టైమింగ్ తో కట్టిపడేసే కన్నడ హర్రర్ మూవీ
ఇప్పుడు అతను తన శక్తులను యూజ్ చేసి పరిస్థితిని అదుపులోకి తే వాల్సి ఉంటుంది. దీని కోసం అతను ఆర్టిఫాక్ట్ అనే ఒక పాత వస్తువు ను కనిపెట్టాల్సి ఉంటుంది. ఇది సుప్రీమ్ పవర్ ను కలిగి ఉంటుంది. దీంతో విశ్వాన్ని కూడా కంట్రోల్ చేయవచ్చు. అతను ఒక యువరాణితో కలసి దానిని పొందడానికి ప్రయాణం మొదలు పెడతాడు. ఇక ఈ యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది. ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో హీరో గతం కూడా తెలుస్తుంది. అతను ఒక శాపం కారణంగా సన్యాసిగా మారినట్లు తెలుస్తుంది. ఈ క్లైమాక్స్ భయంకరమైన ట్విస్టులతో ముగుస్తుంది. చివరికి హీరో ఆ సుప్రీమ్ పవర్ ని కనిపెడతాడా ? ఈ యుద్దాన్ని ఆపగలుగుతాడా ? అతని గతం ఏమిటి ? అనే విషయాలను ఈ కన్నడ ఫాంటసీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.